మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర ఎందుకొస్తుంది?

First Published Jun 11, 2024, 2:53 PM IST

ఆఫీసుల్లో పనిచేసేవారికైనా, ఇంట్లో ఉండే వారికైనా కొంతమందికి మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్రముంచుకొస్తుంది. కొద్దిసేపైనా పడుకోవాలనిపిస్తుంది. అసలు మధ్యాహ్నం తిన్న వెంటనే ఎందుకు నిద్ర వస్తుందో  ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత చాలా మంది కొద్దిసేపైనా నిద్రపోతుంటారు. ఈ సమయంలో నిద్రను ఆపడం కష్టమే అన్న సంగతి చాలా మందికి తెలుసు. అయితే మధ్యాహ్న సమయంలో అంత నిద్ర ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? మధ్యాహ్నం ఎందుకు నిద్రపోతామో ఈ ఆర్టికల్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

sleep

పెరిగిన గ్లూకోజ్ స్థాయి

మధ్యాహ్న భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. ఈ బ్లడ్ లెవెల్స్ తిరిగి సాధారణ స్థితికి వచ్చేసరికి మెదడు, కండరాల్లో కొద్దిగా శక్తి లోపిస్తుంది. దీనివల్ల మధ్యాహ్నం పూట నిద్ర రావడం మొదలవుతుంది.

అధిక చక్కెర ఆహారం

మధ్యాహ్నం పూట నిద్రరావడానికి కొన్ని రకాల ఆహారాలు కూడా కారణమే. ముఖ్యంగా అన్నం,  పాస్తా, రొట్టె లేదా ఇతర అధిక గ్లూకోజ్ ఆహారాలు. అవును వీటిని మధ్యాహ్నం పూట తింటే నిద్రవస్తుంది. ఎందుకంటే ఈ ఆహారాలు  రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి. ఇది శక్తిని తగ్గిస్తుంది. అలాగే నిద్రకు దారితీస్తుంది.
 

రక్త ప్రసరణ మందగిస్తుంది

హెవీగా తినడం వల్ల దానిని జీర్ణం చేయడానికి ఎక్కువ శక్తి అవసరపడుతుంది. అలాగే ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణవ్యవస్థకు ఎక్కువ రక్తం అవసరమవుతుంది. దీనివల్ల రక్తం నెమ్మదిగా మెదడుకు చేరుతుంది. దీనివల్ల మనకు నిద్రమబ్బు చుట్టుకుంటుంది. 

హార్మోన్లే కారణం

కొన్నిసార్లు ఆహారం తిన్న తర్వాత సెరోటోనిన్ వేగంగా ఉత్పత్తి అవుతుంది. ఇది మనలో బద్ధకాన్ని పెంచుతుంది. అలాగే నిద్రవస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనివల్లే చాలా మంది మధ్యాహ్నం పూట నిద్రపోతుంటారు. 

ఆయిలీ, మసాలా దినుసులు 

మధ్యాహ్నం పూట అతిగా ఆహారం తింటే పొట్ట దాన్ని జీర్ణం చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇది శరీరాన్ని మందకొడిగా మారుస్తుంది. దీనివల్ల మధ్యాహ్నం పూట నిద్ర వస్తుంది. 
 


నిర్జలీకరణం

రోజంతా నీరు సరిగా తాగకపోతే మన శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీనివల్ల మీ శరీరంలో ఉండాల్సినంత నీరు ఉండదు. ఇది మధ్యాహ్నం తర్వాత మీకు బలహీనంగా, అలసటను కలిగిస్తుంది.

అతిగా తినడం 

చాలా మంది మధ్యాహ్నం పూట ఎక్కువగా తింటుంటారు. అయితే అతిగా తినడం వల్ల శరీరం మందకొడిగా, నిద్రలోకి జారుకుంటుంది.

Latest Videos

click me!