ప్రేమించడం, ప్రేమించబడడం ఓ అందమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. వయసుతో పాటు ఈ ప్రేమను వ్యక్తపరిచే తీరు.. ప్రేమించిన వ్యక్తిలో కోరుకునే లక్షణాలు మారుతుంటాయి.
యుక్తవయసులో ప్రేమ ఒక థ్రిల్.. ఆ తరువాత వయసుతో పాటు ప్రేమ రూపం మారుతూ ఉంటుంది. ప్రేమలోనూ మెచ్యూరిటీ వస్తుంది.
అందుకే మీరు 40యేళ్ల వయసులో ఉన్నపురుషులైతే.. జీవిత భాగస్వామికోసం వెతుకుతున్నట్లైతే.. ఈ వయసులో మహిళలు పురుషుల నుంచి ఏం కోరుకుంటారో తప్పనిసరిగా తెలుసుకోవాలి.
నిజాయితీ అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతీ మహిళ పురుషుని నుంచి కోరుకునే అంశం. అయితే మానసికపరిపక్వత చెందిన మహిళ ఈ విషయంలో ఇంకా ఎక్కువ పర్టిక్యులర్ గా ఉంటుంది. కారణం టైం వేస్ కాకూడదనే. పురుషులు తమతో మనస్పూర్తిగా నిజాయితితో ఉండాలి. నిజాన్ని దాచిపెట్టి ఆటలాడడం ఇష్టపడరు.
తాము లోకాన్ని ఎలా చూస్తున్నారో..అలాగే చూసే పురుషుల్నే స్త్రీలు ఇష్టపడతారు. కొంతమంది పురుషులు 40ల్లో కూడా తామింకా యంగ్ అనే చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారికి స్త్రీుల కాస్త దూరంగానే ఉంటారు.
ఇక మరికొంతమంది పురుషులు తమను ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన మెచ్యూర్డ్ స్త్రీలనే ఇష్టపడతారు. తమ ఏజ్ గ్రూప్ లో ఉండేవారినే.. లేదా దగ్గర్లో ఉన్న వారినే ఎంచుకుంటారు.
మెచ్యూర్డ్ ఉమెన్ చెప్పే ఐలవ్యూ చాలా విలువైంది. ఒక్కసారి ఐలవ్యూ చెప్పిందంటే.. ఆ విషయంలో ఆమె చాలా నిజాయితీగా, సీరియస్ గా ఉన్నట్లే. ఒక్కసారి చెబితే మళ్లీ వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదు. మనస్ఫూర్తిగా చెప్పినట్టే..
24 గంటలూ రొమాన్స్ అంతగా ఇష్టపడరు. శృంగారంలో క్వాలిటీ టైం ఉంటేచాలు. అంతేకాదు తమకు సపోర్ట్ చేస్తూ, గౌరవం ఇస్తూ తమ మాటకు విలువివ్వడమే ఎక్కువగా కోరుకుంటారు. ఓ పూలబొకే పంపడం కంటే టీ చేసి ఇవ్వడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.
24 గంటలూ రొమాన్స్ అంతగా ఇష్టపడరు. శృంగారంలో క్వాలిటీ టైం ఉంటేచాలు. అంతేకాదు తమకు సపోర్ట్ చేస్తూ, గౌరవం ఇస్తూ తమ మాటకు విలువివ్వడమే ఎక్కువగా కోరుకుంటారు. ఓ పూలబొకే పంపడం కంటే టీ చేసి ఇవ్వడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.
మైండ్స్ గైమ్స్ ఇష్టపడరు. టీనేజ్ వ్యక్తుల్లా మైండ్ గేమ్స్ ఆడుతుండే పురుషులకి వీలైనంత తొందరగా గుడ్ బై చెప్తారు. కమిట్ మెంట్ లేకపోతే అంతగా నచ్చరు.
ఒకరిని ఇష్టపడేముందు వారు తమకు ఎంతవరకు నిజాయితీగా ఉండారు, ఎమోషనల్ గేమ్ ఆడరో బాగా గమనిస్తారు.
పరిణతి చెందిన మహిళలు క్వాలిటీ సోల్ కోసం ఆరాటపడతారు. అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలి.. గత సంబంధాల నుండి నేర్చుకున్నవాడై ఉండాలి. ఆ పొరపాట్లు.. పాత ప్రవర్తన పునరావృతం కాకుండా చూసుకునేవారు అయి ఉండాలి.