కాపురం సజావుగా సాగాలంటే భార్యభర్తల మధ్య సాన్నిహిత్యం చాలా ముఖ్యం. ఇది వారి సంసారజీవితాన్ని, శృంగార జీవితాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. అయితే కాలక్రమంలో కొన్నిసార్లు ఒకరి మీద ఒకరికి ఆకర్షణ తగ్గిపోతుంది. చాలా సందర్భాల్లో భార్యలు.. భర్తతో సన్నిహితంగా సమయం గడపడానికి ఆసక్తి చూపించరు.
చిలిపి రొమాన్స్, రతిక్రీడ.. చిన్న చిన్న అల్లర్లు ఇవి వారికి బోర్ గా, చిరాకుగా ఉంటాయి. దీంతో భర్తకు దూరమవుతూ ఉంటారు. దీన్ని అలాగే వదిలేయకుండా కారణం తెలుసుకుంటే మీరు మళ్లీ మునుపటిలా.. చిలకాగోరింకల్లా.. ఆనందంగా గడపొచ్చు.
స్త్రీల విషయానికి వచ్చేసరికి సెక్స్ అనేది రొటీన్ కాదు. అది మానసికపరమైనది.. మీ మీద ఇష్టం లేకున్నా, వైవాహిక జీవితంలో అసంతృప్తిగా ఉన్నా అది డైరెక్ట్ గా మీ శృంగార జీవితం మీద పడుతుంది. అందుకే ముందుగా ఆమెతో మాట్లాడండి. ఎందుకలా ఉంద. అసలు సమస్య ఏంటో కనుక్కోండి. శృంగారం విషయంలో ఏదైనా ఇబ్బంది పడుతుంటే ఇద్దరూ కలిసి పరిష్కరించుకోండి.
మీరు మీ భార్య నమ్మకాన్ని వమ్ము చేసినట్లైతే ఆమె మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలున్నాయి. భర్తగా జీవితకాలం నమ్మకంగా ఉంటానని చేసిన వాగ్ధానాన్ని మీరు బ్రేక్ చేస్తే అది పెద్ద సమస్యగా మారుతుంది. ఇతర సంబంధాలు మీ అసలు జీవితాన్ని నాశనం చేస్తాయి. అందుకే గతంలో చేసిన తప్పుల్ని గుర్తించండి.. అలాంటి తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి.
శృంగారంలో బాధ : వయసుతో పాటు స్త్రీ, పురుషుల్లో హార్మోన్లలో మార్పులు సహజమే. ముఖ్యంగా స్త్రీలలో పీరియడ్స్, మెనోపాజ్, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ శృంగారాన్ని బాధాకరం చేస్తాయి. అలాంటి సమయంలో ఆమె రిలాక్స్ గా ఉండే సమయంలో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నించండి.
పెళ్లైనకొత్తలో ఉన్నట్టుగా రోజులు గడుస్తుంటే.. ఉండదు. ఇంటి బాధ్యతలు, ఆఫీసు పని ఒత్తిడులు ఎక్కువవుతుంటాయి. అలాంటి సమయాల్లో శృంగారం మీద ఆసక్తి తగ్గడం మామూలే. ఆఫీసు వర్కులో ఎలాగూ భాగం పంచుకోలేరు కానీ ఇంటి పనిలో తనకు సాయం చేయడం వల్ల మళ్లీ తనను ఆకర్షించవచ్చు.
శృంగారం అంటే రెండు దేహాల కలయిక. ఇది ఒకేసారి బెడ్రూంలోకి వెళ్లగానే చేసే పని కాదు. రోజులో అప్పుడప్పుడు ఒకరిని ఒకరు తాకుతుండాలి. అంటే చక్కగా భుజం మీద చేయి వేసి మాట్లాడడమో, చక్కటి ముద్దు పెట్టడమో, హగ్ ఇవ్వడమో..ఇలా రోజువారీ కార్యక్రమంలో ప్రేమతో కూడిన స్పర్శ దూరమవ్వడం వల్ల కూడా తాను మిమ్మల్ని దూరం పెట్టవచ్చు.
ఇదే కారణం అయితే ఒకసారి గమనించండి.. రోజుల తరబడి ఇది ఇలాగే కొనసాగితే మీ బంధానికి బీటలు వారడం ఖాయం. అందుకే కాస్త సమయం ఆమెకు కేటాయించండి. తియ్యని మాటలు, ఆప్యాయతతో కూడిన స్పర్శ మీ మధ్య ఇంటిమసిని మళ్లీ తీసుకువస్తుంది.
ఏదైనా డిప్రెషన్ తో బాధపడుతుందా? గమనించండి. ఇలాంటి సందర్బాల్లో సెక్స్ అనేది చాలా చిరాకైన విషయంగా అనిపిస్తుంది. అందుకే ముందుగా ఆమెలో అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే గుర్తించండి. ఆమె దానినుంచి బయటపడేలా సాయం చేయండి.
శృంగారం మరీ రొటీన్ గా మారిపోయినప్పుడు కూడా ఆమె మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలున్నాయి. అందుకే ఏదైనా కొత్తగా ట్రై చేయండి. శృంగారంలో పొజిషన్స్ మార్చడం.. లేదా ఏదైనా హోటల్ లో స్టే చేయడం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం ఇలా.. అంతేకాదు దీంతోపాటు తనతో శృంగారం ఒక్కటే కాదు.. చిలిపి మాటలు కూడా హాయినిస్తాయని తెలిసేలా చేయండి.
శృంగారం మరీ రొటీన్ గా మారిపోయినప్పుడు కూడా ఆమె మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలున్నాయి. అందుకే ఏదైనా కొత్తగా ట్రై చేయండి. శృంగారంలో పొజిషన్స్ మార్చడం.. లేదా ఏదైనా హోటల్ లో స్టే చేయడం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం ఇలా.. అంతేకాదు దీంతోపాటు తనతో శృంగారం ఒక్కటే కాదు.. చిలిపి మాటలు కూడా హాయినిస్తాయని తెలిసేలా చేయండి.