శృంగారం.. భర్తలను మోసం చేస్తున్న భార్యలు

First Published | Aug 3, 2020, 3:25 PM IST

ప్రస్తుత కాలంలో 10శాతం మంది మహిళలు..తమ భర్తలతో సంవత్సరంలో ఒక్కసారి కూడా  సెక్స్ లో పాల్గొనడం లేదట. చాలా తక్కువ మంది మాత్రమే వారంలో మూడు సార్లు ఇందులో పాల్గొంటున్నారని తేలింది. 
 

భార్యభర్తల మధ్య బంధం బలపడాలంటే.. వారి సెక్స్ వల్ లైఫ్ కూడా అంతే అందంగా, ఆనందంగా ఉండాలి. అయితే.. ప్రస్తుత కాలంలో అందరూ సమయం వెంట పరిగెడుతున్నారు.
దీంతో పని ఒత్తిడి కారణంగా సెక్స్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కొందరు చాలా వరకు ఈ జీవితానికి దూరంగా ఉంటున్నారు. మరి కొందరేమో లైఫ్ పార్టనర్ ఇష్టం లేదనో, ఇంకేదే ఇంకేదో కారణంతోనే సెక్స్ కి దూరంగా ఉంటున్నారు.

దాంపత్య జీవితంలో శృంగారానిదే పెద్దపీట. అయితే.. ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పటి దంపతులు శృంగార జీవితాన్ని సరిగా ఆస్వాదించలేకపోతున్నారట.
భార్యల కారణంగా భర్తలు ఈ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారట. ఇదే విషయంలో ఓ సంస్థ జరిపిన సర్వేలో విస్తుపోయే నిజాలు బయపడ్డాయి.
ప్రస్తుత కాలంలో 10శాతం మంది మహిళలు..తమ భర్తలతో సంవత్సరంలో ఒక్కసారి కూడా సెక్స్ లో పాల్గొనడం లేదట. చాలా తక్కువ మంది మాత్రమే వారంలో మూడు సార్లు ఇందులో పాల్గొంటున్నారని తేలింది.
అంతేకాదు ఇక 30శాతం మంది భార్యలు.. నెలకి ఒకసారి ఈ విషయంలో భర్తలను సంతృప్తి పరుస్తున్నారని తేలింది.
అంతేకాదు.. మరో 30శాతం మంది మహిళలు.. ఈ సెక్స్ జీవితంలో తమ భర్తలను మోసం చేస్తున్నారని తేలింది. కేవలం 4 శాతం మంది మాత్రమే రోజు సెక్స్ లో పాల్గొంటున్నారట.
ఈ విషయంపై 32శాతం మహిళలు ఎమంటున్నారంటే.. సంవత్సరాలు గడుస్తున్నా.. శృంగార జీవితం బాగానే ఉందంటున్నారు. 18శాతం మహిళలకు సంవత్సరం, రెండు సంవత్సరాలలోనే దీనిపై బోర్ వచ్చేస్తుందట.
అయితే.. ఇలా శృంగార జీవితంలో ఇంతలా గ్యాప్ రావడం కరెక్ట్ కాదని నిపుణులు చెబుతున్నారు. శృంగారంలో విరామం తీసుకుంటే.. దాని ప్రభావం స్త్రీల కన్నా పురుషులపైనే ఎక్కువగా ఉంటుంది. సెక్స్ లైఫ్ కి ఎక్కువ రోజులు దూరంగా ఉంటే అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి.
స్త్రీలల్లో అయితే రక్త ప్రసరణ జరగక యోని గోడలు బలహీనంగా సన్నగా మారిపోతాయి. రోగ నిరోదక శక్తి కూడా తగ్గిపోతుంది. అంతేకాదు.. ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. స్త్రీల యోని లూసుగా మారిపోతుంది. అలా అయిన తర్వాత సెక్స్ చేయడం ప్రారంభించినా.. దానిని ఆనందించలేరు.
అంతెందుకు దంపతుల మధ్య ఏవైనా చిన్నపాటి మనస్పర్థలు వచ్చినా..వాటిని శృంగారమే దూరం చేస్తుంది. అంతటి శక్తి దానికుంది. అంతేకానీ.. చిన్నపాటి గొడవలకు సెక్స్ వల్ లైఫ్ ని దూరం చేసుకొని సమస్యలు కొని తెచ్చుకోకండి అని సూచిస్తున్నారు నిపుణులు.

Latest Videos

click me!