కరోనా రాకతో మనుషుల మధ్య సంబంధాల్లో చాలామార్పు వచ్చింది. అంతకు ముందు పట్టించుకోని చాలా విషయాలు ఇప్పుడు అతి ముఖ్యమైనవిగా మరిపోయాయి. చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త పెరిగింది. అంతేకాదు భార్యభర్తల మధ్య అనుబంధాన్ని ఈ మహమ్మారి మరింత బలోపేతం చేసింది.
రెప్పపాటులో వేలాది ప్రాణాల్ని హరించింది. మనకు ప్రియమైన వాళ్లు కళ్లముందే కానరాని లోకాలకు వెళ్లిపోతుంటే.. కనీసం దగ్గరకువెళ్లి తనవితీరా ఏడవలేని దుస్థితిని కలిగించింది. మనిషికి, మరో మనిషి ఎంత ముఖ్యమో తెలిసేలా చేసింది. ముఖ్యంగా జీవితకాల బంధంతో ఒక్కటైన భార్యభర్తల మధ్య ఇదివరకు లేని అప్యాయతా, అనురాగాలను, ప్రేమలోని గాఢతను పెంచింది.
స్పష్టంగా చెప్పాలంటే కరోనా ప్రేమించడం ఎలాగో నేర్పింది. ప్రేమించబడడం ఎలాగో తెలుసుకునేలా చేసింది. భాగస్వామి పట్ల బంధాన్ని బలోపేతం చేసింది. అలాంటి కొన్ని అంశాలు ఇవి..
నీకు నేను.. నాకు నువ్వు.. :కరోనా, లాక్ డౌన్ వివాహాల రూపు రేఖల్నే మర్చేశాయి. యేడాదికి పైగా కొనసాగుతున్న కరోనా కారణంగా అనేక పెళ్లిళ్లు చాలా సింపుల్ గా బంధుమిత్రులు, స్నేహితులు లేకుండానే జరిగిపోయాయి. విలాసవంతమైన వివాహాలకు తెరపడింది. ఆన్ లైన్లో ఆశీర్వాదాలు, వాట్సాప్ లో గ్రీటింగ్స్ తోనే పెళ్లిళ్లు జరిగిపోయాయి. వీటన్నింటి మధ్య ఒకరికొకరి తోడు ఎంత ముఖ్యమో తెలిసి వచ్చింది. నీకు నేను, నాకు నువ్వు అంతే.. అనే భావన పెరిగి, ప్రేమను మరింత గాఢంగా మార్చేసింది.
ఒకరికొకరు :భాగస్వాములైన జంటలు చాలాసార్లు ఎవరి జీవితాలతో వాళ్లు పోరాటంలో ఉంటారు. కొన్నిసార్లు భాగస్వామి సహకరించరని, మరికొన్నిసార్లు ఎందుకు ఇబ్బంది పెట్టడం అని, ఇంకొన్నిసార్లు స్వంతంగా చేసుకోవాలనే ఆలోచన.. దీంతో మొత్తానికి జంటగా అయినా ఒంటరిగా సమస్యలతో పోరాడుతుంటారు. కానీ కరోనా దీన్ని మార్చేసింది. ఏ సమస్య వచ్చినా ముందు భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకునేలా, ఇద్దరూ కలిసి పోరాడేలా పరిస్థితిలో మార్పు తెచ్చింది. దీంతో తామిద్దరూ ఒకరికొకరు అనే భావన పెరిగేలా చేసింది.
ఒకరికొకరు :భాగస్వాములైన జంటలు చాలాసార్లు ఎవరి జీవితాలతో వాళ్లు పోరాటంలో ఉంటారు. కొన్నిసార్లు భాగస్వామి సహకరించరని, మరికొన్నిసార్లు ఎందుకు ఇబ్బంది పెట్టడం అని, ఇంకొన్నిసార్లు స్వంతంగా చేసుకోవాలనే ఆలోచన.. దీంతో మొత్తానికి జంటగా అయినా ఒంటరిగా సమస్యలతో పోరాడుతుంటారు. కానీ కరోనా దీన్ని మార్చేసింది. ఏ సమస్య వచ్చినా ముందు భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకునేలా, ఇద్దరూ కలిసి పోరాడేలా పరిస్థితిలో మార్పు తెచ్చింది. దీంతో తామిద్దరూ ఒకరికొకరు అనే భావన పెరిగేలా చేసింది.
ఓపిక, సహనాల్ని నేర్పించింది :లాక్ డౌన్ తో అందరూ ఇంటికే పరిమితం కావడంతో ఒకరి సాన్నిధ్యంతో మరొకరు 24 గంటలూ ఉండాల్సి వచ్చింది. దీనివల్ల అడ్జెస్టింగ్ మెంటాలిటీతో పాటు, అన్ని విషయాల్లోనూ ఓపిక, సహనం పెరిగేలా చేసింది.
భాగస్వామి మీద నమ్మకం పెంచింది :లాక్ డౌన్ సమయంలో భాగస్వాములిద్దరూ వేరు వేరు నగరాలు, దేశాలు, ప్రదేశాల్లో ఉండాల్సి రావడం, దగ్గరున్నా శారీరక సంబంధం లేకపోవడం ఇవన్నీ అభద్రతకు, అపనమ్మకానికి దారి తీశాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక జంటలు ఈ సమస్య బారిన పడ్డాయి. అయితే భాగస్వామి మీద వారు పెట్టుకున్న నమ్మకమే వారిని విజయవంతమైన జంటలుగా మిగిల్చింది.
హద్దులు లేని ప్రేమ :లాక్ డౌన్ నేర్పిన మరో అద్భుతమైన ప్రేమపాఠం హద్దుల్ని చెరిపేయడం. ఇంటికే పరిమితమైన కాలంలో ఇంటర్నెటే ప్రపంచంగా మారిపోయింది. దీంతో దేశాలు, ఖండాలతో సంబంధం లేకుండా.. దూరాభారాలను లెక్కలు వేయకుండా నచ్చిన వ్యక్తితో ప్రేమలో పడిపోయారు. ఈ ఇంటర్నెట్ ప్రేమలు ఆ తరువాత వారి భావి జీవితాన్ని మంచి బాటలు వేసేలా మారిపోయాయి. ప్రేమకు హద్దులు లేవని తెలిసేలా చేసింది.
ప్రతిక్షణం విలువైనదే...కరోనా ఎన్నో అందమైన ప్రేమకథలకు ముగింపు పలికింది. భాగస్వాముల్లో ఎంతోమందిని దూరం చేసింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో వేలాదిమంది తమ ప్రియతములను కోల్పోయి వేదన అనుభవిస్తున్నారు. ఇది ఎన్నో జంటలకు గుణపాఠంగా మారింది. కలిసి ఉన్న క్షణాల విలువను గుర్తించేలా చేసింది. తమ ప్రియమైన వాళ్లతో గడిపే ప్రతీ క్షణం అపురూపమైనదే అనే బావన కలిగించింది.
ఐలవ్యూ అని పలికినదా..ప్రేమను వ్యక్తపరిచే మార్గాల్ని మరింతగా పెంచింది. వర్క్ ఫ్రం హోం ఉన్న ఉద్యోగులందరికీ భాగస్వామికి ఇష్టమైన ఆహారాన్ని వండడం నేర్పింది. తద్వారా వారిమీద తమ ప్రేమను వ్యక్తపరిచేలా చేసింది. ఇలా “ఐ లవ్ యు” అని చెప్పే అనేక మార్గాలను మహమ్మారి నేర్పింది.