శృంగారంలో ఈ భయాలు.. వదిలేస్తే స్వర్గం చూడొచ్చు..

First Published Nov 11, 2020, 5:40 PM IST

ఆకర్షణ.. ప్రేమగా మారి అది అందమైన అనుబంధంగా రూపాంతరం చెందడంలో శృంగారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే రతిక్రీడ అనగానే శరీరంలో ఓ చిన్నపాటి అలజడి.. ఓ వింతైన అనుభూతితో పాటు.. ఏదో తెలియని భయం వెంటాడుతుంది.

ఆకర్షణ.. ప్రేమగా మారి అది అందమైన అనుబంధంగా రూపాంతరం చెందడంలో శృంగారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే రతిక్రీడ అనగానే శరీరంలో ఓ చిన్నపాటి అలజడి.. ఓ వింతైన అనుభూతితో పాటు.. ఏదో తెలియని భయం వెంటాడుతుంది.
undefined
ముఖ్యంగా పెళ్ళికాని యువతలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పెళ్లైన వారు ఏదో ఒక రకంగా కానిచ్చేసినా.. పెళ్లి కాని యువత డేటింగ్ కు వెళ్లినప్పుడు లేదా మొదటి సారి శృంగారంలో పాల్గొన్నప్పుడు కొన్ని సందేహాలు సహజంగా వారి మూడ్ ను పాడు చేస్తుంటాయి.
undefined
అప్పటివరకు శృంగారం గురించి వారు విన్నవి భయాలుగా మారి వారిని వెనక్కి లాగుతుంటాయి. అయితే ఆ భయాలేంటో వాటినుండి ఎలా విముక్తి పొందాలో తెలుసుకుంటే శృంగారంలో మీరే కింగులవ్వచ్చు.
undefined
తన భాగస్వామికి ఎస్టీడీ లేదా హెర్పెస్, క్లామిడియా వంటి లైంగికవ్యాధులేమైనా ఉన్నాయేమో అనే అనుమానం ఎక్కువగా భయపెట్టే అంశం. అందుకే బాగా తెలిసిన వ్యక్తులతో తప్ప సెక్స్ కి ఇష్టం చూపరు.
undefined
అయితే పార్టనర్ తో ఈ విషయాలు చర్చించడం చాలా ముఖ్యం. వారికి అలాంటివి ఉన్నాయా, టెస్టులు చేయించుకున్నారా అనే విషయాల్లో క్లారిటీ వస్తే మీరు ఇక ఆగరు.
undefined
ప్రెగ్నెన్సీ వస్తుందనే భయం చాలామందిని శృంగారంలో వెనక్కి లాగుతుంది. అయితే దీనికోసం చాలామంది కండోమ్ వాడతారు. కాకపోతే కండోమ్ వందశాతం సేఫ్టీ కాదు. సెక్స్ మధ్యలో చిరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భనిరోధక అంశాల గురించి బాగా తెలుసుకున్నాకే సెక్స్ లో పాల్గొంటే మీ భాగస్వామితో కేక పుట్టించొచ్చు.
undefined
ఇంకొంతమందికి రెగ్యులర్ పోశ్చర్స్ నచ్చవు. కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది. కాకపోతే చెబితే ఏమనుకుంటారో అనే భయం ఉంటుంది. దీంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీకు ఏ యాంగిల్ అయితే తృప్తి కలుగుతుందో చర్చించడంలో తప్పు లేదు. అప్పుడే ఇద్దరూ స్వర్గం చూడగలుగుతారు.
undefined
సెక్స్ లో పీక్ కు చేరుకున్న తరువాత స్కలనం విషయంలో బాగా అనుమానాలుంటాయి. పర్లేదా వదిలేయచ్చా.. అనే డౌట్లు మగవాళ్లని అప్పటివరకు పొందిన అనుభూతిని కోల్పోయేలా చేస్తాయి.
undefined
అయితే అమ్మాయిలు ఈ విషయాల్లో చాలా క్లారిటీగా ఉంటారు. దానికి సంబంధించిన జాగ్రత్తలు వాళ్లు తీసుకుంటారు. కాబట్టి దాని మీద డౌట్ పెట్టుకోకపోతే ఎండింగ్ కూడా ఎంజాయ్ చేయచ్చు.
undefined
తమమీద తమకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడం వల్ల కూడా చాలామంది రతిక్రీడకు దూరంగా ఉంటారు. శారీరకంగా బక్కగా ఉన్నాననో, పొట్టిగా ఉన్నాననో ఇలాంటి ఏవో అభద్రతలుంటాయి. అయితే శృంగారానికి ఇవేం అడ్డుకావన్న విషయం మరిచిపోవద్దు. శృంగారానికి శరీరం కంటే మనసు ముఖ్యం, భావోద్వేగాలు ముఖ్యం.
undefined
శృంగారంలో మంచి, చెడు అనేది ఉండదు. రేప్ లోనే అది సాధ్యం. అందుకే ఆ విషయంలో మీరు చెడ్డగా ఉన్నాననుకోవడం సరికాదు. కాకపోతే కాస్త స్మూత్ గా మీ భాగస్వామి మూడ్స్ కు అనుగుణంగా చేయడం వల్ల మీరు మీతోపాటు మీ భాగస్వామీ తృప్తి పొందవచ్చు.
undefined
కొంతమంది అబ్బాయిలు శృంగారంలో చాలా దూకుడుగా ఉంటారు. ఇలాంటి వాటిని కొంతమంది అమ్మాయిలు అస్సలు తట్టుకోలేరు. ఆ విషయాన్ని భాగస్వామితో ఎలాంటి అనుమానాలు లేకుండా చెప్పడం వల్ల దూకుడు దూకుడును తగ్గించుకుని.. నెమ్మదిగా ప్రారంభించే అవకాశం ఉంటుంది. కావాలంటే ఎక్కువ సేపు పాల్గొందామని చెప్పండి. మీకు కచ్చితంగా ఫలితం రావొచ్చు.
undefined
click me!