డేటింగ్ : మీరు ప్రత్యేకవ్యక్తి అయితే... శృంగారం ఒక్కటే సరిపోదు..

First Published | Apr 12, 2021, 5:09 PM IST

మనసుకు నచ్చిన వ్యక్తిని డేటింగ్ కి ఒప్పించడం.. అందులోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎన్నో అడ్డంకులు, మరెన్నో శషభిషలు తానిష్టపడ్డ వ్యక్తిని తనంటే ఇష్టమో లేదో.. తీరా చెప్పాక ఎలా రియాక్ట్ అవుతారో.. అర్థం చేసుకోకపోగా మొదటికే మోసం వస్తుందేమో.. ఇలాంటి అనేక అనుమానాలను, గందరగోళాలను దాటుకుని ఒక ఇష్టం.. ప్రేమగా మారి డేటింగ్ దాకా సాగే ప్రయాణం చాలా దీర్ఘంగా ఉంటుంది. 

మనసుకు నచ్చిన వ్యక్తిని డేటింగ్ కి ఒప్పించడం.. అందులోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎన్నో అడ్డంకులు, మరెన్నో శషభిషలు తానిష్టపడ్డ వ్యక్తిని తనంటే ఇష్టమో లేదో.. తీరా చెప్పాక ఎలా రియాక్ట్ అవుతారో.. అర్థం చేసుకోకపోగా మొదటికే మోసం వస్తుందేమో.. ఇలాంటి అనేక అనుమానాలను, గందరగోళాలను దాటుకుని ఒక ఇష్టం.. ప్రేమగా మారి డేటింగ్ దాకా సాగే ప్రయాణం చాలా దీర్ఘంగా ఉంటుంది.
undefined
మామూలు ప్రేమలోనే ఇలా ఉంటే ఇక ఆ వ్యక్తులు ప్రత్యేకమైనవారైతే.. వారి ప్రేమ భిన్నమైనదైతే.. అంటే.. మీరు LGBTQ కమ్యూనిటీకి చెందిన వారైతే.. సామాజికంగా అనేక కట్టుబాట్లు, నిషేధాల మధ్య మీ ప్రేమ డేటింగ్ దాకా వెళ్లడం చాలా చాలా కష్టమైన పని.
undefined

Latest Videos


గే, బై సెక్సువల్ మనుషులను ఆమోదించడమే పెద్ద సమస్యగా ఉన్న సమాజంలో ఆడ,ఆడ.. లేదా మగ, మగ డేటింగ్ అంటే చాలా పెద్ద విషయం. కాకపోతే వారి మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ ఈ పరిస్థితిని అధిగమించేలా చేస్తుంది. మీరు గేనా, బై సెక్సువలా, లెస్బియనా... అనేదానికంటే మీ స్వచ్ఛమైన ప్రేమ అనేదే ముఖ్యం. అందుకే ఇలాంటి వారికోసం కొన్ని డేటింగ్ చిట్కాలు..
undefined
మీరు ప్రత్యేకమైనవారు కాబట్టి ప్రత్యేకమైన పురుషులతోనే ఆకర్షణలో పడడంలో తప్పులేదు. అయినా కూడా మిమ్మల్ని ఆకర్షించే వేరే వ్యక్తులతో కలవడం మానకండి. మీ అభిరుచులు, అభిప్రాయాలతో కలవని అబ్బాయిలతో కూడా ఓపెన్ గా ఉండండి. దీనివల్ల మీకు మంచి భాగస్వామి దొరికే అవకాశం ఉంది.
undefined
ప్రత్యక్షంగా కలవడానికి ముందు వీడియో చాట్...మీకు ఆన్ లైన్ లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు.. అతనితో మీరు పర్సనల్ గా కలిసి మనసులు కలబోసుకోవాలనుకున్నారనుకోండీ.. తొందరపడకండి. ముందు వీడియో కాల్ చేసి మాట్లాడుకోండి. దీనివల్ల ఆ వ్యక్తి మీద మీకు నిజంగానే ఇష్టం ఏర్పడుతుందా, లేదా అనేది క్షణాల్లో తేలిపోతుంది.
undefined
ఇలా చేయడం వల్ల అతన్ని కలవడానికి మీరు పడే ఎగ్జైట్ మెంట్.. ప్రత్యేకంగా తయారవ్వడం.. మాట్లాడడానికి ప్రిపేర్ అవ్వడం అన్నీ వృథా కాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇవన్నీ చేయడం వల్ల మీరు డిసప్పాయింట్ మెంట్ కాకుండా ఉండగలుగుతారు.
undefined
ముందస్తు ప్లాన్ లు వద్దు.. ఇద్దరి మనసులు కలిశాయి. ఇక నేరుగా కలవడమే తరువాయి అనుకున్నప్పుడు డేటింగ్ కి ముందుగానే తేదీలు ఫిక్స్ చేయకండి. ముందుగానే ప్లాన్ చేయడం వల్ల రోజులు గడిచిన కొద్దీఉత్సాహం, ముందున్న వేగం తగ్గిపోతాయి. లేదా అనుకోని పరిస్తితులు ఎదురై మీ కలయిక వాయిదా పడచ్చు.
undefined
అందుకే ఒక వ్యక్తితో మాట్లాడిన కొద్దిసేపటికే మొదటిసారి కలిసే తేదీని ప్లాన్ చేయండి. ఆ తరువాతే రెండోసారి కలయిక గురించి ఆలోచించండి.
undefined
శృంగారం ఒక్కటే కాదు..శృంగారం నిజంగా అద్భుతంగా ఉంటుంది. మీ ప్రేమకు పరిపూర్ణతను చేకూరుస్తుంది. అయితే అన్నింటికంటే ఆరోగ్యకరమైన లైంగిక జీవితం గడపడం ముఖ్యం. మీ సంబంధం కనీసం ఓ సంవత్సరానికి పైగా ఉండాలని కోరుకుంటే, మీరు అతనితో డేటింగ్ చేయడానికి ఇతర కారణాలు ఉండాలి, అది కేవలం శృంగారంతో ముడిపడి ఉండకూడదు. రోజులు గడిచిన కొద్దీ మీ రిలేషన్ లో శృంగారం కంటే అవతలి వ్యక్తి లోని వ్యక్తిత్వం ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.
undefined
ఆకర్షణ... ప్రేమ కాదు..హ్యాండ్ సమ్ గా, సరదాగా, ఆకర్షణీయంగా, ప్రేమగా, దయగా ఇలా సకల సుగుణాలూ ఉన్నా కూడా ఆ వ్యక్తిలో మీకు స్పార్క్ కనిపించకపోతే.. అతన్ని చూడగానే ఆకర్షణ తప్ప మరే ఫీలింగ్ మీలో కలగకపోతే తొందరపడకండి. అది ప్రేమగా మారితే ఓకే లేదంటే వదిలేయండి.
undefined
మొదటి రోజే అన్నీ..మొదటిసారి డైటింగ్ కి వెళ్లిన రోజూ మీ ఇష్టాఇష్టాలు మాట్లాడండి.. ఆసక్తికరమైన విషయాలు చెప్పండి. వివాదాస్పదమైన అంశాల మీదా చర్చించడానికి బయటపడకండి. బంధం మొదట్లోనే తెగిపోతుందని భయపడకండి రిస్క్ తీసుకోండి. మీరు ఎంత ఒపెన్ గా ఉండే మీ బంధం అంతగా మరిన్ని డేటింగ్ లతో ముందుకు సాగుతుంది. మీ మొదటి కలయికను చిరస్మరణీయంగా చేస్తుంది.
undefined
అంచనాలు వద్దు..డేటింగ్ మీద విపరీతమైన అంచనాలతో వెళ్లకండి. మీకు ఆ వ్యక్తి సూటవ్వకపోవచ్చు, ఈ రిలేషన్ వర్కవుట్ కాదు అనుకుంటూ వెళ్లండి. అవతలి వ్యక్తి మీ అంచనాలను అందుకునే స్తాయిలో లేకపోయినా.. అతని మీద శ్రద్ధ చూపించండి. మిమ్మల్ని ఆకట్టుకునే ఏదో అంశం అతనిలో ఉండే ఉంటుంది. ఆ అవకాశం అతనికి ఇవ్వండి. మీరు ఏ అంచనా పెట్టుకోకపోవడం వల్ల ఈ అద్భుతం జరిగే అవకాశం ఉంటుంది.
undefined
click me!