ఈ డైట్ ప్లాన్స్ వెయిట్ లాస్ కు అస్సలు పనికిరావు.. ఎందుకంటే..

First Published Sep 7, 2021, 2:46 PM IST

మార్కెట్లో ఎన్నో రకాల డైట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. లెక్కకు మిక్కిలిగా ఉన్న ఈ డైట్ ప్లాన్స్ లో ఏది ఎంచుకోవాలో పెద్ద భేతాళప్రశ్న. అయితే వీటిలో అన్నీ మంచివేనా అంటే కానేకావు.. అన్నిరకాల డైట్ ప్లాన్స్ సరిపోవు. మరికొన్ని బరువు తగ్గించడానికి బదులు పెంచే అవకాశమూ ఉంది. 

బరువు తగ్గడం అంత సులభమైన విషయం ఏమీ కాదు. బరువు పెరగడం ఎంత వేగంగా జరుగుతుందో.. తగ్గడం అంత నెమ్మదిస్తుంది. కానీ చాలామంది పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే వారి ప్రయత్నంలో ఎంత నిజాయితీ ఉన్నా కొన్నిసార్లు.. కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల వారి ప్రయత్నం సఫలం కాదు. 

మార్కెట్లో ఎన్నో రకాల డైట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. లెక్కకు మిక్కిలిగా ఉన్న ఈ డైట్ ప్లాన్స్ లో ఏది ఎంచుకోవాలో పెద్ద భేతాళప్రశ్న. అయితే వీటిలో అన్నీ మంచివేనా అంటే కానేకావు.. అన్నిరకాల డైట్ ప్లాన్స్ సరిపోవు. మరికొన్ని బరువు తగ్గించడానికి బదులు పెంచే అవకాశమూ ఉంది. 

కొన్ని రకాల డైట్స్ వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సరిగా అందవు. మరికొన్నింటివల్ల శరీరం నీరసపడిపోతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు కానీ.. అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు. డైటింగ్ ఆపిన తరువాత క్రానికల్ డిసిసెస్ బారిన కూడా పడతారు.

అలాంటి ఐదురకాల డైట్స్ ను మీరు అస్సలు ఫాలో కాకూడదు. అందులో ఒకటి మాస్టర్ క్లెన్స్. దీన్నే లెమనేడ్ డైట్ అంటారు. ఈ డైట్ ప్రకారం ఘనపదార్థాలు ఏవీ తీసుకోవద్దు. పది రోజులపాటు ఉండే ఈ డైట్ లో కేవలం నిమ్మకాయ రసం తప్ప వేరే తీసుకోవడం నిషేధం. 

హోల్ 30 డైట్ : ఈ డైట్ 30 రోజుల పాటు చేయాలి. ఈ డైట్ సమయంలో చక్కెరలు, ఆల్కహాల్, లెగ్యూమ్స్, పాల ఉత్పత్తులు, బేక్ డ్ ఫుడ్స్ ను పూర్తిగా తినకుండా ఉంటారు. దీనివల్ల నిద్రాభంగం కలుగుతుంది. అలిసిపోయిన భావనలో ఉంటారు. 

diet

జీఎమ్ డైట్ : దీన్నే జనరల్ మోటార్స్ డైట్ అంటారు. ఇది ఏడురోజుల డైట్ ప్లాన్. దీంట్లో హోల్ గ్రెయిన్స్, పాల ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ చక్కెరల జోలికి పోకుండా చాలా స్ట్రిక్ట్ గా డైట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పోషకాల లేమి ఏర్పడుతుంది.  

ఆల్కలైన్ డైట్ :  ఈ డైట్ కు సైంటిఫిక్ గా ఎలాంటి ఆధారాలూ లేవు. ఇది రక్తంలోని పిహెచ్ స్థాయిలను నిలకడగా ఉంచుతుందనడానికి రుజువులు లేవు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. మీరు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు అనేది రక్తం పిహెచ్ మీద ఎలాంటి ప్రభావం చూపించదు. 

పాలియో డైట్ : ఈ డైట్ లో రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ , పప్పుధాన్యాలు, లెగ్యూమ్స్, పాల ఉత్పత్తులు తినకూడదు. దీనికి బదులు మాంసం, చేపలు, పండ్లు, కూరగాయలు తినమని చెబుతుంది. దీనివల్ల మీకు  ఎస్సెన్షియల్ న్యూట్రీషన్స్ అందకుండా పోతాయి. 

click me!