ప్రేమించడం.. ప్రేమలో పడడం ఓ అందమైన అనుభూతి.. అద్భుతమైన భావన.. ఒకరికోసం ఒకరు ఆరాటపడడం, ఒకరి సన్నిధిలో మరొకరు స్వాంతన పొందడం.. ఒకరికోసం ఒకరు ఎదురుచూడడం.. విరహంతో వేగి పోవడం.. ఒకర్ని చూడగానే ఒకరి కళ్లల్లో మెరుపులు.. చిలిపి అల్లర్లు, చిరు తగాదాలు, త్యాగాలు.. బుజ్జగింపులు, దొంగ ముద్దులూ.. అదొక మధురమైన మనసు మాయ.
ఒక రొమాంటిక టచ్ మీ ప్రేమను మరింత బలంగా, తీయగా మార్చేస్తుంది. అయితే ప్రేమ దొరకడం, ప్రేమించడం, ప్రేమలో పడటం ఒకెత్తైతే.. ఆ దొరికిన అపురూపమైన ప్రేమను, దాంతో వచ్చిన అనుబంధాన్ని కలకాలం నిలబెట్టుకోవడమూ ముఖ్యమే.. దానికోసమూ కొన్ని త్యాగాలు, అడ్జెస్ట్ మెంట్లు, ప్రేమ, బాధ్యత ఉండాలి. కొంత మిమ్మల్ని మార్చుకోవాలి.. ఎదుటివాళ్లు వాళ్లకు వాళ్లే మీ కోసం మారేలా చేయాలి.
మీ వైపు నుంచి మీ అనుబంధాన్ని, ప్రేమైన సాంగత్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో కొన్ని టిప్స్ ఇవి.
ఏ బంధానికైనా ఒకరిమీద ఒకరు చూపించే కన్ సర్న్ ముఖ్యం. అనుబంధం ఎక్కువ కాలం సాగినకొద్ది ఎక్కడో ఓ దగ్గర చిన్న పొరపాటు జరగుుతుంటుంది. భాగస్వామి ఉన్నారు కదా, ఉంటారు కదా... అనుకుంటారు. కానీ వారికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వరు. దీంతో అనుబంధం రూపురేఖలు మారిపోతాయి. సో తనకు ఇచ్చే ప్రాముఖ్యతలో ఎప్పుడూ తగ్గుదల రాకుండా చూసుకోవాలి.

మీరు మొదటిసారి కలుసుకున్న రోజు ఎలా ఉన్నారో.. తన సాంగత్యాన్ని కోరుకుంటూ ఎలా టెన్స్ ఫీలయ్యారో.. అలాగే కంటిన్యూ చేయండి. అప్పుడే ఇద్దరిమధ్య దూరం పెరగకుండా ఉంటుంది. అంతే ప్రతీరోజూ తాజాగా అదే వ్యక్తితో ప్రేమలో పడడం అన్నమాట.
రిలేషన్ షిప్ లో కొద్ది రోజులు బాగానే ఉంటుంది. ఇద్దరూ అనుబంధం మీద పెట్టుకున్న కోరికలు తీరతాయి. అయితే మీ భాగస్వామి మీ రిలేషన్ నుంచి ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోవడం ముఖ్యం.. ఆ ఆశల్ని మీరు అందుకోగలుగుతున్నారా, తీరుస్తున్నారా గమనించండి. లేకపోతే మీ రిలేషన్ షిప్ అక్కడితో బీటలు వారడం మొదలవుతుంది.
గొడవలు, గిల్లికజ్జాలు, వాదనలు మామూలే. అయితే ఏ విషయం మీద గొడవపడుతున్నారో.. అదే విషయాన్ని మాట్లాడండి.. అంతేకానీ, ముందూ, వెనకా జరిగిన విషయాల్నీ తవ్వి తీయకండి. దీనివల్ల గొడవ పెద్దదవుతుంది. సమస్య పరిష్కారం కాకపోగా ఇంకా చిక్కుముడి పడిపోతుంది.
నా మనిషే కదా.. చేశారు కదా.. అనుకోకుండా మీకు నచ్చిన విషయం చేసినప్పుడు థ్యాంక్యూ చెప్పడానికి ఎప్పుడూ వెనకాడకండి. ఎంత వెతికినా మీకు దొరకని పెన్ను వెతికిపెట్టడమే కావచ్చు.. మరో అతి ముఖ్యమైన విషయమే కావచ్చు.. థ్యాంక్స్ చెప్పడానికి దొరికే ఏ అవకాశాన్నీ వదులుకోకండి. అది మీరు వారిని గుర్తించారన్న స్పృహను పెంచుతుంది.

మీ గురించి నలుగురూ ఏమనుకుంటున్నారో అనే దానికి ప్రాధాన్యత ఇవ్వకండి. మీ గురించి మీరిద్దరూ ఏమనుకుంటున్నారో అనేదే ముఖ్యం. అదే మీ జీవితాల్ని మార్చేస్తుంది. మీరిద్దరూ ఒకరికొకరు ఆన్సరబుల్ గా ఉండాలి. చివరిగా కలిసి ఉండాల్సింది మీరు కానీ.. మీ చుట్టూ ఉన్న వాళ్లు కాదు కదా.

ఇద్దరూ ఎంతో బిజీగా ఉండొచ్చు.. కానీ ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవాలి. కొన్ని పనులు ఇద్దరూ కలిసి చేసేలా ప్లాన్ చేసుకోవాలి. దీనికోసం ఓ క్యాలెండర్ రూపొందించుకోండి.. కలిసి చేయాల్సిన ట్రిప్పులు, చేసుకోవాల్సిన హాబీలు, ఆర్థికపరమైన మీటింగ్ లు ఇలా ఏదైనా కావచ్చు.