ఏ బంధం నిలవాలన్నా.. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ అనేది కచ్చితంగా ఉండాలి. అలా లేని సమయంలో.. వారి బంధం నిలబడదు. మరీ ముఖ్యంగా పెళ్లి అనే బంధంలో ప్రేమతో పాటు నమ్మకం కూడా ఉండాలి. అంతేకాదు.. దంపతుల మధ్య కమ్యూనికేషన్ కూడా చాలా ముఖ్యం.
కొందరు.. కొన్ని విషయాలను తమ భార్యల వద్ద దాచిపెడుతూ ఉంటారు. ఎందుకులే తనకు ఇవన్నీ చెప్పి బాధపెట్టడం అని వారు అనుకుంటారు. అయితే.. ఇలా కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలను దాచిపెట్టడ వల్ల వారి మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. భర్తలు.. భార్య మాట విన్నప్పుడే.. వారి కాపురం సజావుగా సాగుతుందట. వారిని నొప్పించకుండా ఉన్నప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు.
ఇలా నొప్పించకుండా ఉండే ఈ క్రమంలో.. భార్యల దగ్గర కొన్ని పదాలను వాడకూడదట. ఈ పదాలను వాడకుంటే.. వారు జీవితంలో ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
1. తప్పంతా నీదే.. తప్పు ఎవరిది అన్న విషయం పక్కన పెడితే.. తప్పంతా నీదే అని చాలా మంది భార్యలపై నింద మోపేస్తుంటారు. అయితే.. భార్యల వద్ద భర్తలు అస్సలు వాడకూడదని పదం ఇదేనట. దాని వల్ల గొడవలు మరింత ఎక్కువై సంసారంలో సమస్యలు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు.
అలా భార్యపై నింద వేయడానికి ముందు.. గట్టిగా ఊపిరిపీల్చుకొని తప్పు ఎక్కడ జరిగింది అని ఇద్దరూ చర్చించుకుంటే ఫలితం లభిస్తుందని సూచిస్తున్నారు.
2.ఐయామ్ సారీ, కానీ... ఇద్దరి మధ్య బేధాప్రాయాలు వచ్చినప్పుడు... ఇరువురిలో ఎవరో ఒకరు క్షమాపణలు చెప్పడం సహజం. చాలా మంది భర్తలు.. మేమే ముందు సారీ చెబుతాం. అయినా కానీ మా భార్య బెట్టు చేస్తుంది అంటూ వాపోతారు.
అయితే.. క్షమాపణ చెప్పడం మంచి విషయం కానీ.. సారీ చెప్పిన తర్వాత కానీ అనే పదాన్ని మాత్రం వాడకూడదట. దాని వల్ల మీరు క్షమాపణ చెప్పినా పెద్దగా ఉపయోగకరంగా ఉండదని చెబుతున్నారు.
3. నువ్వు మళ్లీ మొదలుపెట్టావా.. ఈ పదం కూడా చాలా ప్రమాదకరం. ప్రతి ఒక్కరికీ అన్ని విషయాలు నచ్చలని రూల్ లేదు. కాబట్టి కొందరికి కొన్ని నచ్చుతాయి. మరికొన్ని ఇంకొందరికి నచ్చుతాయి.
చాలా మంది తమ పార్ట్ నర్స్ కోసం మారినట్లు నటిస్తుంటారు. అదే విషయాన్ని భార్యలు ప్రస్తావిస్తే మాత్రం మండిపడుతుంటారు. నువ్వు మళ్లీ నాకు క్లాస్ పీకడం మొదలుపెట్టావా..? నీ ఏడుపు స్టార్ట్ చేసావా లాంటి లైన్స్ వాడుతుంటారు. అయితే.. ఆ పదాలు మరింత ఎక్కువగా బాధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ పదం వాడకుండా జాగ్రత్త పడటం మంచిదని చెబుతున్నారు.
4.గట్టిగా అరవడం.. చాలా మంది ఎక్కడ ఉన్నాం.. ఎవరితో ఉన్నామనేది కూడా చూడకుండా.. భార్యలపై గట్టిగా అరిచేస్తుంటారు. తర్వాత క్షమాపణలు చెప్పినా ప్రయోజనం ఉండదు. కాబట్టి.. ఏదైనా నెమ్మదిగా చెప్పడం అలవాటు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.