పిల్లలు అబద్దాలు చెప్పకుండా ఏం చేయాలి?

First Published | May 23, 2024, 2:39 PM IST

పిల్లలు కొన్ని కొన్ని సార్లు అబద్దాలు చెప్తుంటారు. ఇది కామన్ విషయమే. కానీ అబద్దాలను చెప్తుంటే..వారిని అలాగే వదిలేస్తే మీ పిల్లలు మొత్తం అబద్దాలే చెప్పడం మొదలు పెడతారు. అందుకే పిల్లలు అబద్దాలు చెప్పడం మొదలుపెట్టినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే? 
 

నిజానికి, అబద్దానికి మధ్య తేడాను పిల్లలకు వివరించడం తల్లిదండ్రులకు పెద్ద సవాలే. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లలు అబద్దాలు చెప్పడం మొదలుపెడుతుంటారు. ఇది చాలా కామన్ విషయం. కానీ మీ పిల్లలు ప్రతి విషయానికి అబద్దాలు చెప్పడం మాత్రం మంచిది కాదు. ఇది ఆందోళన కలిగించే విషయం. ఒకవేళ మీ పిల్లలు అబద్దాలు చెప్పడం మొదలుపెడితే తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

అబద్దం ఎందుకు చెప్పాడో తెలుసుకోండి

పిల్లలు అబద్ధం చెప్పకుండా చేయాలంటే .. ముందుగా పిల్లలు ఎందుకు అబద్ధం చెబుతారో ప్రతితల్లిదండ్రులు తెలుసుకోవాలి. మీ పిల్లలు ఏదైనా దాచడానికే తరచుగా అబద్ధం చెప్తుంటారు. ఎందుకంటే నిజం చెప్తే తిడతారని వారు అనుకుంటారు. పిల్లలకు ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపించినా, ఏదైనా పొందడానికి లేదా మీ ప్రతిస్పందనను తెలుసుకోవడానికి అబద్ధాలను చెప్తారు. మీకు తెలుసా? మూడేళ్ల వయసు నుంచే పిల్లలు అబద్ధాలు చెప్పడం మొదలుపెడతారు. నాలుగు నుంచి ఆరేళ్ల వయసులో వారికి దేనికి అబద్దాలు చెప్పాలో నేర్చుకుంటారు. 


నిజం మాట్లాడే వాతావరణాన్ని కల్పించండి

అబద్ధం చెప్పడానికి అతి ముఖ్యమైన కారణం భయం. పిల్లల మనసులోని ఈ భయాన్ని తొలగించడం చాలా అవసరం. నిజం చెప్పినందుకు వారిని పేరెంట్స్  తిట్టరనే నమ్మకం పిల్లలకు కలగాలి. తల్లిదండ్రులు ఏమీ అనరు, తమను అర్థం చేసుకుంటారనే భావన కలిగినప్పుడు పిల్లలు అబద్దాలు ఆడే అవకాశ రాదు. పిల్లలు అబద్దాలు చెప్పకుండా  ఆపడానికి ఉత్తమ మార్గం పిల్లలకు నిజం చెప్పే వాతావరణాన్ని కల్పించాలి. మరొక విషయమేంటంటే? నిజం చెప్పినందుకు తిట్టబోమని పిల్లలకు నమ్మకం కల్పించాలి. అలాగే మీ మాటను నిలబెట్టుకోవాలి. 
 

అబద్ధాలు, నిజాల మధ్య వ్యత్యాసం 

నిజం, అబద్దాల గురించి పిల్లలతో మాట్లాడండి. అబద్ధాలు చెప్పడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఉదాహరణలతో వివరించండి. తల్లిదండ్రులే పిల్లలకు అబద్దాలు చెప్తే వాళ్లు ఎలా ఫీలవుతారో వారిని అడగండి. పిల్లలు అబద్దాలు చెప్పకుండా ఉండటానికి వారికి కథలు కూడా చెప్పొచ్చు. కథలు పిల్లల మనస్సులో అలాగే నాటుకుపోతాయి. 

మీ బిడ్డకు అబద్ధం చెప్పొద్దు

పిల్లల స్వభావాన్ని మార్చడానికి మీకు సహనం ఉండటం చాలా అవసరం. మీ పిల్లలు మీకు నిజం చెప్పడం లేదని మీకు తెలిసినప్పటి నుంచి వారిని తిట్టడం, కొట్టడం లాంటివి చేయకండి. అలాగే నిజం మాట్లాడమని పదేపదే మాట్లాడమని ఒత్తిడి చేయకండి. ఓపికతో అన్ని విషయాలను చెప్పండి. ప్రతి విషయంలోనూ పిల్లలను అబద్ధాలకోరు అనడం మంచిది కాదు. ఇది పిల్లల మనస్సులో అలాగే నాటుకుపోతుంది.  దీంతో వారు ఇంకా ఎక్కువ అబద్దాలు చెప్పడం మొదలుపెడతారు. 

Latest Videos

click me!