ప్రస్తుతం మన దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోంది. పాశ్చాత్య సంస్కృతిని సైతం వంటపట్టించుకుంది. దీని పుణ్యామా అనే సహజీవనం, డేటింగ్ కాన్సెప్ట్స్ మన దేశంలోకి కూడా అడుగుపెట్టాయి.
పెళ్లికి ముందే విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొంటున్నారు చాలా మందే ఉన్నారు. అయితే... ఇప్పటికీ మన దేశ సంప్రదాయాలను, కట్టుబాట్లను పాటిస్తున్న యువత చాలా మందే ఉన్నారని ఓ తాజా సర్వేలో తేలింది.
వారంతా పెళ్లికి ముందు సెక్స్ కి మేము దూరం అంటూ తేల్చేశారు. అవుట్‌లుక్-కార్వీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
పెళ్లికి ముందు సెక్స్‌పై అభిప్రాయం కోరగా.. 66 శాతం మంది వద్దే వద్దని, 20 శాతం మంది తమకు ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పడం విశేషం.
12 శాతం మంది అందులో తప్పులేదని చెప్పారు. కానీ వాళ్లు మాత్రం అలా చేయమని చెప్పడం గమనార్హం. 2 శాతం మంది మాత్రం పెళ్లికి ముందు సెక్స్ మాకు సమ్మతమేనని, అయితే, ఆ వ్యక్తే తమ భాగస్వామి కావాలని కోరుకుంటున్నారట.
ఇక, హోమోసెక్సువాలిటీ అనేది వ్యక్తిగత ఎంపిక అని నాలుగింట మూడు వంతుల మంది అభిప్రాయపడుతున్నారు.
పోర్న్ వెబ్‌సైట్లు యువతను పాడు చేస్తున్నాయని, వాటిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని 50 శాతం మంది అంగీకరించారు
కాగా, కులాంతర, మతాంతర వివాహాలకు 57 శాతం మంది మద్దతు ఇస్తుండగా, 33 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు.
డేటింగ్ యాప్ వినియోగించేశారు 23శాతం వరకు ఉన్నారు. 34 శాతం మంది విద్యార్థి జీవితంలో రాజకీయాలు అవసరం లేదని భావిస్తున్నారు
మూడింటి రెండు వంతుల మంది వారానికి ఒకసారి గుడికి వెళ్తుండటం గమనార్హం.