తనకున్న సమస్య గురించి ఓపెన్ గా చెప్పిన శ్రుతిహాసన్.. దీనివల్ల స్కూల్ డేస్ నుంచి ఎంత బాధపడుతుందో?

First Published | Jun 7, 2024, 11:59 AM IST

తెరపై కనిపించే జీవితాలకు నటీ, నటుల నిజ జీవితాలకు చాలా తేడా ఉంటుంది. ఎన్ని సమస్యలున్నా మనల్ని ఎంటర్  టైన్ చేస్తుంటారు. కానీ వారికున్న సమస్యల గురించి మాత్రం పెద్దగా చెప్పుకోరు. కానీ హీరోయిన్ శ్రుతి మాత్రం తన బాధపడుతున్న సమస్య గురించి చాలా ఓపెన్ గా చెప్పేసింది. దీనివల్ల ఈ బ్యూటీ ఎంత బాధపడిందో తెలుసా? 
 

ఒకప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో చాలా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది శ్రుతి హాసన్. ఒకప్పుడు ఈ హీరోయిన్ గ్యాప్ లేకుండా సినిమాలు చేసింది. కానీ కొత్త హీరోయిన్ల రాకతో ఈ అమ్మడుకి అవకాశాలు కాస్త తగ్గాయి. అయినా వచ్చిన అవకాశాలను కాదనకుండా సినిమాలు చూస్తూనే ఉంది. అసలు శ్రుతి హాసన్ ను చూస్తే ఏదైనా సమస్య ఉన్నట్టు అనిపించిందా? అస్సలు లేదు అంటారు. ఎందుకంటే ఈ హీరోయిన్ అలా ఉంటుంది మరి. కానీ శ్రుతి హాసన్ ఓ సమస్యతో ఎన్నో ఏండ్లుగా బాధపడుతోంది. 
 

Shruti Haasan Photos

శ్రుతి హాసన్ పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్) వల్ల కలిగే ఇబ్బందుల గురించి మాట్లాడారు. ఈ సమస్యతోనే ఈ హీరోయిన్ బాధపడుతోందట. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేది హార్మోన్ల వ్యాధి. ఇది మహిళల రుతుచక్రానికి ఆటంకం కలిగిస్తుంది. పీసీఓఎస్ వల్ల అండాశయాల్లో తిత్తులు ఏర్పడతాయి. అలాగే నెలసరి సక్రమంగా రాదు. మొత్తమే పీరియడ్స్ రాకపోవడం, ముఖ వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య వల్ల మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో గర్భం దాల్చడంలో ఇబ్బంది ఒకటి. వీటిలో మగ హార్మోన్ ఆండ్రోజెన్ కూడా ఎక్కువగా ఉంటుంది.
 

Latest Videos


ఒదొక బాధాకరమైన సమస్య అని శ్రుతి హాసన్ చెప్పింది. స్కూల్ డేస్ నుంచి ఈ సమస్యను ఎదుర్కొంటున్నానని శ్రుతి హాసన్ తెలిపింది. కానీ 26 ఏండ్ల వయసులోనే శ్రుతికి పీసీఓఎస్ ఉందని తెలిసిందట. ఆ సమయంలో ఎండోమెట్రియోసిస్, డిస్మెనోరియా వంటి ఆరోగ్య సమస్యలతో కూడా ఆమె బాధపడిందట. చికిత్స తీసుకుంటునప్పుడు స్కానింగ్ లో పీసీఓఎస్ ను గుర్తించినట్టు శ్రుతి హాసన్ తెలిపారు.
 

Shruti Haasan

పీసీఓఎస్ లో భాగంగా జుట్టు విపరీతంగా పెరగడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తాయి. బరువు మరీ ఎక్కువైంది. అందుకే నా వర్కవుట్ అలవాట్లు, డైట్ మార్చుకున్నాను' అని శ్రుతి హాసన్ చెప్పింది. ఆహారం నుంచి ఆల్కహాల్, కెఫిన్ నివారించడం వల్ల ఈ సమస్య కాస్త తగ్గిందని హీరోయిన్ చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ గత ఏడేండ్లుగా పీసీఓఎస్ కు మాత్రమే చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. 
 

Shruti Haasan


శ్రుతిహాసన్ కు ఈ సమస్య వల్ల మొదటి పీరియడ్స్ నుంచి ప్రతి పీరియడ్స్ బాధాకరంగా ఉంటుందట. మీకు తెలుసా? ఈ సమస్య వల్ల కడుపు నొప్పి, డీహైడ్రేషన్ సమస్యల వల్ల స్కూల్ లో కుప్పకూలేవారట. ఇకపోతే  పీరియడ్స్ వచ్చిన మొదటి రెండు రోజులు ఈమె షూటింగ్ లో పాల్గొనరట. షూటింగ్ టైంలో రుతుస్రావ విరామం అవసరమని చాలా మందికి ఈ టైంలో డేట్స్ ఇవ్వదట. పీసీఓఎస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలు చాలా మంది ఉన్నారని ఈమె అన్నారు. 

click me!