World Music Day 2022: మ్యూజిక్ తో మస్తీనే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా మస్తుగున్నయ్..

Published : Jun 21, 2022, 11:31 AM IST

World Music Day 2022: మ్యూజిక్ అంటే ఇష్టపడని వారు ఉండరేమో.. ఇది కేవలం వినోదం కోసమే కాదు.. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎన్నో జబ్బులు తగ్గిపోతాయి. 

PREV
17
World Music Day 2022: మ్యూజిక్ తో మస్తీనే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా మస్తుగున్నయ్..
World Music Day

ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం. ప్రతి ఏడాది జూన్ 21 ని ప్రపంచ సంగీత దినోత్సవం (World Music Day) గా జరుపుకుంటారు. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని మొదటిసారిగా 1982లో ఫ్రాన్స్ లో జరుపుకున్నారు. దీనిని అప్పటి ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ నిర్వహించారు. సమ్మర్ సోలిటిస్ వద్ద జాక్ లాంగ్,  మారిస్ ఫ్లోరెట్ పారిస్ లో ఫెటే డి లా సంగీతాన్ని ప్రారంభించారు. అందుకే ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఫెటే డి లా మ్యూజిక్ అని పిలుస్తారు.
 

27
world music day

ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రారంభించడం, నిర్వహించడానికి ఫ్లోరెట్ ప్రధాన వ్యక్తిగా చెప్తారు. భారతదేశం, ఇటలీ, బ్రెజిల్, జపాన్, చైనా, మెక్సికో, కెనడా, మలేషియా, గ్రీస్, రష్యా, ఈక్వెడార్, ఆస్ట్రేలియా, పెరూ, యుకె వంటి దేశాలు కూడా సంగీత దినోత్సవాన్ని జరుపుకున్నాయి. మరి సంగీతం మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

37
World Music Day

సంగీతం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది:  నొప్పి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించడంలో సంగీతం మెడిసిన్ లా పనిచేస్తుంది. భావోద్వేగ వ్యక్తీకరణ అవకాశాలను కూడా సులభతరం చేస్తుంది. సంగీతం మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 
 

47

సంగీతం మెదడులో డోపామైన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ డోపామైన్ ఆందోళన (Anxiety), నిరాశ (Disappointment) వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  నాడీ సంబంధిత రుగ్మతలను కూడా తగ్గిస్తుంది. 

57
alzheimer's

చిత్తవైకల్యాన్ని ఎదుర్కోవడంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అల్జీమర్స్ (Alzheimer's) తో బాధపడుతున్న వ్యక్తులు క్రమం తప్పకుండా శాస్త్రీయ సంగీతాన్ని వింటే.. అది అతని మెదడు పనితీరుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

67

రాత్రిపూట మంచిగా నిద్రపట్టడానికి సంగీతం (Music) సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మానసిక ఒత్తిడి నుంచి మనస్సును, శరీరాన్ని రక్షిస్తుంది. సంగీతం మితిమీరిన కోపాన్ని నియంత్రించగలదు. అందుకే ఊరికూరికే కోపగించుకునే వారు పాట వినడం చాలా అవసరం.
 

77

రక్తపోటును నియంత్రించడంలో సంగీతం చక్కటి మెడిసిన్ లా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మన శరీరానికి తీసుకువచ్చే ఆనందం, ప్రశాంతత మన రక్తపోటు స్థాయిని తగ్గిస్తుంది. పిల్లల మెదడుపై సంగీతం ప్రభావాన్ని పరిశోధనా బృందం గమనించింది. అమెరికన్ అకాడమీలో రీసెర్చ్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. సంగీత వాయిద్యాలు పిల్లల మెదడుపై అనుకూల ప్రభావాన్ని చూపాయని కనుగొన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories