శృంగారం టాపిక్ వచ్చిన ప్రతిసారీ... కామసూత్ర గురించి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పుడు ఎంత మంది శృంగారం గురించి సూక్తులు చెప్పినా... ఏదైనా కొత్త విషయం చెప్పినా... అదంతా కామసూత్రాలోని పాఠాలే. దానిలోని విషయాలనే అందరూ వివరిస్తున్నారు. అందుకే... ఇప్పుడు మనం కూడా.. కామసూత్ర లోని కీలక విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..!
కామసూత్ర పుస్తకం గురించి అందరూ చెబుతుంటే వినడమే కానీ... నిజానికి అందులో ఏముంది అనే విషయం చాలా మందికి తెలీదు. అయితే.. పెళ్లికి ముందే ప్రతి అమ్మాయి.. ఈ కామసూత్ర పుస్తకాన్ని చదవాలని అందులో పేర్కొనడం విశేషం.
పెళ్లి తర్వాత.. సెక్స్ గురించి బయపడకుండా.. అమ్మాయిలు శృంగార జీవితాన్ని.. దాంపత్య జీవితాన్ని ఆనందంగా సాగించడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందట. ఇది చదివిన వారికి తిరుగే ఉండదని చెబుతున్నారు. ఆ పుస్తకంలో అమ్మాయిలు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయట.
స్త్రీ, పురుషులు ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ని కొనసాగిస్తేనే.. వారు స్వచ్ఛమైన ఆనందాన్ని పొందుతారు. వారి లైఫ్ స్టైల్ సాధారణంగా కాకుండా.. బద్దకంగా, శుభ్రత లేకుండా.. ఉండే వారు కలయికను ఆస్వాదించలేరట. పైగా ప్రతి విషయంలో వాదనలు, గొడవలు జరుగుతాయట. అందుకే ముందు శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇంట్లోకి గాలి ఎక్కువగా వచ్చే ప్రదేశంలో ఉండాలని.. ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకోవడం వల్ల కూడా కలయికను మనస్ఫూర్తిగా ఆస్వాదించగలరట.
ఈ కామసూత్ర పుస్తకంలో... భర్తను భార్య ఎలా ఇంప్రెస్ చేయాలో కూడా ఉందట. ముందుగా... శృంగారం కోసం అమ్మాయిలు ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా అందులో ఉంటుంది. భర్తను ఎలా ఆకర్షించాలి.. ఎలా ఆకట్టుకోవాలనే విషయంలో ఇందులో స్పష్టంగా తెలియజేశారు.
మహిళలతో ప్రేమ, సంరక్షణ, లైంగిక సంబంధాల పట్ల తమ కోరికను వ్యక్తీకరించడానికి వారు ఇటువంటి చిట్కాలను ఉపయోగించవచ్చు. ఆసక్తికరంగా, సంకేతాలు చిట్కాలతో మహిళలకు వారిపై ఆసక్తి కలిగి ఉందో లేదో పురుషులు కూడా చెప్పగలుగుతారట.
భాగస్వామిని తరచూ ప్రేమగా ముద్దాడతా ఉండాలట. ప్రేమగా ముద్దు పెట్టుకోవడం వల్ల దంపతుల మధ్య బంధం మరింత పెరుగుతుందట.
కలయిక కన్నా.. కూడా ముద్దు వల్ల సన్నిహిత పెరుగుతుందట. కేవలం ముద్దు పెదాలకు, ముఖానికి మాత్రమే పరిమితం చేయకూడదట. శరీరమంతా ముద్దులు పెట్టుకోవాలని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
కామసూత్ర ప్రకారం.. మహిళలు ఒకే రోజులో చాలాసార్లు కలయికను ఆస్వాదించగలరట. కానీ పురుషుడు మాత్రం అలా ఒకే రోజులో ఎక్కువ సార్లు భావప్రాప్తి పొందలేరట. మహిళలు ఎక్కువగా భావప్రాప్తి పొందుతారని చెబుతున్నారు.
మహిళలు తమ లైఫ్ పార్ట్ నర్ ఎన్నిసార్లైనా తృప్తి పరచగల సత్తా ఉంటుందట. అయితే.. దానికి బదులుగా.. వారు పురుషుడి వద్ద నుంచి ప్రేమగా ముద్దు మాత్రమే ఆశిస్తారట.