శృంగార కోరికలు పెరగాలంటే వీటిని తినండి

First Published | Jan 2, 2024, 12:26 PM IST

వయసుతో పాటుగా కొన్ని అలవాట్లు, జీవనశైలి కూడా లైంగిక కోరికలు తగ్గడానికి కారణమవుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే లైంగిక కోరికలు కలుగుతాయని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అవేంటంటే.. 

వయసుతో పాటుగా సెక్స్ లైఫ్ పుల్ స్టాప్ పడుతుంది. ఎందుకంటే వయసుతో పాటుగా దీనిపై ఉన్న కోరికలు కూడా తగ్గుతాయి. ఇది చాలా సహజం. అయితే కొన్ని అలవాట్లు, మీ జీవన శైలి కూడా సెక్స్ కోరికలు తగ్గడానికి కారణమవుతాయి. సెక్స్ శారీరక ఆనందాన్ని మాత్రమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అయితే కొన్ని ఆహారాలు కామోద్దీపనలుగా పనిచేసి ఇవి మీలో లైంగిక కోరికను రేకెత్తిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

fenugreek seeds

మెంతులు

మెంతులు లేదా మెంతికూరలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి ఎన్నో సమస్యల నుంచి మనల్ని కాపాడుతాయి. ఆయుర్వేదంలో.. దీనిలోని శోథ నిరోధక లక్షణాలు లిబిడోను పెంచే శక్తికిగా పరిగణిస్తారు. యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, కొరియన్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేసిన అధ్యయనాలలో.. మెంతుల్లో ఉండే నిర్దిష్ట సమ్మేళనాలు సెక్స్ హార్మోన్లైన  ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ రెండింటి సమతుల్య ఉత్పత్తికి సహాయపడుతుందని కనుగొన్నారు. స్త్రీపురుషులిద్దరిలోనూ లైంగిక వాంఛను కలిగిస్తుంది. రక్తం పలుచబడటానికి మందులు తీసుకునే వ్యక్తులు లేదా హార్మోన్-సెన్సిటివ్ క్యాన్సర్ కు చికిత్స పొందుతున్న వ్యక్తులు దీన్ని వినియోగించకూడదు. 


పిస్తా

పిస్తా పప్పులను క్రీస్తుపూర్వం 6000 నుంచి వినియోగిస్తున్నారట. దీనిలో ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఈ చిన్న గింజలు రక్తపోటును తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. అలాగే బరువును తగ్గించడానికి కూడా ప్రయోజకరంగా ఉంటాయి. పిస్తాలు కూడా కామోద్దీపనగా పనిచేస్తాయి. వీటిలో అంగస్తంభన లక్షణాలను తగ్గించే సామర్థ్యం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  పిస్తా అంగస్తంభన పనితీరును మెరుగుపరుస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం.. పిస్తాపప్పు రక్త కొలెస్ట్రాల్ ను మెరుగుపరుస్తుందని, శరీరమంతా మంచి రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుందని సూచిస్తుంది. 
 


కుంకుమపువ్వు

కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఇది మీ లైంగిక జీవితానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కుంకుమ పువ్వు ఒత్తిడి, నిరాశ లక్షణాలను తగ్గిస్తుంది.  ఇది కామోద్దీపనగా మంచి లక్షణాలకు ప్రసిద్ది చెందింది. నిరాశతో బాధపడుతున్న వ్యక్తుల్లో ఇది లిబిడో-ప్రేరేపించే లక్షణాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన రెండు అధ్యయనాలలో.. నాలుగు వారాల పాటు ప్రతిరోజూ 30 మి.గ్రా కుంకుమపువ్వు తిన్న పురుషులు అంగస్తంభన పనితీరులో మెరుగుదల అనుభవించారని కనుగొన్నారు. దీని మహిళల ఫాలో-అప్ అధ్యయనంలో.. అదే మొత్తంలో కుంకుమపువ్వు వినియోగం మహిళలకు అధిక స్థాయి ఉద్వేగం, పెరిగిన లూబ్రికేట్ అనుభవించారని నివేదించబడింది.
 

పుచ్చకాయ

పుచ్చకాయను నేచురల్ వయాగ్రా అని కూడా పిలుస్తారన్న ముచ్చట మీకు తెలుసా? ఈ వేసవి పండును తింటే మీకు లైంగిక కోరికలు కలుగుతాయి. పుచ్చకాయ రిండ్ లో సిట్రులైన్ నిర్ధారణపై యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన ఒక అధ్యయనంలో.. పుచ్చకాయలో అవసరం లేని అమైనో ఆమ్లాలు సిట్రులైన్ గొప్ప మూలం అని కనుగొన్నారు. ఇది ఫైటోన్యూట్రియెంట్ సిట్రులైన్ రక్త నాళాలను సడలించి విస్తరిస్తుంది. 
 


దానిమ్మ

దానిమ్మ పండులోని చిన్న చిన్న గింజల్లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. ఈ పండును తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఇది లైంగిక కోరికలను కలిగించడానికి కూడా సహాయపడుతుంది. ఈ పండు సంతానోత్పత్తికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.  ఎడిన్బర్గ్లోని క్వీన్ మార్గరెట్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనంలో.. దానిమ్మ జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగడం వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ తగ్గుతుందని కనుగొన్నారు. ఒత్తిడి హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించడంతో పాటుగా  ఇది  లిబిడోను కూడా పెంచుతుందట. దానిమ్మ రసాన్ని రెండు వారాల క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పురుషులు, మహిళల్లో  టెస్టోస్టెరాన్ స్థాయిలు గణనీయంగా పెరిగాయని అధ్యయనం కనుగొంది. టెస్టోస్టెరాన్ పెరగడంతో పాటుగా ఇది రక్తపోటు, మానసిక స్థితిని కూడా మెరుగుపరించిందట. 

Latest Videos

click me!