వైఫ్ తో లైఫ్ బోర్ కొట్టిందా..? ఈ చిట్కాలతో బెడ్రూంలో రెచ్చిపోవచ్చు..!

First Published Apr 5, 2021, 3:01 PM IST

మొదట్లో ఉన్న ప్రేమ ఉండదు. చిన్న విషయాలకే విస్కుకోవడం లాంటివి చేస్తారు. దేనిని ఆస్వాదించలేరు. 

జీవితాంతం ప్రేమను పొందాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అయితే.. అది ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. రోజులు గడిచే కొద్ది.. కొందరిలో ప్రేమ పెరుగుతుంటే... మరికొందరిలో మాత్రం ప్రేమ తగ్గిపోతుంది. కేవలం ప్రేమ మాత్రమే కాదు...రొమాన్స్, శృంగారం విషయంలోనూ ఇదే వర్తిస్తుంది.
undefined
కొందరు పెళ్లైన కొంతలో విపరీతంగా శృంగారాన్ని ఆస్వాదించగలరు. కానీ కొందరు మాత్రం అలా ఆస్వాదించలేరు. మొదట్లో ఉన్న ప్రేమ ఉండదు. చిన్న విషయాలకే విస్కుకోవడం లాంటివి చేస్తారు. దేనిని ఆస్వాదించలేరు. మరి అలాకాకుండా.. దంపతుల మధ్య ప్రేమ, కలయిక ఎప్పుడూ కొత్తగా ఉత్సాహంగా ఉండాలంటే.. కొన్ని రూల్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూస్తే...
undefined
మీ భాగస్వామిని ఎప్పటికప్పుడు రకరకాలుగా ఆశ్చర్యపరచడం మర్చిపోవద్దు. చిన్న బహుమతితో సర్ ప్రైజ్ చేయాలి, మీ భాగస్వామికి ఇష్టమైన భోజనం వండటం లాంటివి చేయాలి. లేదంటే వీకెండ్స్ లో సరదాగా ఎక్కడైనా గడపడానికి వెళ్లిరావడం లాంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల వారి బంధం కలకలం ఆనందంగా సాగుతుంది.
undefined
కొందరు దంపతులు వారి రిలేషన్ మొదట్లో.. క్రమం తప్పకుండా స్పెషల్ డేట్స్ కి వెళుతుంటారు. వాటిని రోజులు గడిచే కొద్దీ ఆపేస్తుంటారు. అయితే.. అలా ఆపకూడదట. తీరిక దొరికిన ప్రతిసారీ తమకంటూ సమయం కేటాయించుకుంటూ ఉండాలి. డేట్స్ కి వెళ్లాలి. ఏకాంతంగా గడపాలి. ఇలా చేయడం వల్ల కూడా బంధం మరింత బలపడుతుంది.
undefined
ఒకరికొకరు దూరంగా ఉండే సందర్భాలు కూడా రావొచ్చు. అంటే.. ఒకరు ఆఫీసులో ఉంటే మరొకరు ఇంట్లో ఉండొచ్చు. అలాంటి సమయంలో అప్పుడప్పుడు రొమాంటిక్ మెసేజ్ లు పంపాలి. ఇలా చేయడం వల్ల కూడా వారు రోజూ ప్రేమలో పడినట్లు భావిస్తుంటారు.
undefined
ఎప్పుడూ ఒకే రెస్టారెంట్ కి కాకుండా.. ఏదైనా కొత్త దానికి వెళుతూ ఉండాలి. అక్కడ డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేయాలి. లేదంటే ఏదైనా అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్లేస్ కి వెళ్లడం.. థ్రిల్ కలిగించే పనులు చేయడం లాంటివి తరచూ చేయాలి.
undefined
మీ పార్ట్ నర్ పై రొమాంటిక్ ఫీల్ ని వ్యక్తపరచడంలో ఎలాంటి సంకోచం పెట్టుకోకూడదు. రోజుకొకసారైనా మీరు తనని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పాలి. సెక్స్ లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా మనసు విప్పి మాట్లాడుకోవాలి.
undefined
కపుల్ గోల్స్ పెట్టుకోవాలి. అంటే... ఎదైనా వెకేషన్ కి వెళ్లాలని అనుకుంటే..దానికి తగిన డబ్బులు ఇద్దరూ కలిపి దాచుకోవడం లాంటివి చేయాలి. ఎవరు ముందుగా దానిని ఫిల్ చేస్తారు అనే కాంపిటేషన్ పెట్టుకోవడం లాంటి సరదా గేమ్స్ పెట్టుకోవాలి. ఇంట్లోని పనులు కలిసి షేర్ చేసుకోవాలి.
undefined
click me!