నీలి చిత్రాలు చూసే అలవాటు ఉంది.. కొత్త వాళ్ళ దగ్గర ఓపెన్ కాను... బిగ్ బాస్ ఆషురెడ్డి చీకటి కోణం లీక్డ్

First Published | Sep 8, 2021, 2:25 PM IST

సమాజంలో కనిపించే మనిషికి, నిజ స్వరూపానికి చాలా బేధం ఉంటుంది. 'ఒంటరిగా ఇంటిలో ఉన్నప్పుడు నువ్వు ఏమిటో అదేరా నువ్వు..' జబర్దస్త్ షోలో ఓ కమెడియన్ చెప్పిన డైలాగ్ ఇది. వాస్తవంగా ఇది అక్షర సత్యం.

అలా ఎవరికీ తెలియని తనలోని కోణాన్ని బయటపెట్టింది బిగ్ బాస్ ఫేమ్ ఆషురెడ్డి. రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆషురెడ్డి, వర్మ అడిగిన ప్రశ్నలో భాగంగా ఆషురెడ్డి తనకు పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఉందని ఒప్పుకుంది. 


ఆషురెడ్డితో వర్మ ఓ బోల్డ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ ప్రోమోలతో మరోమారు జనాలను ఆకర్షించాడు వర్మ. నిన్న ఈ ఇంటర్వ్యూ పూర్తి ఎపిసోడ్ ని యూట్యూబ్ లో విడుదల చేశారు. 



ఓ కాఫీ షాప్ లో ఒంటరిగా కూర్చున్న ఆషురెడ్డి వద్దకు వెళ్లిన వర్మ, ఆమెతో పరిచయం పెంచుకోవడనికి ట్రై చేస్తాడు. నువ్వు ఎవరో తెలియదని ఆషురెడ్డి చెప్పినప్పటికీ ఆమె టేబుల్ వద్ద కూర్చుని మాటలు కలుపుతాడు. 

నీ థైస్ బాగున్నాయని ఓపెన్ గా చెప్పడంతో వర్మ చెంపపై కొడుతుంది ఆషురెడ్డి. అలా అయినా నీ చేయి నన్ను తాకే అదృష్టం దక్కుతుందని, కుట్ర పన్ని ఆ కామెంట్ చేశానని వర్మ, ఆమెకు షాక్ ఇస్తాడు. 

ఈ క్రమంలో ఆడవాళ్ళ అందాలు, సెక్స్ అంటే తనకు ఎంత ఇష్టమో పదే పదే ఆషురెడ్డికి వర్మ చెబుతూ ఉంటాడు. సెక్స్ అనే పదం వాడడం సొసైటీలో నిషిద్ధం అని, కాని మీరు ఇప్పటికి అనేక మార్లు ఆ పదం వాడారని ఆషురెడ్డి వర్మతో అన్నారు.

సెక్స్ అనేది చెడ్డ విషయం అయితే మీరు తిట్టాల్సింది దేవుణ్ణి, ఎందుకంటే సెక్స్ సృష్టించింది దేవుడు కాబట్టి, అంటూ వర్మ తన మార్క్ లాజిక్ చెప్పాడు. పనిలో పనిగా, నాకు నీలి చిత్రాలు చూసే అలవాటు ఉందన్న వర్మ,  నువ్వు నీలి చిత్రాలు చూస్తావా? అని ఆషురెడ్డిని అడిగారు. 
 

మా ఫ్రెండ్స్ చూస్తారని, నేను చూడనని ఆషురెడ్డి మొదటి అబద్దం చెప్పింది. వర్మ తన స్టైల్ లో ఆమె దగ్గర నుండి నిజం రాబట్టాడు. కొత్త వాళ్ళ దగ్గర ఇలాంటి విషయాలు ఓపెన్ గా చెప్పలేం కదా... కాని నేను కూడా నీలి చిత్రాలు చూస్తానని ఆషురెడ్డి ఒప్ప్పుకోవడం జరిగింది. 

ఇండియాలో కూడా పోర్నోగ్రఫీ చట్టబద్దం చేయాలని, దాని వలన జరిగే ప్రయోజనాలు ఇవి అంటూ... ఈ ఇద్దరు మేధావులు చర్చించుకున్నారు. ఆషురెడ్డితో వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ జనాలను బాగానే ఆకర్షించింది. 
ఇప్పటి వరకు నాలుగు లక్షలకు పైగా ఈ ఇంటర్వ్యూ వీడియో చూశారు. 

ఇక ఎప్పటిలాగే వర్మ పైత్యానికి అందరూ కళ్ళు ఎర్ర చేస్తున్నారు. వర్మ ఏంటి మాకు ఈ ఖర్మ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ తరహా  వీడియోల వలన యాంకర్స్ కి కలుగుతున్న ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదు. 


అరియనా సైతం వర్మతో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. దాని వలన ఆమె కెరీర్ కి ఒరిగింది ఏమీ లేదు. తాజాగా ఆషురెడ్డి బోల్డ్ ఇంటర్వ్యూ పేరుతో బూతు ఇంటర్వ్యూలో పాల్గొంది.. 

Latest Videos

click me!