ఈ రాశుల వారు పడక గదిలో రెచ్చిపోతారట

First Published | Aug 27, 2019, 12:17 PM IST

శృంగార జీవితాన్ని రాశులను ప్రభావితం చేస్తాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. కొందరు తమ శృంగార జీవితం గురించి ఎక్కడైనా మాట్లాడగలరు. కొందరు అసలు మాట్లాడాటానికి కూడా ఇష్టపడరు. అది కూడా రాశుల ప్రభావమే అంటున్నారు నిపుణులు. 

మన జీవితంలో జరిగే సంఘటనలను జ్యోతిష్యులు ముందుగా ఊహించి చెబుతుంటారు. వాటిని మన రాశులను ఆధారంగా చేసుకొని చెబుతారు. వాటిని కొందరు నమ్ముతారు. కొందరు నమ్మరు. నమ్మనివారి సంగతి పక్కన పెడితే... శృంగార జీవితాన్ని రాశులను ప్రభావితం చేస్తాయని కొందరు నిపుణులు చెబుతున్నారు.
కొందరు తమ శృంగార జీవితం గురించి ఎక్కడైనా మాట్లాడగలరు. కొందరు అసలు మాట్లాడాటానికి కూడా ఇష్టపడరు. అది కూడా రాశుల ప్రభావమే అంటున్నారు నిపుణులు. వారు చెబుతున్న దాని ప్రకారం... కొన్ని రాశుల వారు పడకగదిలో రెచ్చిపోతారట. వారికి శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండటమే కాకుండా... జీవిత భాగస్వామిని ఎక్కువగా ఆనందపరుస్తారట. ఆ రాశులేంటో మనం ఇప్పుడు చూద్దాం..

మేషం..ఈ రాశి వారు మిగిలిన వారికంటే కాస్త భిన్నంగా ఉంటారు. ఇతరులను తమవైపు ఆకర్షించడం, వారిలో మోహావేశాన్ని పెంచడంలోనూ ఈ రాశి వారికి మంచి ప్రావీణ్యం ఉంటుంది. బెడ్రూంలో తమ భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించడం ఈ రాశివారికి ఇష్టం. వీరిలాంటి మనస్తత్వం ఇంకే రాశుల వారికి ఉండదు. బెడ్రూంలో వీరికి మూడ్ రావాలే.. కానీ ఎంత ఆనందాన్ని పొందగలరో వీరి భాగస్వాములు అస్సలు వూహించలేరు.
పెళ్లయిన కొత్తల్లో ఎక్కువగా ఉండే వీరి ఫీలింగ్స్ రోజుల గడుస్తున్న కొద్దీ పెరుగుతాయే తప్ప తగ్గవు. సెక్స్ విషయంలోనే కాదు.. భాగస్వామితో సాధారణ సందర్భాల్లోనూ చాలా జోవియల్‌గా వ్యవహరిస్తారు ఈ రాశివారు. అయితే ఈ రొమాంటిక్ కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల.. చాలాసార్లు భాగస్వామితో కలయిక తర్వాత వీరు అసంతృప్తికి లోనయ్యే అవకాశాలుంటాయి.
వృషభం ఈ రాశి వారు రొమాన్స్ పట్ల చాలా ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. వీరి ప్రవర్తనను బట్టి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రెండర్థాలు వచ్చేలా మాటలు మాట్లాడడం వీరి ప్రత్యేకత. తమ భాగస్వామి వీరిని ముట్టుకుంటే చాలు.. వీరికి మూడ్ వచ్చేస్తుంది. వీరికి ఒక వ్యక్తిపై ప్రేమ పుట్టడం కాస్త కష్టం. కానీ ఒకసారి ఎవరిపైనైనా ప్రేమ పుట్టిందంటే అవతలివారిని చాలా బాగా చూసుకుంటారు. వీరికి సెక్స్ కంటే ఫోర్ ప్లే అంటే ఎక్కువ ఇష్టం.
అందుకే ఈ రాశి వారు మంచి సెక్స్ పార్టనర్ అని అందరూ భావించేలా చేస్తారు. తమ భాగస్వామికి మూడ్ తెప్పించడంలో వీరిని మించిన వారు మరెవరూ లేరు. కేవలం మూడ్ తెప్పించడం మాత్రమే కాదు.. పూర్తిగా సంతృప్తి చెందేలా చేయగలరు కూడా.
కర్కాటక రాశి.. ఈ రాశి వాళ్లు రొమాన్స్ పట్ల ఆసక్తి ఎక్కువగానే చూపిస్తారు. కానీ వీరికి సంబంధించి సెక్స్ అన్నది కేవలం లైంగిక చర్యకు మాత్రమే పరిమితం కాదు. అది ఫీలింగ్స్‌కి సంబంధించినదని వీరి భావన. ఈ రాశి వారు చాలా సున్నితమనస్కులై ఉంటారు. అందుకే వీరు సెక్స్ లేదా రొమాన్స్‌లోని ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతారు. ఈ రాశివారు తమ ఫీలింగ్స్ తమ భాగస్వామికి కనబడకుండా దాచిపెట్టుకుంటారు. అందుకే వీరు బయట కనిపించేది వేరు. బెడ్రూంలో వేరు అని చెప్పవచ్చు.
అయితే ఈ రాశి వారు తమ భాగస్వామి ఆనందం కంటే తమ ఆనందం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వీరికి ఛాతి భాగంలో ముట్టుకోవడం వల్ల మూడ్ ఎక్కువగా వస్తుంది. ఈ రాశి వారికి వూహల్లో జీవించడం ఎక్కువగా అలవాటు. అందుకే వీరు సెక్స్ సంబంధించి కూడా చాలా కలలే కంటుంటారు. వీరి విషయంలో ప్రేమ, సెక్స్ రెండూ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటుంది. అందుకే తాము ప్రేమించిన వ్యక్తితో చాలా తక్కువ సమయంలోనే వీరు లైంగికంగా కూడా దగ్గరవుతారు. అయితే పెళ్లయిన తర్వాతే వీరికి సెక్స్‌లో ఆనందం అనేది కలుగుతుంది.
సింహరాశి... ఈ రాశివారికి కూడా శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు కనిపించడానికి కూడా చాలా సెక్సీగా కనిపిస్తారు. బయట చూడటానికి సన్నిహితంగా కనిపించినా.. పడక గదిలో మాత్రం చాలా వైల్డ్ గా బిహేవ్ చేసే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి... ఈ రాశి వారిలో రొమాంటిక్స్ ఆలోచనలు కాస్త ఎక్కువగా ఉంటాయి. నిత్యం వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమ, శృంగారం రెండింటినీ ఒకేలా చూస్తూ... బ్యాలెన్స్ చేస్తారు. జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. ఎదుటివారిని కష్టపెట్టాలని అనుకోరు.

Latest Videos

click me!