వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి.. అశ్లీల చిత్రాలు చూస్తున్నారా!

First Published | May 7, 2020, 8:31 AM IST

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో అనేక కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచే పని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) చేస్తున్నారు. ఇది ఒక్క మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమలవుతోంది.

ఎన్నడూ ఊహించని విధంగా.. కరోనాతో ప్రపంచమంతా లాక్‌డౌన్ అయ్యింది. ఇటు భారత్‌ కూడా కరోనాను మరింత కట్టడి చేసే ఆలోచనలో భాగంగా లాక్‌డౌన్‌ను మే 17వ తేదీ వరకు లాక్ డౌన్ విధించారు.
దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. అందులో చాలామంది తమ ఫోన్లకే అంకితమై.. కాలక్షేపం చేస్తున్నారు. అయితే అందులో ఏం చేస్తున్నారన్న దానిపై తాజాగా ఓ సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

5 శాతం మంది కొందరు గేమ్స్, సినిమాలు లాంటివి చూస్తుంటే.. 95 శాతం మంది మాత్రం పోర్న్ వీడియోస్ చూస్తున్నట్టు తెలిపింది సంస్థ.
ఈ లాక్ డౌన్ వేళ.. పోర్న్ విపరీతంగా చూస్తున్నారనేది ఈ సర్వే సారాంశం. కాగా.. తాజాగా మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది.
కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో అనేక కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచే పని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) చేస్తున్నారు. ఇది ఒక్క మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమలవుతోంది.
ఇక ఉద్యోగులు ఆఫీస్‌ పని నిర్వహించడానికి కంపెనీలు డివైజ్‌లను కూడా అందిస్తున్నాయి. అయితే దీన్ని తమ ఆఫీస్‌ పని కోసమే కాకుండా అశ్లీల (పోర్న్‌) వెబ్‌సైట్లు చూడటానికి కూడా ఉద్యోగులు విచ్చలవిడిగా వాడేస్తున్నట్టు కాస్పర్‌స్కై తాజా నివేదిక వెల్లడించింది.
పని కోసం వినియోగించే డివైజ్‌లనే అశ్లీల వీడియోలు, చిత్రాలు తదితరాలు చూసేందుకు వాడుతున్నట్టు 51 శాతం మంది వెల్లడించారని ఈ నివేదిక పేర్కొంది. కంపెనీలడివైజ్‌లలో 18 శాతం మంది అశ్లీలం చూస్తున్నారు.
ఆఫీస్‌ పని కోసం వినియోగించే తమ వ్యక్తిగత డివైజ్‌లను అశ్లీలం చూడటానికి వినియోగిస్తున్నట్టు 33 శాతం మంది చెబుతున్నా రు.
ఈ వ్యవహారంపై కంపెనీలు దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోకపోతే మాల్వేర్‌ బారిన పడే అవకా శం ఉంటుందని కాస్పర్‌స్కై హెచ్చరిస్తోంది.
నివేదిక ప్రకారం.. తాము ఇంతకు ముందుకన్నా ఎక్కువ సమయం పని చేస్తున్నట్టు 31 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. వ్యక్తిగత పనుల కోసం వెచ్చించే సమయం పెరిగిందని 46శాతం మంది తెలిపారు.
పని, వ్యక్తిగత కార్యకలాపాలను వేర్వేరు చేయడం ఇబ్బందికరంగా ఉంటోందని, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్టు నివేదిక పేర్కొంది.
ఎక్కువగా వార్తలు చదువుతున్నట్టు 55శాతం మంది తెలిపారు. ఆఫీసు డివైజ్‌లనే వాడుతున్నట్టు 60 శాతం మంది చెప్పారు.
కాగా 42 శాతం మంది తమ వ్యక్తిగత ఈమెయిల్‌ను వినియోగిస్తున్నారు. ఈ వినియోగం ఇంకా పెరిగిందని 49 శాతం మంది చెబుతున్నారు.
తమ ఐటీ విభాగాలు అనుమతించకున్నా 38 శాతం మంది వ్యక్తిగత మెసెంజర్‌లనే వాడుతున్నారు.

Latest Videos

click me!