World Cancer Day 2024 : క్యాన్సర్ ను ముందుగానే గుర్తించే లక్షణాలు ఇవి..

First Published | Feb 3, 2024, 12:47 PM IST

World Cancer Day 2024 : క్యాన్సర్ తో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. నిన్న బాలీవుడ్ నటి పూనమ్ పాండే కూడా క్యాన్సర్ తోనే మరణించారు. కేవలం 32 ఏండ్ల వయసులోనే ఆమె చనిపోవడం అందరినీ ఆశ్యర్యానికి లోను చేసింది. సాధారణ జనాల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో మంది క్యాన్సర్ బారిన పడి అర్థాంతరంగా చనిపోతున్నారు. అసలు క్యాన్సర్ ను ముందుగానే గుర్తిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం తగ్గుతుంది. అందుకే ఈ రోజు క్యాన్సర్ ను ముందస్తుగా ఎలా గుర్తించాలో తెలుసుకుందాం పదండి. 

ప్రతి ఏటా క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నవారు ఎంతో మంది ఉన్నారు. అంతేకాక ఏటేటా క్యాన్సర్ తో చనిపోతున్నవారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ముఖ్య ఉద్దేశం క్యాన్సర్ పై అవగాహన కల్పించడం. 

క్యాన్సర్ అనేది మన శరీరంలోని ఏ అవయవాన్నైనా లేదా కణజాలాన్ని ప్రభావితం చేయొచ్చు. ఇది అనియంత్రితంగా విభజించే కణాల అసాధారణ పెరుగుదలను సూచిస్తుంది. క్యాన్సర్ ఒక శరీర భాగం  లేదా అవయవం లేదా కణజాలానికి మరొకదానికి వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 


ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ రోగ నిర్ధారణ, చికిత్స సహాయంతో దీన్ని తగ్గించుకోవచ్చు. కానీ ఇందుకోసం క్యాన్సర్ ను మొదట్లోనే గుర్తించాల్సి ఉంటుంది.  క్యాన్సర్ ను స్క్రీనింగ్ ద్వారా గుర్తించొచ్చు. అలాగే కొన్ని లక్షణాలతో కూడా దీన్ని గుర్తుపట్టొచ్చు. 

ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, పెద్దప్రేగు, కడుపు, కాలేయ క్యాన్సర్లు పురుషులకు వచ్చే సర్వ సాధారణమైన క్యాన్సర్లు. అలాగే రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు, ఊపిరితిత్తులు, గర్భాశయ, థైరాయిడ్ క్యాన్సర్లు ఎక్కువగా ఆడవాళ్లకే వస్తాయి. అధిక బాడీ మాస్ ఇండెక్స్, మందు తాగడం, వంశపారంపర్యం, కొన్ని ఆరోగ్య సమస్యలు, పర్యావరణం వంటివి క్యాన్సర్ కు ప్రమాద కారకాలు. మరి క్యాన్సర్ ను గుర్తించే లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

కణితులు

మీకు శరీరంలోని ఏ భాగంలోనైనా కణితులు వచ్చినట్టు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోకండి. నొప్పి ఉన్న, నొప్పి లేని ఖణితులు కూడా క్యాన్సర్ కు కారణమవుతాయి. ఇక కొన్ని కణితులు అయితే వేగంగా పెరుగుతాయి. అందుకే కణితులు అయితే వెంటనే హాస్పటల్ కు వెళ్లి పరీక్షలు చేయించుకుని క్యాన్సర్ కాదని నిర్దారించుకోండి. క్యాన్సర్ వల్ల అయ్యే కణితులు ఎక్కువగా మెడ, చంకలు, ఛాతీ, రొమ్ములు లేదా వృషణాలలో కనిపిస్తాయి.
 

బరువులో తేడా

కాలక్రమేనా బరువు తగ్గడం చాలా సహజం. కానీ బరువు తగ్గడానికి చాలా రోజుల టైం పడుతుంది. అది కూడా ఇందుకు మీరు ప్రయత్నిస్తేనే. కానీ ఎలాంటి ప్రయత్నం చేయకుండా గుర్తించదగిన మొత్తంలో మీరు బరువు తగ్గినట్టైతే అనుమానించాల్సిందే. ఇలా అయితే మీరు వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. టెస్టులు చేయించుకోండి. ఎందుకంటే ఇది కూడా క్యాన్సర్ లక్షణమే కాబట్టి.
 

పుట్టుమచ్చలు

సహజంగా చర్మంపై పుట్టుమచ్చలు ఉంటాయి. కానీ పుట్టుమచ్చటు ఎక్కువగా పుట్టుక రావడం, పుట్టుమచ్చలు విస్తరించడం లేదా రక్తస్రావం అయితే మాత్రం మీరు ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలి. నోట్లో గాయలు అయితే కూడా అనుమానించాలి. ఎందుకంటే ఇవి కూడా క్యాన్సర్ లక్షణాలే కాబట్టి.

అలసట

మీరు సాధారణం కంటే ఎక్కువ అలసిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటుంటే లేదా నిద్రపోవడానికి ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లడమే మంచిది. అయితే మీరు పని చేసినా, చేయకపోయినా ఎప్పుడూ అలసిపోయినట్టుగానే ఉంటే హాస్పటల్ కు వెళ్లి టెస్టులు చేయించుకోవాలి. 
 

చెమటలు

రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం కూడా మంచిది కాదు. ఎందుకంటే రాత్రిపూట చెమటలు ఎక్కువగా పట్టడం.. లింఫోమా వంటి కొన్ని క్యాన్సర్ల ప్రారంభ లక్షణం. రాత్రిపూట చెమట పట్టడం కూడా నిర్ధారణ చేయని క్యాన్సర్ ప్రారంభ లక్షణం.

చర్మ రంగు పాలిపోవడం

క్యాన్సర్ వల్ల మన చర్మం కూడా ప్రభావితం అవుతుంది. చర్మ క్యాన్సర్ మొదటి లక్షణం ఇది . దీనివ్ల చర్మ రంగు పాలిపోవడం లేదా మచ్చలు అవుతాయి. 

Latest Videos

click me!