అమలిన శృంగారానికి.. అద్భుతమైన చిట్కాలు.. ట్రై చేయండి..

First Published | Apr 19, 2021, 3:57 PM IST

ప్రేమ ఓ అద్భుతమైన భావన.. ఓ విచిత్రమైన అనుబంధం.. శృంగార సంబంధం ఒక్కటే దీనికి సరిపోదు. ప్రేమించిన వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండాలంటే చాలా అవగాహన, నిబద్ధత, త్యాగం, రాజీ పడడం అవసరం అవుతాయి. 

ప్రేమ ఓ అద్భుతమైన భావన.. ఓ విచిత్రమైన అనుబంధం.. శృంగార సంబంధం ఒక్కటే దీనికి సరిపోదు. ప్రేమించిన వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండాలంటే చాలా అవగాహన, నిబద్ధత, త్యాగం, రాజీ పడడం అవసరం అవుతాయి.
అయితే ఇవన్నీ మీ మనసు గెలిచినవారికోసం.. మీరిష్టపడిన వారికోసం చేయడంలో కష్టం అనేది తెలియదు. నిజంగా మీరు మీ భాగస్వామిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే.. ఆ బంధం.. మీ అనుబంధాన్ని జీవితకాలం కొనసాగించేలా చేయాలంటే అమలిన శృంగారంతో పాటు.. వారికిష్టమైన కొన్ని చిన్న చిన్నపనులూ మిమ్మల్ని మరింతగా ప్రేమ మైకంలో పడేలా చేస్తాయి.

మీ భాగస్వామికి చేయడం అస్సలు ఇష్టపడని ఒక ఇంటి పనిని తన బదులు మీరు చేసి చూపించండి. బట్టలు ఐరన్ చేయడమో, డస్టింగ్ చేయడమో, వంట చేయడమో, గార్డెనింగో.. ఏదైనా సరే తనకోసం మీరు చేసి పెట్టండి. అది మీ మీద ప్రేమను మరింత పెంచుతుంది.
మీ భాగస్వామి చూడాలనుకున్న ప్రాంతానికో.. చేయాలనుకున్న పనో.. కొనుక్కోవాలనుకున్న నగో.. అలా తన బకెట్ లిస్టులోని ఓ కోరికను సర్ ఫ్రైజింగ్ గా మీరు తీర్చేయండి.
ఆ కోరిక చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు.. కానీ అది మీరు చేసే సర్ ఫ్రైజ్ వల్ల తనలో ఆనందాన్ని చూస్తారు. తన కోరికలు మీకు చెప్పడం వల్ల దాని మీద మీరు శ్రద్ధ చూపించారన్న విషయం తనకు అర్థమవుతుంది.
మీరు పనిమీద ఏదైనా ఊరికి వెళ్లినప్పుడు.. లేదా ఆఫీస్ టూర్ మీద వెళ్లినప్పుడు పని అయిపోయాక.. ఖాళీ చేతులతో తిరిగి రాకుండా తనకోసం ఏదైనా కొనుక్కురండి. అక్కడికి వెళ్లినా తనకోసం మీరు ఆలోచిస్తున్నారన్న విషయం మీ భాగస్వామికి అర్థమవుతుంది.
మీ భాగస్వామికి ఇష్టమైన అభిరుచి ఏమిటో తెలుసుకోండి. దాని మీద మీరు ఆసక్తి చూపించండి. ఒకవేళ మీరు ఇంతకు ముందు తన అలవాట్లు, అభిరుచుల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా.. ఇప్పుడు మొదలు పెట్టండి. ఇదే వారిలో మీ పట్ల శృంగారాసక్తిని మరింత పెంచుతుంది.
రోజు ఎంత దరిద్రంగా గడిచినా.. మీ చిన్న గెస్చర్ తో దాన్ని మంచిగా మార్చేయవచ్చు.. రోజులో చెడు వార్తలు విన్నా, ఉద్యోగంలో పని ఎక్కువై చికాకులో ఉన్నా,.. అది ఎలాంటి మూడ్ అయినా సరే ఓ చక్కటి పూలగుత్తో, తనకిష్టమైన ఫ్లైవర్డ్ ఐస్ క్రీమో ఇవ్వండి.
రోజంతా పని ఒత్తిడితో గడిచినా.. మీ భాగస్వామి ప్రమోషన్ వచ్చినా.. అది ఏ సందర్భమైనా కావచ్చు.. ఎండ్ ఆఫ్ ద డే మీరు తనను పికప్ చేసుకోండి. సర్ ఫ్రైజ్ చేయండి.. అది మిమ్మల్ని మరింతగా ప్రేమించేలా చేస్తుంది.
మీ భాగస్వామి మనసును చదవండి. ముఖ కవళికలతో వారి మూడ్ ఎలా ఉందో తెలుసుకోండి. దాన్ని మార్చడానికి మీరేం చేయగలరో అడగండి.
మీ భాగస్వామిని సర్ ఫ్రైజ్ చేయాలంటే ఓ పెద్ద గ్రాండ్ రెస్టారెంట్లోనే పార్టీ ఇవ్వాలని ఏం లేదు. చక్కగా ఇంట్లోనే కాస్త మార్పులు, చేర్పులతో చిన్నపాటి పిక్నిక్ ఏర్పాటు చేయండి. వారికిష్టమైన ఆహారాన్ని, వైన్, డెజర్ట్ ఏర్పాటు చేయండి.

Latest Videos

click me!