In the morning, I have a lot of sneezing
మనిషి అన్న తర్వాత.. ఏదో ఒక సమయంలో తుమ్ములు రావడం సహజం. ఇది చాలా సహజ ప్రక్రియ. కానీ... చాలా మంది తుమ్మును అశుభంగా భావిస్తారు. మరి కొందరికి.. అందరి ముందు తుమ్మాలంటే ఇబ్బందిగా ఉంటుంది. దీంతో.. ఆ తుమ్ము బయటకు వచ్చేలోగా వాళ్లే ఆపేసుకుంటారు.
తుమ్ములు మన ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉంటాయి. చాలా సార్లు.. మన ముక్కు లోపలికి దుమ్ము, దూళి లాంటివి వెళ్లినప్పుడు.. తుమ్ములు వస్తూ ఉంటాయి. లేదంటే.. జలుబు చేసినప్పుడు కూడా తుమ్ముతాం. ఇది సహజ ప్రక్రియ. కానీ.... తుమ్ములు ఆఫడం మాత్రం అస్సలు మంచిది కాదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుమ్ము ఆపడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో ఓసారి చూద్దాం..
sneezing man
తుమ్ములను ఆపుకోవడం అంత మంచి పద్దతి కాదు. దాని వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.ఎందుకు అంటే.. మన ముక్కులో మ్యూకస్ అనే ఒక పొర ఉంటుంది. ఏదైనా దుమ్ము, దూళి కణాలు ఆ పొరకు అంటుకున్నప్పుడు.. దానిని తొలగించడానికి తుమ్ముతుంటాం. మనం తుమ్ము ఆపితే.. ఆ దూళి కణం బయటకు రాదు. దాని వల్ల ఇబ్బంది పడతాం.
అంతేకాదు.. ఆయుర్వేదం ప్రకారం.. తుమ్మడాన్ని శ్వతు అంటారు. దీనిని తిరుగులేని శక్తిగా భావిస్తారు. అంటే.. తుమ్ముని ఆపలేని శక్తిగా పేర్కొంటారు. దానిని ఆపకూడదు కూడా అని దాని అర్థం. మనం తుమ్మడం ద్వారా.. ముక్కు నుంచి బ్యాక్టీరియా, వైరస్ బయటకు వచ్చేస్తాయి. అందువల్ల, ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. తుమ్మును ఆపడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల మెడ బిగుసుకుపోవడంతోపాటు సైనస్ సమస్యలు కూడా రావచ్చు.
sneezing
మీరు తుమ్ము వచ్చినప్పుడు ఆపడానికి ప్రయత్నిస్తే, అది ముఖం , నరాలు , కండరాలను బలహీనపరుస్తుంది. ఇది శరీరాన్ని శుభ్రపరిచే సహజ ప్రక్రియ. కాబట్టి, దానిని వెనక్కి తీసుకోకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సామాజిక మర్యాద లేదా ఇతర కారణాల వల్ల చాలా సార్లు ప్రజలు తమ తుమ్ములను అణిచివేస్తారు. కానీ, తుమ్మును అణచివేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడి పడుతుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది.
తుమ్ము ద్వారా బయటకు వచ్చే గాలి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆపడం వల్ల కళ్లు, ముక్కు, చెవుల రక్తనాళాలపై ప్రభావం పడుతుంది. అందుకే... తుమ్ము వచ్చినప్పడు ఆపకుండా.. దానిని ఫ్రీగా తుమ్మేయండి.