What is a black hole: ఈ అనంత విశ్వంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. చంద్రునిపై ఇళ్లు కట్టుకునే స్థాయికి మనిషి ప్రయాణం కొనసాగుతున్న ఛేదించలేని సృష్టి రహస్యాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో 'బ్లాక్ హోల్' ఒకటి. భూమిని సైతం మింగేసే శక్తి వీటికి ఉంటుంది. ఈ బ్లాక్ హోల్ శక్తి నుంచి మన సూర్యుడు కూడా తప్పించుకోలేడు అంటే ఇది ఎంత శక్తివంతమైనదో మీకు అర్థమై ఉండాలి. బ్లాక్ హోల్స్ చాలా కాలంగా ఖగోళ శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్ర ఔత్సాహికుల ఆసక్తిని ఆకర్షించిన మనోహరమైన ఖగోళ వస్తువులు.
బ్లాక్ హోల్ అంటే ఏమిటి? బ్లాక్ హోల్ లోపల ఏముంది?
బ్లాక్ హోల్ (కృష్ణ బిలం) అనేది ఎంతో బలమైన గురుత్వాకర్షణ త్వరణాన్ని ప్రదర్శించే స్పేస్‌టైమ్ ప్రాంతం. ఈ బలమైన గురుత్వాకర్షణ శక్తి నుంచి ఏ కణమూ, చివరికి కాంతి వంటి విద్యుదయస్కాంత వికిరణంతో సహా ఏదీ కూడా తప్పించుకోలేవు. అంటే అందులోకి ఒక్కసారి వెళ్తే ఇక అది మన దగ్గర నుంచి పోయినట్టే. అది భూమి అయినా, సూర్యుడు అయినా.. ఇంకా మరేదైనా.
'బ్లాక్ హోల్స్' అని పేరు పెట్టబడినప్పటికీ, అవి రంధ్రాలు కావు, చాలా చిన్న ప్రాంతాలలో రద్దీగా ఉండే పదార్థం భారీ సేకరణలు. వాటి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ హోల్స్ రెండు భాగాలను కలిగి ఉంటాయి. అందులో ఒకటి ఈవెంట్ హోరిజోన్. ఇది బ్లాక్ హోల్ ఉపరితలంగా భావించవచ్చు, అయితే ఇది కేవలం ఇతర వాటి నుంచి తప్పించుకోవడానికి గురుత్వాకర్షణ చాలా బలంగా ఉండే పాయింట్. ఇక మధ్యలో ఉండేది ఒక రకమైన రంధ్రం. అదే బ్లాక్ హోల్. ఇక్కడి నుంచి కాంతి కూడా ప్రయాణించలేదు. అంటే కాంతిని కూడా అది మింగేస్తుంది.
అయితే, ఇలా ఎందుకు జరుగుతుందనేది ఇంకా పూర్తిగా అంతు చిక్కని రహస్యం. ఈ ఆసక్తి విషయానికి సంబంధించి అనేక ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం కనుగొనే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలు విషయాలను వెలికి తీశారు. శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్స్ రకాలను వర్గీకరించడంలో విజయవంతంగా పురోగతి సాధించారు.
బ్లాక్ హోల్ ఎన్ని రకాలు?
స్టెల్లార్ బ్లాక్ హోల్ : మన సూర్యుని ద్రవ్యరాశి కంటే దాదాపు ఎనిమిది రెట్లు ఉన్న భారీ నక్షత్రాలు శక్తిని ఎగ్జాస్ట్ చేసినప్పుడు స్టెల్లార్ బ్లాక్ హోల్స్ ఏర్పడతాయి. ఈ సమయంలో నక్షత్రంలోని ప్రధాన భాగం ఒక సూపర్నోవాగా విస్ఫోటనం చెందుతుంది.
సూపర్ మాసిక్ బ్లాక్ హోల్స్ : మన పాలపుంతతో కూడిన భారీ గెలాక్సీలు వాటి మధ్యలో సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్‌ను కలిగి ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ బ్లాక్ హోల్స్ సూర్యుడి కంటే మిలియన్ల, బిలియన్ల రెట్లు ఎక్కువగా ఉంటాయి.
ఇంటర్మీడియట్-మాస్ బ్లాక్ హోల్స్: ఇంటర్మీడియట్-మాస్ బ్లాక్ హోల్స్ కొంచెం మిస్టరీగా మిగిలిపోయాయి. అవి సూర్యుని కంటే వందల నుండి వందల వేల రెట్లు మారుతూ ఉండే ద్రవ్యరాశిని కలిగి ఉన్నాయని భావిస్తున్నారు. ఈ రకమైన బ్లాక్ హోల్స్ ఏర్పాటు స్టెల్లార్ బ్లాక్ హోల్స్ లేదా భారీ నక్షత్రాల ప్రత్యక్ష పతనం నుండి ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు.
ప్రైమార్డియల్ బ్లాక్ హోల్స్ :
ప్రిమోర్డియల్ బ్లాక్ హోల్స్ బిగ్ బ్యాంగ్ తర్వాత కొన్ని సెకన్లలో చాలా ప్రారంభ విశ్వంలో ఉద్భవించాయని భావిస్తున్నారు. ఈ సమయంలో బ్లాక్ హోల్స్ ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి ముఖ్యమైన ఆధారాలను పరిశోధకులు గుర్తించలేకపోయారు. అలాగే, ఈ రకమైన బ్లాక్ హోల్స్ కాలంలో కనుమరుగై ఉంటాయని భావిస్తున్నారు. కృష్ణ బిలాలకు సంబంధించి ఇప్పటికీ వివరించలేని చాలా విషయాలు మిస్టరీలుగా ఉన్నాయి.
బ్లాక్ హోల్స్ తో ప్రమాదముందా?
బ్లాక్ హోల్స్ నుండి మనకు ఎటువంటి ప్రమాదం లేదు. వాటి విషయాలు మనల్ని భయానికి గురిచేస్తున్నాయి. కానీ, మనం బ్లాక్ హోల్స్ కు దగ్గరగా లేము. అలాగే, మనకు దగ్గరగా వస్తున్న బ్లాక్ హోల్స్ కూడా లేవు. కాబట్టి బ్లాక్ హోల్స్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, బ్లాక్ హోల్ మిస్టరీని ఛేదిస్తే మానవ జాతికి ఉపయోగపడే విషయాలు ఉండవచ్చని నమ్ముతున్నారు.
పాలపుంతలో 100 మిలియన్లకు పైగా బ్లాక్ హోల్స్ ఉండవచ్చునీ, వీటిని గుర్తించడం కష్టమని పరిశోధకులు చెబుతున్నారు. పాలపుంత మధ్యలో ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ఉందని నమ్ముతున్నారు. బ్లాక్ హోల్ మొదటి ఫోటోను 2019లో ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ (EHT) సహకారంతో తీశారు. భూమికి 55 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో M87 గెలాక్సీ మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ అద్భుతమైన ఫోటో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలను ఆకర్షించింది. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన సాధారణ సాపేక్ష సిద్ధాంతంతో 1916లో బ్లాక్ హోల్స్ ఉనికిని మొదటిసారిగా ఊహించాడు.