Vegetables
సీజనల్ పండ్లను, కూరగాయలను పక్కాగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిద్వారే మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అందులోనూ ఇవి ప్రాసెస్ చేయబడవు కూడా. సీజనల్ పండ్లను, కూరగాయలను తినకపోతే మన శరీరంలో ఎన్నో రకాల పోషకాలు లోపిస్తాయి. అందుకే వీటిని మిస్ చేయకూడదు. తాజా పండ్లు, కూరగాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో వ్యాధులతో పోరాడుతాయి.
Vegetables
సీజనల్ పండ్లు, కూరగాయలు ఆరోగ్య ప్రయోజనాలనే కాదు.. ఆర్థిక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సీజన్ కు తగ్గట్టు పంటలను పండించడం వల్ల మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. మంచి ధరకు అమ్ముడవుతాయి. ఇంతకీ శీతాకాలంలో ఎలాంటి కూరగాయలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ముల్లంగి
ముల్లంగిలో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. వీటిలో ఉండే పదార్థాలు మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. మంటను తగ్గిస్తాయి. క్యాన్సర్ తో పోరాడుతాయని ఎన్నో పరిశోధనలు కూడా వెల్లడించాయి. ఇది జాండీస్ ను కూడా తగ్గిస్తుంది. మూత్రానికి సంబంధించిన సమస్యలను నయం చేస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బొల్లి, తెల్లమచ్చలను కూడా తొలగిస్తుంది. అలాగే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది జ్వరాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. సాధారణంగా ముల్లంగి ఒక్క శీతాకాలంలోనే లభిస్తాయి. అందుకే వీటిని తప్పకుండా తినండి.
క్యాబేజీ
క్యాబేజీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు దీన్ని తినడం వల్ల మీరు కేలరీలను ఎక్కువగా తీసుకోలేరు. నిజానికి తరిగిన ఒక కప్పు క్యాబేజీలో కేవలం 18 కేలరీలే ఉంటాయి. అలాగే 4 గ్రాముల కార్భోహైడ్రేట్లు ఉంటాయి. వీటిలో ఫైబర్ కంటెంల్ పుష్కలంగా ఉంటుంది. ఈ కూరగాయ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ ఆకలిని నియంత్రిస్తుంది. ఈ కూరగాయ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కంటి సమస్యలను తొలగిస్తుంది. ఇది కొన్నిరకాల క్యాన్సర్లను కూడా నిరోధిస్తుంది.
బీట్ రూట్
దుంపలు అని పిలిచే బీట్ రూట్ లో ఎన్నో ఔషదగుణాలను కలిగి ఉంటాయి. వీటిలో ఉండే పదార్థాలు రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. దీనిలో పోటాషియం అనే ఖనిజం తో పాటుగా ఎన్నో రకకాల పోషకాలు ఉంటాయి. దీనిలో మాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు, కీళ్ల సమస్యలు రాకుండా ఉండేందుకు కొల్లాజెన్ సంశ్లేషణకు ఈ ఖనిజం చాలా అవసరం. వీటిలో ఫోలెట్ వంటి మన శరీరానికి శక్తినిచ్చే బి విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
క్యారెట్
క్యారెట్లు పోషకాలకు మంచి వనరు. దీనిలో ఉండే బీటా కెరోటిన్ మన శరీరంలోకి వెళ్లి విటమిన్ ఎగా మారుతుంది. ఈ విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపును పెంచి.. కంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీర ఎదుగుదల బాగుంటుంది. దీనిలో కెరోటినాయిడ్లు అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
చిలగడదుంపలు
చిలగడదుంలపు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. వీటిని శీతాకాలంలో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. దీనిలో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చిలగడదుంపలు పోషకాలకు మంచి వనరు. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటిని తింటే సీజనల్ వ్యాధులను నుంచి దూరంగా ఉంటారు.
ఎర్ర క్యాబేజీ
చల్లని వెదర్ లో పెరిగే మంచి పోషక వనరు ఎర్ర క్యాబేజీ. క్యాబేజీలో ఎరుపు, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ రెండు రంగుల క్యాబేజీలో మంచి పోషకాలు ఉన్నప్పటికీ.. ఎరుపు క్యాబేజీ యే మన ఆరోగ్యానికి ఎక్కువ మంచిది. ఎందుకంటే ఎర్ర క్యాబేజీలో పోషకాలు ఆకుపచ్చని క్యాబేజీలో కంటే కాస్త ఎక్కువగా ఉంటాయి. దీనిలో పొటాషియం, బి విటమిన్లు, మాంగనీస్ ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆంథోనిసైనిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్ కుటుంబానికి చెందినవి. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.