సెక్స్ తర్వాత ఆడవారి శరీరం మారుతుందా?

First Published | Feb 8, 2024, 11:44 AM IST

సెక్స్ తర్వాత  ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. దీన్నే ఆఫ్టర్ సెక్స్ ఎఫెక్ట్స్ అంటారు. సెక్స్ తర్వాత ఆడవారి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

సెక్స్ తో ఎన్నో శారీరక, మానసిక సమస్యలు తగ్గిపోతాయి. అయితే లైంగిక కార్యకలాపాల తర్వాత ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. కానీ చాలా మంది ఈ సంకేతాలను పట్టించుకోకుండా ఉంటారు. 

ఆఫ్టర్ సెక్స్ ఎఫెక్ట్ అంటే ఏంటి?

నిపుణుల ప్రకారం.. సెక్స్ అనేది పురుషులతో సమానంగా వయోజన మహిళలకు కూడా సాధారణం. అందుకే స్త్రీల శరీరంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇది లైంగికంగా చురుకుగా ఉందని నిర్ణయిస్తుంది. 

సెక్స్ గురించి పూర్తిగా తెలియకపోవడం, అసురక్షిత లైంగిక పద్ధతులు ఎవరికైనా మంచివి కావు. దీనివల్లే స్త్రీ, పురుషులు లైంగిక సంక్రమణకు గురవుతారు. అందుకే సరైన అవగాహనతో ఎప్పుడూ సురక్షితమైన శృంగారాన్ని అభ్యసించడం చాలా ముఖ్యం. 

యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రకారం.. లైంగిక సంక్రమణ వ్యాధులు సెక్స్ తర్వాత రక్తస్రావం, గాయాలకు కారణమవుతాయి. జననేంద్రియ హెర్పెస్ కారణంగా దురద సమస్య ఉంటుంది. అలాగే స్పాటింగ్ క్లామిడియా లక్షణాలు కూడా కనిపిస్తాయి. మీకు ఎస్టిఐల లక్షణాలు శరీరంలో నెమ్మదిగా పెరుగుతాయి. ఇవి కొన్ని రోజులు, వారాలు లేదా నెలలు ఉంటాయి.
 


మహిళల్లో అసాధారణ సెక్స్ ప్రభావాలు

యోని చికాకు

సెక్స్ తర్వాత యోనిలో మంట రావడం.. సంక్రమణ లేదా డిస్పరేనియాకు సంకేతం కావొచ్చు. నిజానికి లూబ్రికేషన్ లేకపోవడం వల్ల యోనిలో మంట కలుగుతుంది. యోని కణజాలాలలో సాగదీయడం కూడా చికాకుకు కారణమని నిపుణులు అంటున్నారు. దీనిని బాధాకరమైన సెక్స్ అని కూడా పిలుస్తారు. ఈ రకమైన సమస్య చాలా కాలం పాటు ఉంటే హాస్పటల్ కు వెళ్లడం చాలా మంచిది. 
 

కండరాల తిమ్మిరి

కొంతమంది మహిళలు సెక్స్ తర్వాత కండరాల తిమ్మిరి సమస్యను ఎదుర్కొంటారు. సెక్స్ సమయంలో కండరాల ఒత్తిడి పెరగడం వల్ల చేతులు, పాదాలు, తొడల కండరాలు, తుంటిలో తిమ్మిరి పెరుగుతుంది. అలాంటప్పుడు శృంగారానికి ముందు నీళ్లను తాగడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉండదు. అలాగే కొన్ని యోగా ఆసనాలు కూడా కండరాల తిమ్మిరి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
 

యోని దురద

సెక్స్ సమయంలో ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, ఎస్టీఐ ఇన్ఫెక్షన్లు యోని దురదకు కారణమవుతాయి. అలాగే స్కిన్ సెన్సిటివిటీ, కండోమ్స్ వాడకం వల్ల కూడా దురద సమస్య పెరుగుతుంది. ఇలాంటి సమస్యను తగ్గించుకోవాలంటే సెక్స్ తర్వాత యోనిని శుభ్రం చేసుకోవాలి.

మూడ్ స్వింగ్స్

సెక్స్ తర్వాత ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ ఆ తర్వాత కొంతమంది ఆడవారు ఏడవడం, మూడీగా ఉంటుంటారు. ఇది సహజం. దీన్నే హ్యాపీ టియర్స్ అని కూడా అంటారు. ఇలాంటి పరిస్థితిని పోస్ట్కోయిటల్ డిస్ఫోరియా అంటారట. దీనివల్ల మహిళలు భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతుంటారు. 

Latest Videos

click me!