శృంగారానుభవం మొదటిసారా? అయితే ఈ తప్పులు చేయకండి...

First Published | May 21, 2021, 4:42 PM IST

మనసు చేసే అల్లరికి.. శరీరం చేసే బుజ్జగింపే శృంగారం. కోరికల తూనీగల్ని ఒక్కసారిగా ఎగిరేలా చేసే ఓ క్రీడ రతిక్రీడ. ఇది మొదటిసారి అయితే ఎన్నో రకాల ఆందోళనలు ముప్పిరిగొంటాయి.

మనసు చేసే అల్లరికి.. శరీరం చేసే బుజ్జగింపే శృంగారం. కోరికల తూనీగల్ని ఒక్కసారిగా ఎగిరేలా చేసే ఓ క్రీడ రతిక్రీడ. ఇది మొదటిసారి అయితే ఎన్నో రకాల ఆందోళనలు ముప్పిరిగొంటాయి.
ఆ మొదటి అనుభవం ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతోందో.. తనువుల తహతహలకు సరైన సమాధానం దొరకుతుందా? తన భాగస్వామిని మెప్పిస్తానా? వారి అంచనాల్ని అందుకోగలుగుతానా?.. ఇలాగే చేయాలా? లాంటి అనేక భయాందోళనల్లో ఉంటారు.

ఆ మొదటి అనుభవం ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతోందో.. తనువుల తహతహలకు సరైన సమాధానం దొరకుతుందా? తన భాగస్వామిని మెప్పిస్తానా? వారి అంచనాల్ని అందుకోగలుగుతానా?.. ఇలాగే చేయాలా? లాంటి అనేక భయాందోళనల్లో ఉంటారు.
సినిమాల్లో చూపించినట్టుగా మొదటి రాత్రి, మొదటి అనుభవం అంత బాగా ఏమీ ఉండదు. మొదటిసారి సెక్స్ లో పాల్గొనడం ఒత్తిడితో కూడుకుని ఉంటుంది.
అందుకే ప్రతీ జంట మొదటిసారి శృంగారంలో పాల్గొనే సమయంలో కొన్ని తప్పులు చేస్తారు.
పెళ్లికి ముందు సెక్స్ ఇప్పుడు అత్యంత మామూలు విషయం. మీరు ఒకవేళ రిలేషన్ లోఉండి ఉంటే.. మీ రిలేషన్ ను శృంగారం వరకు తీసుకువెళ్లాలనుకుంటే.. అసలు సెక్స్ అంటే మీ అభిప్రాయం ఏంటి అనేది ఒకరితో ఒకరు కాస్త సీరియస్ గానే చర్చించుకోండి.
జస్ట్ టైం పాస్ కా, శరీర తెంపరితనం తీరడానికా, లేక మీ అనుబంధాన్ని మరింత గాఢం చేయడానికా? మీ భావాల్ని పంచుకోండి. చాలా జంటలు ముందుగా ఇలా మాట్లాడుకోకపోవడం వల్ల తరువాత కాలంలో విడిపోతుంటాయి.
ఇక రెండో తప్పు కండోమ్ ను వాడకపోవడం. మొదటిసారి శృంగారంలో పాల్గొన్పప్పుడు కండోమ్ వాడకపోవడం వల్ల తరువాతి సమయాల్లో కూడా వాడాలనిపించదు. ఇక అవాంఛిత గర్భం, లైంగిక జబ్బులు మామూలే
మొదటిసారి శృంగారంలో పాల్గొంటున్నప్పుడు ఆ ఇద్దరూ పూర్తిగా దానికి సిద్దమై ఉండాలి. మనసా, వాచా, కర్మణా అంగీకారం ఉండాలి. తలూపారు కదా అని మీరు రెచ్చిపోతే.. అవతలి వ్యక్తి అత్యాచారానికి లోనైన భావనలో పడిపోవచ్చు. ఇది దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది.
మొదటి ముద్దు, మొదటి అనుభవం జీవితకాలం గుర్తుండే విషయాలు. అందుకే మీ భాగస్వామి మీద ఒత్తిడి తేవద్దు. ఇద్దరూ పూర్తిగా లైంగిక కలయికకు ఇష్టపడితేనే ఆ పనిని చేయండి. అంతేకానీ బ్లాక్ మెయిల్ చేసో, ఒత్తిడిచేసే చేయడం సరికాదు.

ఇక మరికొంతమంది తమ అనుభవాన్ని గొప్పగా స్నేహితుల దగ్గర చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇది చాలాసార్లు మీ భాగస్వామికి నచ్చకపోవచ్చు. ఆ విషయాన్ని ముందుగా చర్చించండి. ఇతరులతో చెప్పడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నప్పుడే షేర్ చేయండి.

Latest Videos

click me!