స్ట్రెస్ లేకుండా ఉండాలంటే రోజూ ఉదయాన్నే ఏం చేయాలో తెలుసా?

First Published | Jul 30, 2024, 3:06 PM IST

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడి ఒక్క మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే మీరు ఉదయం కొన్ని పనులు చేస్తే మాత్రం ఒత్తిడి లేకుండా ఉంటారు. 
 

ఒత్తిడి చాలా చిన్న విషయమే అని అనిపించొచ్చు. కానీ ఇది మనల్ని క్రమంగా చంపే ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి. అవును ఈ ఒత్తిడి కేవలం మానసిక  ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. మన మనసులో ఏదైనా గందరగోళం, భయం ఉంటే ఏ పనీ సరిగ్గా చేయలేం. ముఖ్యంగా నేటి కాలంలో ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు యాంత్రిక జీవనం గడుపుతున్న ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలని అందరికీ ఉంటుంది. కానీ అలా బతకలేరు. కానీ మీరు ఉదయాన్నే కొన్ని పనులు చేస్తే మాత్రం ఒత్తిడి లేని లైఫ్ ను గడుపుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 


ధ్యానం

ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలనుకుంటే ప్రతిరోజూ ధ్యానం చేయండి. కష్టాలను, అడ్డంకులను అధిగమించేటప్పుడు ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు ఉదయాన్నే 15-20 నిమిషాల పాటు ధ్యానం చేయండి. ధ్యానం మీ మనసును ఏకాగ్రతగా ఉంచుతుంది. అందుకే ఏదైనా పనిచేసే ముందు మీరు లోతైన శ్వాస తీసుకోండి. ధ్యానం, శ్వాస వ్యాయామాలు మీ రోజును ఒత్తిడి లేకుండా చేయడానికి బాగా సహాయపడతాయి.


ఉదయాన్నే నిద్రలేవడం

పొద్దున్నే మీరు ఎంత త్వరగా నిద్రలేస్తే మీరు మీ పనులను అంత త్వరగా పూర్తి చేయగలుగుతారు. దీంతో మీరు హడావుడి పడి.. ఇతరులను తిట్టి, మీరు ఒత్తిడికి లోనుకాకుండా ఉంటారు. మీకు ఇష్టమైన కప్పు టీ లేదా కాఫీ తాగి మీ రోజును స్టార్ట్ చేయండి. 
 

Reduce Stress

వాటర్

శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల మీరు మీ పనులను సమయానికి చేసుకోలేరు.  కాబట్టి ఏదైనా తినే ముందు నీళ్లను పుష్కలంగా తాగండి. వీటితో పాటుగా విటమిన్ సి పోషకాలు పుష్కలంగా ఉండే నిమ్మ, సిట్రస్ పండ్లను కూడా మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి. ఇవి మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఎనర్జీని అందిస్తాయి. 
 

సానుకూల మనస్తత్వం

మీరు జీవితంలో ఒత్తిడి లేకుండా ఉండాలనుకుంటే మీ ఆలోచనలను పాజిటీవ్ గా ఉండాలి.  ఎంత కష్టమైన పని అయినా చాలా ధైర్యంగా ఉండాలి. "నేను నా పనులన్నీ పూర్తి చేస్తాను లేదా ఈ రోజు నాకు అంతా మంచే జరుగుతుంది. అని అనుకోవాలి. 

Latest Videos

click me!