లగ్గం ముహూర్తాలే లేని ఆషాడ మాసంలో అనంత్ అంబానీ పెళ్లి.. ఎందుకు చేశారంటే?

First Published | Jul 14, 2024, 11:07 AM IST

ఆషాడ మాసంలో పెళ్లిళ్లే కాదు ఇంట్లో ఇంట్లో శుభకార్యాలు కూడా చేయరు. ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం.. ఇలాంటి ఆషాడ మాసంలో కోట్లు ఖర్చు పెట్టి మరీ అంగరంగ వైభవంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల పెళ్లి జరిగింది. అసలు ఈ మాసంలో వీళ్లు ఎందుకు పెళ్లి చేశారో తెలుసా?

మూఢాలు వచ్చేస్తున్నాయి.. ఇక శుభకార్యాలన్నీ బంధ్ అంటుంటారు పెద్దలు. నిజానికి ఏ ఒక్కరూ మూఢాలల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. ఆషాడ మాసంలో కూడా మూఢం వస్తుంది. అందుకే ఆషాడంలో పెళ్లిళ్లు, పేరంటాల జోలికి అస్సలు వెళ్లరు. 
 

కానీ మన దేశ కుబేరుడైన ముఖేష్ అంబానీ మాత్రం తన చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి అంబురాన్ని అంటేలా చేశాడు. ఇదే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. లగ్గాలే లేని ఈ ఆషాడ మాసంలో అనంత్ అంబానీ పెళ్లి ఎందుకు చేసినట్టో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

Latest Videos



కోటీశ్వరుడైన ముఖేష్ అంబానీ.. తన చిన్న కొడుకు పెళ్లి ఈ నెల 12 న ఎంతో ఘనంగా చేశాడు. ముంబైలోని బాంద్రా కుర్ల కాంప్లెక్స్ లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం జరిగింది. వీరి వివాహానికి ముఖేష్ అంబానీ సుమారుగా రూ. 5000 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. వీరి పెళ్లికి ఇంత ఖర్చు అయితే.. వీరి ఎంగేజ్మెంట్, ఫ్రీ వెడ్డింగ్ కు కూడా కోట్లు ఖర్చైనట్టు సమాచారం. ఇక ఈ పెళ్లి తంతుకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అతిథులకు కూడా ఎక్కడా ఏ లోటూ రానీయలేదు. 


ఇక అసలు విషయానికొస్తే.. ఎలాంటి పెళ్లి ముహూర్తాలే లేని ఆషాడ మాసంలో.. వీరి పెళ్లిని ఎలా జరిపించారు అనే డౌట్ చాలా మందికి వచ్చింది. అయితే మనది చాంద్రమాన పంచాంగం. ఈ మాసాన్ని తెలుగు వారు ఎక్కువగా అనుసరిస్తారు. కానీ ఉత్తరాధి వారు మాత్రం సూర్యమాన పంచాంగాన్నే ఎక్కువగా అనుసరిస్తారు. సూర్యుని కదలికల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. దీనిలో అధిక మాసం ఉండదు. అందుకే ముహూర్తాలు, తిథులు, ఆచరణలో తేడాలు ఉంటాయి. ద్రుక్ గణితం ఆధారంగా పండితులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహా ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది. 
 
 

click me!