మన దేశంలో మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏదో తెలుసా?

First Published | Aug 15, 2024, 10:07 AM IST

ఈ స్కూల్లో అడ్మిషన్ దొరకాలని ప్రతి సంవత్సరం చాలా మంది స్టూడెంట్స్ ప్రయత్నిస్తూనే ఉంటారు. మరి, ఈ స్కూల్ స్పెషాలిటీ ఏంటో చూద్దాం...

school

మన దేశంలో స్కూల్లకు కొదవేలేదు. ప్రతి సంధుకీ ఒక స్కూల్ ఉంటోంది. ఇక.. ఉన్న స్కూల్స్ అన్నీ  ఇంగ్లీష్ మీడియం స్కూల్సే. ఒకప్పుడు.. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటే.. ఎక్కడో ఒక్కచోట ఉండేది. మిగిలినవన్నీ రీజనల్ లాంగ్వేజ్ ల్లోనే ఉండేవి. కానీ  ఇప్పుడు మన దేశంలో విద్య మంచి వ్యాపారంగా మారింది. దీనిలో వచ్చిన లాభం మెరక్కడా రావడం లేదని చాలా మంది భావిస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే... అసలు మన దేశంలో పురాతన ప్రైవేట్ స్కూల్ ఎక్కడుందో తెలుసా..? అది కూడా మన దేశంలో మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ బ్యాగ్రౌండ్ ఏంటి..? అక్కడ ఎవరు చదువుకున్నారు అనే విషయాలు చూద్దాం...
 

భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ స్కూల్  చెన్నైలో ఉంది. ఇదే తొలి ఇంగ్లీష్ మీడియం కావడం విశేషం. ఈ స్కూల్ పేరు సెయింట్ జార్జ్. ఆంగ్లో-ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్. ఈ పాఠశాల ఇది.  1715 సంవత్సరంలో స్థాపించారు. దీని ప్రకారం, ఈ పాఠశాల సుమారు 304 సంవత్సరాల క్రితం స్థాపించడం విశేషం. ఈ స్కూల్ కి ఉన్న . విశేషమేమిటంటే, ఈ పాఠశాల ఇప్పటికీ చెన్నైలో ఉంది. ఈ స్కూల్లో అడ్మిషన్ దొరకాలని ప్రతి సంవత్సరం చాలా మంది స్టూడెంట్స్ ప్రయత్నిస్తూనే ఉంటారు. మరి, ఈ స్కూల్ స్పెషాలిటీ ఏంటో చూద్దాం...
 

Latest Videos


ఈ స్కూల్ ఎందుకు పెట్టారో తెలుసా?

బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు, చాలా మంది బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో, ఈస్ట్ ఇండియా కంపెనీ తన ఉద్యోగుల పిల్లల కోసం చెన్నై లో ఇంగ్లీష్ మీడియం స్కూల్  ప్రారంభించింది. అప్పట్లో ఈ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే సాగింది.

1715 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీచే స్థాపించిన ఈ పాఠశాల కేవలం బ్రిటీష్ వారి కోసం మాత్రమే. విచిత్రం ఏమిటంటే భారతీయ పిల్లలను ఇక్కడ చేర్చుకోలేదు. అప్పట్లో ఇక్కడ బ్రిటీష్ వారి పిల్లలు మాత్రమే చదువుకునేవారు, వారికి మాత్రమే ప్రవేశం కల్పించేవారు. ఇది కాకుండా, భారతీయ మహిళను వివాహం చేసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగుల పిల్లలకు కూడా ప్రవేశం కల్పించారు.

పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి?
సెయింట్ జార్జ్ ఆంగ్లో-ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్ చెన్నైలోని షెనాయ్ నగర్‌లో ఉంది. ఈ పాఠశాల చాలా పెద్ద క్యాంపస్‌లో విస్తరించి ఉంది. ఈ పాఠశాల భవనం ఎర్ర ఇటుకలతో నిర్మించారు.. ఈ పాఠశాల నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యను అందిస్తుంది. అందమైన భవనంతో పాటు, ఈ పాఠశాలలో వసతి గృహాలు, పెద్ద ప్లే గ్రౌండ్, చదువుకోవడానికి లైబ్రరీ కూడా ఉన్నాయి. ఈ పాఠశాలలో అడ్మిషన్ దొరకడం అంత ఈజీ కాదు. చాలా ఫిల్టర్ చేసి మరీ తీసుకుంటారు.

చెన్నైలోని సెయింట్ జార్జ్ ఆంగ్లో-ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఇక్కడ అత్యుత్తమ పాఠశాలగా భావిస్తారు. ఇతర పాఠశాలలతో పోలిస్తే దీని ఫీజులు కూడా చాలా తక్కువ. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశంలో, ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు గడిస్తున్నారు. ఈ పాఠశాల దాని స్వంత హాకీ జట్టును కలిగి ఉంది, దీని క్రీడాకారులు జాతీయ జట్లలో ఉన్నారు. అంతే కాకుండా 18వ శతాబ్దానికి చెందిన పుస్తకాలు ఇప్పటికీ ఇక్కడి లైబ్రరీలో ఉన్నాయి.

click me!