దోమలు కొంతమందినే ఎందుకు ఎక్కువగా కుడతాయో తెలుసా?

First Published | Jun 25, 2024, 11:02 AM IST

వానాకాలంలో ఈగలు, దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో దోమలు పొద్దంతా కుడుతూనే ఉంటాయి. అయితే దోమలు కొంతమందినే టార్గెట్ చేసినట్టు వారినే కుడుతుంటాయి. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

రక్తం రకం

దోమలు ఎక్కువగా కుట్టడానికి రక్తం రకం కూడా ఒక కారణమే. అవును దోమలు గుడ్లు ఉత్పత్తి చేయడానికి సరైన రక్తం అవసరం. ముఖ్యంగా ‘ఓ ’రక్తానికే దోమలు ఎక్కువగా  ప్రాధాన్యత ఇస్తాయి. అందుకే దోమలు ఇతర రక్త రకాల కంటే టైప్ ‘ఓ’ ఉన్నవారిని ఎక్కువగా కుట్టతాయి.
 

చెమట వాసన

చెమట వాసన ఎక్కువగా వచ్చే వారిని కూడా బాగా కుడతాయి దోమలు. అవును శరీరం నుంచి వచ్చే చెమట వాసన వల్ల  విడుదలయ్యే లాక్టిక్ యాసిడ్, అమ్మోనియా దోమలను ఆకర్షిస్తాయి. అందుకే ఇలాంటి వారి దగ్గరకు దోమలు ఎక్కువగా వస్తాయి.
 

Latest Videos


Mosquitoes

శరీర వేడి

శరీర వేడి కూడా దోమలు ఎక్కువగా కుట్టడానికి కారణమవుతుంది. బాగా కష్టపడి పనిచేసే వారి శరీరం ఎక్కువ వేడిని ఉత్పత్తిని చేస్తుంది. ఇది దోమలను బాగా ఆకర్షిస్తుంది. అందుకే బాగా కష్టపడి పనిచేసేవారి దగ్గరకు కూడా దోమలు ఎక్కువగా వెళతాయి. 

బొగ్గుపులుసు వాయువు

దోమలు 50 మీటర్ల దూరం నుంచి కూడా కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించగలవు. అందుకే దోమలు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేసే వారిని బాగా కుడతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పెద్దలు కార్బన్ డయాక్సైడ్ ను ఎక్కువగా విడుదల చేస్తారు. 

mosquitoes

దుస్తుల రంగు

దుస్తుల రంగు కూడా దోములు కుట్టేలా చేస్తాయి. అవును ఎరుపు రంగు, నీలం రంగు, నలుపు వంటి ముదురు రంగు దుస్తులకు దోమలు బాగా ఆకర్షితమవుతాయి. ఈ రంగుల దుస్తులు ధరించడం వల్ల మిమ్మల్ని బాగా కుడతాయి. 

ఆల్కహాల్ వినియోగం

మందు కూడా దోమలు ఎక్కువగా కుట్టడానికి కారణమవుతుంది. ఎందుకంటే ఆల్కహాల్ తాగిన తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరిగి బాగా చెమటలు పడతాయి. ఈ రెండు కారణాలు దోమలు మిమ్మల్ని బాగా కుడతాయి. 
 

click me!