ఇప్పటి వరకు ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే చాలు.. ఏ మృగాడి కంట పడకుండా ఎలా కాపాడుకోవాలా అని తల్లిదండ్రులు భయంతో వణికిపోయేవారు. అయితే.. ఇక నుంచి ఆడపిల్లే కాదు.. మగపిల్లాడి విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలని తాజా సంఘటనలే చెబుతున్నాయి.
ఓ యువతి మైనర్ బాలుడిని వశ పరుచుకొని అత్యాచారానికి పాల్పడింది. ఆ బాలుడి కారణంగా బిడ్డను కూడా కన్నది. కాగా.. మైనర్ బాలుడిపై అత్యాచారానికి పాల్పడినందుకు సదరు యువతికి న్యాయస్థానం దాదాపు 30 నెలలు జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. పూర్తి వివరాల్లోకి వెళితే..యూకేకి చెందిన ఓ యువతి(20) ఇటీవల ఓ బిడ్డ జన్మించింది. అందరూ ఆమె బాయ్ ఫ్రెండ్ కారణంగానే ఆ బిడ్డ పుట్టిందని అనుకున్నారు. అయితే... ఈ విషయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ కి ఎందుకో అనుమానం కలిగింది. వెంటనే డీఎన్ఏ టెస్టు చేయించాడు.
ఆ రిపోర్టు చూసి అందరూ షాకయ్యారు. ఆ బిడ్డ పుట్టకుకు సదరు యువతి బాయ్ ఫ్రెండ్ కి ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. మరి ఆ బిడ్డ తండ్రి ఎవరా అని ఆరా తీస్తే.. ఓ మైనర్ బాలుడు అని తెలిసి అందరూ షాకయ్యారు.
2017లో సదరు యువతి మద్యం మత్తులో తమ బంధువుల ఇంటికి అనుకోని వేరొకరి ఇంటికి వెళ్లింది. ఆ ఇంట్లో 13ఏళ్ల బాలుడు వీడియో గేమ్స్ ఆడుతూ కనిపించాడు.
అప్పటికే మద్యం సేవించి ఉన్న ఆమె బాలుడిపై లైంగిక దాడి చేసింది. ఆమె చేస్తున్న పనికి ఆ బాలుడు కూడా అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. అప్పటి నుంచి తరచూ వారిద్దరూ కలుస్తూనే ఉన్నారు.
నెలకు రెండుసార్లు చొప్పున దాదాపు రెండు సంవత్సరాలపాటు సదరు యువతి మైనర్ బాలుడితో శృంగారం పాల్గొంది. తొలిసారి వారిద్దరూ కలయికలో పాల్గొన్న సమయంలో ఆమె వయసు 17 సంవత్సరాలు, బాలుడి వయసు 13 సంవత్సరాలు కావడం గమనార్హం.
కాగా... ఆ తర్వాత సదరు యువతి గర్భం దాల్చింది. ఆమె గర్భం తన వల్లే వచ్చిందని ఆ యువతి బాయ్ ఫ్రెండ్ అనుకున్నాడు. ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాయ్ ఫ్రెండ్ కి అనుమానం కలిగింది.
దీంతో పరీక్షలు చేయగా.. తన బిడ్డ కాదని తెలుసుకున్నాడు. మైనర్ బాలుడి మీద అనుమానంతో అతనితో పరిశీలించగా.. ఆ బాలుడే ఆ బిడ్డకు తండ్రి అని తేలింది.
డీఎన్ఏ రిపోర్టులో తేలినా కూడా.. సదరు యువతి ఈ విషయంలో నిజం ఒప్పుకోకపోవడం గమనార్హం. అసలు ఆ బాలుడితో తాను శృంగారంలో పాల్గొనలేదని ఆ మహిళ వాదిస్తుండటం గమనార్హం.
ఆ యువతి ఓ నర్సరీలో పనిచేస్తుందని సమాచారం. అక్కడికి దగ్గరలోనే మైనర్ బాలుడి ఇల్లు కూడా ఉంటుందని తెలుస్తోంది. కాగా.. మైనర్ బాలుడితో శృంగారం చేసిందని ఆమెపై కేసు నమోదైంది.
తాజాగా సదరు యువతికి 30 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.