పొట్ట కుండలా బయటకు ఎందుకు వస్తుందో తెలుసా?

First Published | Nov 4, 2024, 9:58 AM IST

ఈ రోజుల్లో చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు. కానీ ఈ బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది. ఏం తింటే వస్తుందో చాలా మందికి తెలియదు. అసలు ఇది తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

ఈ రోజుల్లో ఓవర్ వెయిట్ ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్. రోజు రోజుకు పెరుగుతున్న పెట్టను చూసి కంగారు పడేవారు చాలా మందే ఉన్నారు. కానీ కొంతమంది లైట్ తీసుకుంటారు. ఇంకొందరు ఈ పొట్టను తగ్గించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. 

belly fat

ఏదేమైనా పొట్ట సైజు పెరగడం మంచి విషయమైతే కాదు. దీనివల్ల నడుము చుట్టూ ఫ్యాట్ విపరీతంగా పెరగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

అయితే బెల్లీ ఫ్యాట్ వల్ల కొంతమంది కడుపు కుండ ఆకారంలో కనిపిస్తే మరికొందరి కడుపు కిందికి వేలాడుతూ ఉంటుంది. దీనివల్ల మీ శరీరం షేప్ లెస్ గా కనిపిస్తుంది. అసలు పొట్ట కుండలా ఎందుకు కనిపిస్తుంది? దీనికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


belly fat


పొట్ట కుండలా ఎందుకు బయటకు వస్తుంది?

పొట్ట కుండలా కనిపించడానికి రెండు కారణాలు ఉంటాయని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకటి ఇన్సులిన్ నిరోధకత, రెండు కడుపు ఉబ్బరం. ఈ ఇన్సులిన్ నిరోధకత వల్ల శరీర కణాలు ఇన్సులిన్ కు సున్నితత్వాన్ని కోల్పోతారు. అంటే దీనివల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. అలాగే ఇది మీరు విపరీతంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. 

ముఖ్యంగా కడుపు చుట్టూ కొవ్వు బాగా పేరుకుపోయి పొట్ట పెరిగిపోతుంది. ఇకపోతే కడుపు ఉబ్బరం ఒక సాధారణ సమస్య. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మలబద్దకం, గ్యాస్, అతిగా తినడం వల్ల కడుపులో గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. ఇది మీ కడుపు పరిమాణాన్ని బాగా పెంచుతుంది. దీనివల్ల మీకు సౌకర్యంగా అనిపిస్తుంది.
 

belly fat

ఇన్సులిన్ రెసిస్టెన్స్ కోసం ఈ టీ తాగండి

ఇన్సులిన్ నిరోధకతను నియంత్రించడానికి చాలా చిట్కాలు ఉన్నాయి. వీటిలో దాల్చిన చెక్క టీ ఉంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మీరు దాల్చిన చెక్క టీని తాగొచ్చు. ఈ టీని తాగితే మీ మెటబాలిజం పెరుగుతుంది.

ఈ టీని తయారుచేయడానికి ఒక కప్పు నీళ్లలో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి కలపండి. లేదా దాల్చిన చెక్క ముక్కను వేసి కలపండి. దీన్ని 5 నిమిషాల పాటు అలాగే మరగనిచ్చి ఆ తర్వాత వడకట్టి తాగండి. 

కడుపు ఉబ్బరం కోసం ఈ టీని తాగండి

కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవడానికి మీరు సెలెరీ టీని కూడా తాగొచ్చు. ఇది ఈ సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక కప్పు నీళ్లలో ఒక టీస్పూన్ సెలెరీని వేయండి. దీన్ని 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి.

ఆ తర్వాత చల్లార్చి వడకకట్టి తాగండి. ఇది ఉదర సంబంధిత సమస్యలను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ టీని తాగితే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. 

click me!