కోసిన ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చా?

First Published | Sep 16, 2021, 2:00 PM IST

ఒలిచిన లేదా తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు అవి వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా, వ్యాధికారక పదార్థాలతో కంటామినేట్ అయ్యే ప్రమాదం అధికంగా ఉంది. దీంతో ఉల్లిపాయల ఆక్సీకరణ చెంది, వ్యాధికారక బ్యాక్టీరియా, పాథోజెన్స్ ఏర్పడడానికి దారితీస్తుంది. 

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత. నిజానికి ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు ఎంతో ఉంది. అంతేకాదు ఉల్లిపాయలు లేకుండా వంట చేయడం అనేది ఊహకు కూడా అందదు. ప్రతీ కూరలోనూ తప్పనిసరిగా అది ఉండాల్సిందే. నాన్ వెజ్ వంటకాల్లో తప్పనిసరిగా వాడతారు. 

కాకపోతే దాని ఘాటు వాసనను భరించడం కష్టం. కోసేప్పుడు కళ్లు మండడం.. ఇదంతా కామనే. కాకపోతే కూరలకు ఉల్లి అందించే రుచి ముందు ఇవన్నీ పెద్దగా బాధపెట్టవు. కాకపోతే ఒకోసారి కోసిన ఉల్లిపాయలు ఎక్కువగా మిగిలిపోతాయి. వాటిని భద్రపరచడం కష్టమై పోతుంది. దీంతో కవర్ లోనో, బాక్సులోనో వేసి జాగ్రత్త చేస్తుంటారు. 


ఇంకొంతమంది రోజూ ఉల్లిపాయలు కోయడం కష్టమనో, లేకపోతే పదే పదే కోయడం పెద్ద పని అనో ఒకేసారి ఎక్కువగా కోసి వాటిని ప్రిజ్ లో పెడుతుంటారు. అయితే ఇలా కోసిన ఉల్లిపాయల్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

ఉల్లి ఘాటైన వాసనే కూరలకు రుచిని పెంచుతుంది. ఈ వాసన ఫ్రిడ్జ్  లో పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం వ్యాపించి దుర్వాసన వేస్తుంది. అంతేకాదు ఉల్లిపాయలో అనేక ఔషధ లక్షణాలు ఉంటాయి. వీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. సల్ఫర్ కూడా పుష్కలంగా ఉంటుంది. 

ఒలిచిన లేదా తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు అవి వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా, వ్యాధికారక పదార్థాలతో కంటామినేట్ అయ్యే ప్రమాదం అధికంగా ఉంది. దీంతో ఉల్లిపాయల ఆక్సీకరణ చెంది, వ్యాధికారక బ్యాక్టీరియా, పాథోజెన్స్ ఏర్పడడానికి దారితీస్తుంది. 

ఉల్లిపాయలను కట్ చేసి..పై తోలు తీసేసి నిల్వచేయడం వల్ల మరో ప్రమాదం కూడా ఉంది. ఉల్లిపాయలు కత్తిరించినప్పుడు.. ఆ కణాలు దెబ్బతిని, ఉల్లిపాయల నుంచి రసాలు విడుదలవుతాయి. ఇవి బ్యాక్టీరియాను ఆకర్షించి వాటి పెరుగుదలకు కారణమయ్యే పోషకాలుగా మారిపోతాయి.

ఒలిచిన ఉల్లిపాయలను రిఫ్రిజిరేటింగ్ పెట్టొద్దనడానికి మరో కారణం, ఫ్రిజ్ లో ఉండే తేమ, చల్లటి ఉష్ణోగ్రత వల్ల ఉల్లిపాయలు క్రిస్పీ దనం కోల్పోతాయి. అంతేకాదు లూజ్ గా మారతాయి. దీనివల్ల వ్యాధికారక కారకాలకు దారితీస్తుంది. ఉల్లిపాయల్లోని పోషక స్థాయిలు తగ్గిపోతాయి. బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుంది.

మరి ఉల్లిపాయలను ఎలా నిల్వ చేయాలి అంటే... ఉల్లిపాయలను తొక్క తీసి, కోసి నిల్వ చేయడం అంత మంచిది కాదు. వాటిలోని పోషకాలను కోల్పోకుండా ఉండాలంటే వంటచేయడానికి ముందే వాటిని కోయడం మంచిది. 

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యుఎస్డిఎ) ప్రకారం, ఉల్లిపాయలను 40 డిగ్రీల ఫారెన్హీట్ లేదా ఫ్రిజ్ లోపల 4.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద సీలు చేసిన కంటైనర్లో ఉంచడం ఉత్తమ మార్గం.

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యుఎస్డిఎ) ప్రకారం, ఉల్లిపాయలను 40 డిగ్రీల ఫారెన్హీట్ లేదా ఫ్రిజ్ లోపల 4.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద సీలు చేసిన కంటైనర్లో ఉంచడం ఉత్తమ మార్గం. ఒలిచిన ఉల్లిపాయను పొడిగ ఉన్న పేపర్ టవల్‌లో చుట్టి ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చు. ఫ్రిడ్జ్ గాలిలోని తేమకు ఇది ప్రభావితం కాకుండా ఉంటుంది. 

Latest Videos

click me!