నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూస్తే మీ బ్రెయిన్ ఏమవుతుందో తెలుసా?

First Published Oct 13, 2024, 8:23 PM IST

మీరు ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? బ్రష్ చేయకుండా, కనీసం వాష్ రూమ్ కి కూడా వెళ్లకుండా ఫోన్ చూస్తున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నారు. ప్రతి రోజు నిద్ర లేవగానే ఫోన్ చూడటం వల్ల బ్రెయిన్ కు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇప్పటికిప్పుడు ఎటువంటి ఎఫెక్ట్ కనిపించకపోవచ్చు కాని భవిష్యత్తులో మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. మరి ఇలాంటి సమస్యలు రాకుండా ఫోన్ ఉపయోగించడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

మనలో 90 శాతం మంది చేసే పని ఏంటంటే పొద్దున్నే లేవగానే మొబైల్ చూడటం. టైమ్ ఎంత అయిందో చూద్దామని ఫోన్ తీసుకుంటాం. ఓహ్.. 6 అయ్యింది అంతే కదా.. ఇంకో అరగంట పడుకుందాంలే అనుకుంటాం. కాని నిద్రపోకుండా ఫోన్ లో వచ్చిన నోటిఫికేషన్స్ ఓపెన్ చేస్తాం.  అంతే ఇక ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఓపెన్ చేస్తూ పోతాం. ఇది అర గంట కాస్తా గంట, గంటన్నర ఇలా టైమ్ అయిపోతున్నా మొబైల్ పక్కన పెట్టలేం. ఇక ఇంట్లో వాళ్లు తిట్లు మొదలు పెట్టిన తర్వాత కాని మొబైల్ పక్కన పెట్టలేని పరిస్థితి. ఇది చాలా మంది ఇళ్లలో రోజూ జరిగే వ్యవహారమే. 
 

నిద్ర లేవగానే ఫోన్ ఎందుకు చూడకూడదంటే.. అప్పటి వరకు రిలాక్స్ మోడ్ లో ఉన్న బ్రెయిన్ వెంటనే యాక్టివేట్ కాదు. అలా ఉన్న బ్రెయిన్ కి ఒక్కసారిగా హెవీ రెసెల్యూషన్ ఉన్న ఫోన్ కాంతిని చూపించడం వల్ల బ్రెయిన్ చాలా డిస్టర్బ్ అవుతుంది. అంతేకాకుండా ఒత్తిడికి గురి చేసే విధంగా మెసేజ్ లు, వీడియోలు చూడటం వల్ల బ్రెయిన్ చాలా స్ట్రెస్ కి గురవుతుంది. దీంతో ఆ రోజు మొత్తం చేయాలనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగవు. దీంతో మీరు మరింత ఒత్తిడికి గురవుతారు. ఇవి మానసిక సమస్యలుగా మారి మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. జాబ్ చేయాలన్నా స్ట్రెస్ ఫీలవడం, బిజినెస్ లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఇలా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. అనుకున్న పనులు సక్రమంగా జరగకపోవడంతో మీ లైఫ్ డిస్ట్రబ్ అయిపోతుంది. 
 

Latest Videos


డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం మనిషి ఉదయం నిద్ర లేవగానే అతని మెదడు డెల్టా స్టేట్ లో ఉంటుంది. అంటే చాలా ప్రశాంతంగా, ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఉంటుంది. ఆ సమయంలో మెదడును ఒత్తిడి చేసే పనులు ఏమీ చేయకుండా ఉంటే నెమ్మదిగా ఆల్ఫా, బీటా స్టేట్ లోకి వెళుతుంది. అంటే డైలీ చేసే పనులు, భవిష్యత్తు నిర్ణయాలు, బాధ్యతలు, అప్పులు, ఫీజులు, జీతాలు ఇలా నెమ్మదిగా ఆలోచించడం మొదలు పెడుతుంది. 
 

అయితే మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే మొబైల్ వాడటం వల్ల బ్రెయిన్ డెల్టా స్టేట్ నుంచి ఆల్ఫా స్టేట్ లోకి వెళ్లకుండా డైరెక్ట్ గా బీటా స్టేట్ లోకి వెళుతుంది.  దీని వల్ల బ్రెయిన్ కి అనవసరమైన స్ట్రెస్ పెరిగిపోతుంది. దీంతో రోజు మొత్తం చిరాకు, ఇరిటేషన్ పెరిగిపోతాయి. ప్రతి పనిలోనూ అత్యుత్సాహం ఎక్కువైపోతుంది. దీంతో ఏ పని సక్రమంగా పూర్తి కాదు. పనులన్నీ ఫెయిల్ అయిపోతుండటంతో చిరాకు పెరిగిపోతుంది. దీంతో మన చుట్టూ ఉన్న వాళ్ల మీద కోపం చూపిస్తాం. గొడవలు పెరిగిపోతాయి. 
 

రోజూ ఉదయం బెడ్ దిగకుండా ఫోన్ చూడటం వల్ల నరాల సమస్యలకు దారి తీస్తుంది. వెంటనే మీ శరీరంలో మార్పులు కనిపించకపోవచ్చు కాని ప్రతి రోజూ ఫోన్ చూడటం వల్ల కొన్నాళ్లకు మీరు బలహీనంగా మారిపోతారు. ఏ పని సక్రమంగా చేయలేరు. మనసులో బలంగా పనిచేయాలని ఉన్నా శరీరం సహకరించకపోవడంతో మీలో  అసహనం పెరిగిపోతుంది. మీపై మీకే కోపం, చిరాకు పెరిగిపోతాయి. జీవితం మీద విరక్తి కలిగే ఆలోచనలకు దారి తీస్తుంది. దీంతో మీరు మీకు తెలియకుండానే మానసిక సమస్యలకు గురవుతారు. 
 

అందువల్ల ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే వెంటనే మొబైల్ ఓపెన్ చేసి నోటిఫికేషన్స్ చెక్ చేయడం, వీడియోలు, సినిమాలు చూడటం చేయకూడదు. కనీసం 30 నిమిషాల నుంచి గంట సేపయినా మొబైల్ ముట్టుకోకుండా ఇతర పనులపై ధ్యాస పెట్టాలి. అంటే మెడిటేషన్ చేయడం, యోగా ప్రాక్టీస్ చేయడం చేయాలి. అసలు ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసి వాకింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేచిన వెంటనే చేసే పనులు మన జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఉదయం లేచిన వెంటనే దైవారాధన చేయాలని పెద్దలు చెబుతారు. దైవారాధన చేయాలంటే ఆటోమెటిక్ గా బ్రష్ చేసి, స్నానం చేస్తాం. అందువల్ల ఆరోగ్య సమస్యలు కూడా రావు. 
 

click me!