#BhimaaReview: గోపీచంద్ 'భీమా' రివ్యూ

First Published | Mar 8, 2024, 2:41 PM IST

  భీమా..గోపిచంద్ ని  ఫ్లాఫ్ ల నుంచి బయిట పడేస్తుందా... టీజర్, ట్రైలర్స్ తో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు పే చేస్తుంది ?
 

Bhimaa Review

ఒకప్పుడు గోపీచంద్ సినిమా అంటే బి,సి సెంటర్లలలో పండగ వాతావరణం ఉండేది. కానీ గత పదేళ్లుగా సరైన హిట్ అనేది గోపిచంద్ కు పడక బాగా వెనకపడిపోయాడు. బి,సి సెంటర్లు కూడా బాగా అప్డేట్ అయ్యిపోయాయి. దాంతో పక్కా కమర్షియల్ కథలు చేయాలనే తాపత్రయలో చేస్తూ వస్తున్న సినిమాలు అన్ని వర్కవుట్ కాలేదు. అయితే తన పంధాని కొద్దిగా మార్చుకుంటూ ఓ కన్నడ దర్శకుడుతో సెమీ సోషల్ ఫాంటసీ లాంటి కథని యాక్షన్ తో మిక్స్ చేసి మన ముందుకు తీసుకు వచ్చారు.  మరి ఈ  భీమా..గోపిచంద్ ని  ఫ్లాఫ్ ల నుంచి బయిట పడేస్తుందా... టీజర్, ట్రైలర్స్ తో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు పే చేస్తుంది ?
 

స్టోరీ లైన్ 


మహేంద్రగిరిలో అరాచక శక్తులతో అల్లకల్లోలంగా ఉంటుంది. అక్కడ  తిరుగులేని శక్తి భవాని (ముఖేష్ తివారి). తన ట్యాంకర్స్ కు ఎవరు అడ్డుపడ్డా భవాని ఊరుకోడు. అవతలివాడు ఎలాంటివాడైనా ప్రాణం తీస్తాడు. అలా చెక్ పోస్ట్ దగ్గర తన ట్యాంకర్స్ ని ఆపిన ఒక ఎస్సై (కమల్ కామరాజు)ను చంపేస్తాడు. అప్పుడు ఆ ప్లేస్ లో  భీమా (గోపీచంద్) ఆ ఊరికి ఎస్సైగా వస్తాడు.  అయితే అందరిలాంటివాడు కాదు బీమా. భవానీకి వార్నింగ్ ఇచ్చి, అతనిపై ఎటాక్ చేస్తూంటాడు. విలన్  భవాని మనుషుల్ని తాట తీస్తూంటాడు. అలా చివరకు అతను  చెక్ పోస్ట్ దగ్గర ట్యాంకర్ల దగ్గరకు వస్తాడు. అప్పుడేమైంది...భవాని ఏం చేసాడు. అశలు ఆ ట్యాంకర్లలో ఉన్న సీక్రెట్ ఏమిటి..భీమాని అడ్డుకోవటం కోసం భవాని పన్నిన వ్యూహం ఏమిటి..చివరకు మహేంద్రగిరిలో పరిస్దితులు చక్కబడ్డాయా.. ప్రీ క్లైమాక్స్ లో రివీల్ అయ్యే అసలు ట్విస్ట్ ఏమిటి...  విద్య (మాళవికా శర్మ) కు  భీమా రిలేషన ఏమిటి..విద్య వచ్చాక  జీవితంలో ఏం జరిగింది? అలాగే రామా (గోపీచంద్), పారిజాతం (ప్రియా భవానీ శంకర్) పాత్రలు ఏమిటి?  పరశురామ క్షేత్రంలో గత యాభైఏళ్లుగా  మూత పడిన శివాలయానికి ఈ కథకు సంబంధం ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే  సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

Latest Videos


విశ్లేషణ.

పరశురామ క్షేత్రం గొప్పతనం ఏమిటి.,అసలు  అక్కడ ఏ దేముడు ఉన్నాడు వంటి విషయాలు వాయిస్ ఓవర్ లో చెప్తూ సినిమా ప్రారంభం అవుతుంది. మనం అది చూసి ఏదో స్పిరుట్యువల్ థ్రిల్లర్ చూడబోతున్నాము అనుకుంటాము. కానీ అదేమీ కాదని ఓ పావుగంటలో తేల్చేసి రొటీన్ కమర్షియల్ నేరేషన్ లోకి వచ్చేస్తాడు డైరక్టర్.  మారుతున్న ప్రేక్షకుడిని మడతపెట్టడం అంత ఈజీ అయితే కాదు. వారిని సినిమా చూసేటప్పుడు సెల్ ఫోన్  వైపు చూడకండా, యంగేజింగ్ గా వుంచడం కోసం కొత్త తరహ స్క్రీన్ ప్లేలని అనుసరించాల్సి వస్తోంది.  ఏ మాత్రం తెలిసిందే...ఇదే కదా కథా అనిపించిందా వెంటనే మూడ్ ఛేంజ్ అయ్యిపోతోంది. ఒక్కసారి ప్రక్కకు వెళ్లిన వాడిని మళ్లీ ట్రాక్ లోకి తేవటం చాలా కష్టంగా మారింది. ఇలాంటి పరిస్దితుల్లో గోపిచంద్ ఆచి,తూచి అడుగులు వేసారన్న రీతిలో కన్నడం నుంచి వచ్చిన దర్శకుడుతో సినిమా చేసారు. అయితే ఆ దర్శకుడు కేవలం సినిమా ప్రారంభం, చివర పెట్టుకుని మిగతాదంతా గోపిచంద్ పాత సినిమాలు చూసి సీన్స్ ఆర్డర్ వేసినట్లున్నాడు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ లో కాంతారా ని గుర్తు చేసే ప్రయత్నం చేసారు. ఏదో ఒకటి కొంచెం కొత్తగా చెప్తే చాలు అని జనం ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అయితే ఎవరి అభద్రతాభవమో తెలియదు కానీ రెగ్యులర్ సీన్స్ మాస్ అనే పదం ముసుగులో చూపెడుతున్నారు. 

Bhimaa


నిజానికి  'భీమా' మొదట్లో కొత్తగా మొదలువుతుంది. ఓ పావు గంట దాకా ...అంటే హీరో ఎంట్రీ ఇచ్చేదాకా  పరశురామ క్షేత్రం,అక్కడ జరిగే పూజల గురించి చెప్తూ..ఏదో ఎదర కొత్త కంటెంట్ ని ప్రజెంట్ చేయబోతున్నారనే ఆసక్తి కలగచేసారు. కానీ మెల్లిమెల్లిగా ఆ ఇంట్రస్ట్ తగ్గిపోతూ వస్తుంది. విలన్, హీరో చుట్టూ కథ మొదలై మధ్య మధ్యలో హీరోయిన్ ట్రాక్ ని టచ్ చేస్తూ వెళ్తూంటుంది. మొదట్లో చెప్పిన గుడి ఎలిమెంట్ మళ్లీ ప్రీ క్లైమాక్స్ దాకా ఎత్తుకోరు. కొత్త పాయింట్ సెంట్రల్ గా ఉన్నా దాని చుట్టూ కథ అల్లలేదు. దాంతో గోపిచంద్  పాత సినిమా చూస్తున్నట్టు వుంటుంది.  హీరోని ఎలివేట్ చేసే ఆ పాత మూస సీన్లు అడుగడుగుకి అడ్డుపడుతూ కథని నావెల్టీగా , థ్రిల్లింగ్ గా సాగనివ్వదు. ఉన్నంతలో యాక్షన్ ఎపిసోడ్స్ బాగా డిజైన్ చేసారు. కానీ ఎమోషన్ మిక్స్ కాకపోవటంతో అవీ సోసోగా అనిపిస్తాయి.  

Bhimaa


ఏదైమైనా ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా వుంటేనే చెల్లు బాటు అవుతుంది.  ఎంటర్ టైన్, ఎలివేషన్, ఎమోషన్ కావాలనే ఇస్తే కథకు సెట్ కావు.  భీమా మంచి కమర్షియల్ సినిమాగా అనిపిస్తుందే కానీ అది మారిన కాలానికి తగిన కమర్షియల్ సినిమా అనిపించదు. భీమా క్యారెక్టర్ ఎలా ఉన్నా ఈ కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ నే మనం ఇష్టపడతాం. కమర్షియల్ టచ్ లో ఫాంటసీ ఎలిమెంట్ బ్లెండ్ చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అది ఫెరఫెక్ట్ గాసెట్ అయితే ఆడియన్స్ కు ఇది సరికొత్త అనుభూతిని ఇస్తుంది. లేకపోతే భీముడై చూసేవారిని పిడిగుద్దులు గుద్దుతుంది. 


టెక్నికల్ గా...

అద్బుతం అని చెప్పలేం కానీ టెక్నికల్ గా భీమాకు మంచి మార్కులు పడతాయి. రవి బస్రూర్ నేపధ్య సంగీతం ఇంపాక్ట్ ఫుల్ గా ఇచ్చాడు. కానీ పాటలు సోసోగా ఉన్నాయి.  యాక్షన్ సీక్వెన్స్ లలో చేసిన బీజీఎం అదరకొట్టారు.   కెమరావర్క్  ఆకట్టుకుంటుంది. విజువల్స్ ప్రేక్షకుడిని ఆ యాక్షన్ మూడ్ లోకి తీసుకెళ్తాయి. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. సెమీ ఫాంటసీ లుక్ తోవటం కోసం పడిన  కష్టం తెరపై కనిపించింది.   డైలాగ్స్  ఓ మాదిరిగా ఉన్నాయి. యాక్షన్ సినిమాలకు ఇలాగే రాయాలి అన్నట్లు రాసుకుంటూ పోయారు.  ఎంచుకున్న పదాలు కూడా గాంభీర్యంగా ,రైమింగ్ లో ఉండాలని ట్రై చేసారు.  


ప్లస్ లు  : 
స్టోరీలైన్
గోపిచంద్ యాక్షన్ ఎపిసోడ్స్
ఇంటర్వెల్ ఫైట్
ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ లు  : 

  రొటిన్ గా సాగే సీన్స్ 
నావెల్టీ లేని స్క్రీన్ ప్లే
పాటలు
రొమాంటిక్ ట్రాక్
 

Gopichand bheema


ఫైనల్ థాట్

ఓవరాల్ గా భీమా  చెప్పుకోదగ్గ  మూడు యాక్షన్ సీక్వెన్స్, ఒక ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్  వున్న యాక్షన్ డ్రామా. అయితే ఈ ఎపిసోడ్స్  ని ఆస్వాదించాలన్నా కాస్త ఓపిక తెచ్చుకోవాలి. 
Rating:2.5
 

బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
నటీనటులు: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ తదితరులు.
 డీవోపీ: స్వామి జె గౌడ
సంగీతం: రవి బస్రూర్
ప్రొడక్షన్ డిజైనర్: రమణ వంక
ఎడిటర్: తమ్మిరాజు
ఆన్‌లైన్ ఎడిటర్: కిరణ్
డైలాగ్స్: అజ్జు మహంకాళి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంక, డాక్టర్ రవివర్మ
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ హర్ష
నిర్మాత: కేకే రాధామోహన్
విడుదల తేదీ:  మార్చి  8, 2024

click me!