రాత్రిపూట డబ్బులు ఇచ్చినా? తీసుకున్నా? ఏమౌతుందో తెలుసా?

First Published Jun 15, 2024, 1:48 PM IST

చాలా మంది శుక్రవారాల్లో డబ్బును ఎవ్వరికీ ఇవ్వరు. దీనివల్ల డబ్బులు తీసుకున్నవారింటికి లక్ష్మీదేవి వెళ్లిపోతుందని నమ్ముతారు. అయితే రాత్రిపూట డబ్బులు ఇచ్చినా? తీసుకున్నా? ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు. 
 


వాస్తు ప్రకారం.. ప్రతి పని చేయడానికి ఒక సమయం ఉంటుంది. దీన్ని బట్టి పనిచేయడం వల్ల జీవితంలో మీరు సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఇది డబ్బు విషయానికి కూడా వర్తిస్తుంది. తప్పుడు సమయంలో మీరు చేసే కొన్ని పనులు మీకు ఆర్థిక సమస్యలను తెస్తాయి. అందుకే డబ్బు లావాదేవీల సమయంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలా మంది రాత్రిపూట కూడా డబ్బులు ఇస్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్టో తెలుసా? 
 

రాత్రిపూట డబ్బులు ఇస్తే?

నమ్మకాల ప్రకారం..  రాత్రిపూట ఎవరూ కూడా డబ్బులను ఇతరులకు ఇవ్వకూడదు. అలాగే తీసుకోకూడదు. ఎందుకంటే ఇది శుభప్రదంగా పరిగణించబడదు. అలాగే ఇది మీకు ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది కూడా. 
 

Latest Videos


లక్ష్మీదేవి

లక్ష్మీదేవి సాయంత్రం వేళ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పండితులు చెప్తుంటారు. అయితే ఈ సమయంలో మీరు ఎవరికి డబ్బులు ఇచ్చినా అవి మీకు తిరిగి రావు. అందుకే రాత్రిపూట నగదు లావాదేవీలు పెట్టుకోకూడదని చెప్తుంటారు. 
 

ఆర్థిక సమస్య 

రాత్రిపూట మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వడం మంచిది కాదని జ్యోతిష్యులు చెప్తారు. ఎందుకంటే ఇలా మీరు రాత్రిపూట డబ్బులు ఇస్తే మీరు మీ జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. 

సూర్యాస్తమయం తర్వాత 

వాస్తు ప్రకారం.. సూర్యుడు అస్తమించిన తర్వాత డబ్బు లావాదేవీలు జరపడం మంచిది కాదు. ఈ సమయంలో చేసే లావాదేవీల వల్ల మీరు జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుంది. 
 

లక్ష్మీదేవికి కోపం 

వాస్తు ప్రకారం.. లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ ఇంటిని వదిలివెళ్లితే మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. రాత్రిపూట ఎవరికైనా డబ్బులు ఇవ్వడం వల్ల లక్ష్మికి కోపం వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

సంతోషం, శ్రేయస్సు

మత విశ్వాసాల ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత డబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇలాంటి సమయంలో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టైతే ఇది మీ ఇంటి ఆనందం, శ్రేయస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
 

ఏ సమయంలో డబ్బు లావాదేవీలు జరపాలి 

మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా లేదా తీసుకోవాల్సి వచ్చినా.. దీని కోసం మీరు ఉదయం సూర్యోదయ సమయాన్ని ఎంచుకోవచ్చు. ఈ సమయంలో చేసిన లావాదేవీని శుభప్రదంగా భావిస్తారు.

click me!