తిన్న తర్వాత టీ, కాఫీ తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published Jun 18, 2024, 4:22 PM IST

చాలా మంది తినడానికి ముందే టీ లేదా కాఫీని తాగుతుంటారు. అంటే పరిగడుపున తాగుతుంటారు. మరికొంతమంది తిన్న తర్వాతే టీ, కాఫీలను తాగుతుంటారు. కానీ ఇలా తాగడం వల్ల మీ ఆరోగ్యం ఏమౌతుందో తెలుసా? 

మన దేశంలో చాలా మంది ఉదయం లేచి ఒక కప్పు టీ లేదా కాఫీని తాగిన తర్వాతే పనులు మొదలుపెడతారు. ఒక్క ఉదయమే కాకుండా మధ్యాహ్నం సాయంత్రం అంటు ఎప్పుడు పడితే అప్పుడు టీ, కాఫీలను తాగేవారు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది భోజనానికి ముందు టీ, కాఫీలు తాగితే మరికొంతమంది మాత్రం తిన్న తర్వాతే వీటిని తాగుతుంటారు. కానీ రెండు అలవాట్లు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.  తినడానికి ముందు లేదా ఆ తర్వాత వెంటనే టీ తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ఆహారం తిన్న తర్వాత టీ తాగడం వల్ల కలిగే నష్టాలు

జీర్ణ సమస్యలు

తిన్న తర్వాత టీ తాగే అలవాటు మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీ జీర్ణవ్యవస్థ ఆహారాన్ని సరిగా జీర్ణం చేయలేకపోతుంది. దీని వల్ల గ్యాస్-ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. నిజానికి తిన్న వెంటనే మిల్క్ టీ తాగడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే జీర్ణరసాలపై ప్రభావం పడుతుంది. దీనివల్ల ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
 

Latest Videos



రక్తపోటు

టీలో కెఫిన్  కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ రక్తపోటును బాగా పెంచుతుంది.దీంతో మీరు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.  మీరు ఇప్పటికే అధిక రక్తపోటు పేషెంట్ అయితే తిన్న వెంటనే టీ తాగకండి. 

ఇనుము లోపం

తిన్న వెంటనే టీ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. దీని వల్ల మీ శరీరంలో ఐరన్ లోపిస్తుంది. దీనివల్ల మీకు రక్తహీనత వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
 

తలనొప్పి

టీ ని తయారుచేయడానికి ఉపయోగించే పాలలో 2.8 శాతం లాక్టోస్ ఉంటుంది. ఈ లాక్టోస్ కొన్నికొన్ని సార్లు గ్యాస్ సమస్యను కలిగిస్తుంది. ఎందుకంటే లాక్టోస్ లక్షణాలు చక్కెరను సులభంగా జీర్ణించుకోలేవు, ఇది గ్యాస్ సమస్యను కలిగిస్తుంది.

నిద్రలేమి

టీ ఎక్కువగా తాగడం వల్ల మీకు నిద్ర సంబంధిత  సమస్యలు వస్తాయి. ఆహారం తిన్న వెంటనే టీ తాగే అలవాటు ఉంటే మీకు గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. దీనివల్ల మీ నిద్ర దెబ్బతిని మీకు నిద్రలేమి సమస్య వస్తుంది. 

రోజుకు ఎంత కెఫిన్ తీసుకోవడం సురక్షితం?

ఐసిఎంఆర్ ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు 300 మి.గ్రా కెఫిన్ మాత్రమే తీసుకోవాలి. తినడానికి ముందు, ఆ తర్వాత కనీసం ఒక గంట పాటు టీ లేదా కాఫీకి దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే  టీలో టానిన్లు ఉంటాయి. ఇవి మీ శరీరంలో ఇనుము శోషణను తగ్గిస్తాయి. అలాగే మీ శరీరానికి ఇనుమును సరిగ్గా గ్రహించడం కష్టతరం అ వుతుంది. దీనివల్ల మీకు రక్తహీనత సమస్య వస్తుంది. 

click me!