నావైపు చూడొద్దు... లవర్ కి ముద్దుపెడుతూ... పిల్లలకు తల్లి వార్నింగ్

First Published | Jan 10, 2020, 2:10 PM IST

. తాను తన ప్రియుడితో రోమాన్స్ చేస్తున్నప్పుడు.. తన వైపు చూడొద్దంటూ ఆమె పిల్లలకు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. కాగా... ఈ ఘోరాలు పిల్లల ద్వారా తెలుసుకున్న ఆమె భర్త కోర్టును ఆశ్రయించాడు. 

కడుపున పుట్టిన పిల్లలకు మంచేదో, చెడోదే చెప్పాల్సిన తల్లే.. దారి తప్పింది. కట్టుకున్న భర్త కళ్లుగప్పి... ప్రియుడితో రాసలీలు నడిపింది. ఆమె రాసలీలలకు ఆమె కడుపున పుట్టిన పిల్లలే సాక్ష్యంగా ఉండటం గమనార్హం. తన ఇద్దరు పిల్లలను ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకువెళ్లి... ఆమె ప్రియుడితో ముద్దుల్లో మునిగితేలేది.
పైగా... తాను తన ప్రియుడితో రోమాన్స్ చేస్తున్నప్పుడు.. తన వైపు చూడొద్దంటూ ఆమె పిల్లలకు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.

కాగా... ఈ ఘోరాలు పిల్లల ద్వారా తెలుసుకున్న ఆమె భర్త కోర్టును ఆశ్రయించాడు. ఆ కోర్టులో కూడా పిల్లలే సాక్ష్యంగా నిలవడం విశేషం. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... అన్లోకా ప్రాంతానికి చెందిన మహిళకు 1993డిసెంబర్ లో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. ఒకరు పాప, మరొకరు బాబు ఉన్నారు. కాగా... ఆమెకు పెళ్లి జరిగిన నాటి నుంచి భర్త అంటే ప్రేమగా ఉండేదే కాదు. మాట్లాడితే పుట్టింటికి వెళతానంటూ వెళ్లిపోయేది.
ఓ రోజు ఇంట్లో భర్త నిద్రపోతుండగా కిరోసిన్ పోసి నిప్పు అంటించి చంపాలని ప్రయత్నించింది. కిరోసిన్ పోయగానే అతనికి మెలకువ రావడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలాంటి ప్రయత్నాలు చాలనే చేసింది. తర్వాత వాళ్లు వేరే గ్రామానికి షిఫ్ట్ అయ్యారు.
2005లొ ఆమె ఓ ఫోన్ కొనుగోలు చేసింది. భర్త ఎప్పుడు చూసినా ఆమె ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతూ కనిపించేది. ఎవరితో మాట్లాడుతున్నావని భర్త నిలదీస్తే.. తమ పుట్టింటి వాళ్లతో, కజిన్స్ తో మాట్లాడుతున్నా అని కవర్ చేసేది. కాగా.. ఓ రోజు అతను తన భార్య సెల్ ఫోన్ చెక్ చేయగా... ప్రియుడితో ఆమె జరిపిన రాసలీలల మెసేజ్ లు బయటపడ్డాయి. ఆమె ప్రేమ వ్యవహారం భర్తకు 2007లొ తెలియడం గమనార్హం.
ఈ విషయంలో అతను ఎంతో మదనపడగా.. తర్వాతర్వాత మరిన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. ప్రియుడిని కలుసుకోవడానికి వెళ్లిన ప్రతిసారి తన ఇద్దరు పిల్లలను కూడా వెంట తీసుకువెళ్లేదట. ఐస్ క్రీమ్ పార్లర్, పార్క్ లకు వెళ్లి ప్రియుడిని కలిసేది. ఆ సమయంలో పిల్లలను తనకు పది అడుగుల దూరంలో కూర్చోపెట్టేది. ముందుగానే.. తన వైపు చూడొద్దని పిల్లలకు వార్నింగ్ ఇచ్చేదట.
ఆమె మాత్రం చక్కగా ప్రియుడిని వాటేసుకొని ముద్దుల వర్షం కురిపించేది. ఇవన్నీ చూసి పిల్లలకు కూడా తల్లిపై విరక్తి వచ్చేసింది. వాళ్లు చూసిన దారుణాన్ని మొత్తం తండ్రికి వివరించారు. ఇలాంటి తల్లి తమకు వద్దు అని... ఆమెతో ఉంటే తమ భవిష్యత్తు అందకారంలో కి వెళ్లిపోతుందని వారు చెప్పడం విశేషం.
దీంతో.. ఆమె భర్త ఈ భార్య నాకు వద్దూ అంటూ కోర్టును ఆశ్రయించాడు. అయితే... భర్త వేసిన పిటిషన్ ను వ్యతిరేకిస్తూ.. ఆమె కోర్టులో మరో పిటిషన్ వేయడం గమనార్హం. అయితే...ఆమె పిటిషన్ ని న్యాయస్థానం కొట్టేసింది. ఆమె పిల్లలు చెప్పిన సాక్ష్యం... ఆ వివరాలు తెలుసుకున్న న్యాయం స్థానం.. అతనికే అండగా నిలిచింది. ఆమె తన వైవాహిక జీవితం పట్ల అంత క్రూరంగా వ్యవహరించడం పై కోర్టు సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.

Latest Videos

click me!