ఆ కారణంగా శృంగారాన్ని ఆస్వాదించలేకపోతున్నారా? ఇలా ట్రై చేయండి..

First Published | Sep 23, 2021, 4:39 PM IST

చాలామంది శృంగారం సమయంలో నొప్పి కేవలం తమ ఒక్కరికి సంబంధించిన విషయంగానే పరిగణిస్తారు. దీంతో సమస్య మరింత పెద్దదవుతుంది. కానీ ఈ సమస్య ఇద్దరిదీ అని గుర్తించాలి. అప్పుడే పెయిన్ కి అసలు కారణం ఇద్దరూ కలిసి కనుక్కోవడం కుదురుతుంది. 

శృంగారం సమయంలో కాస్త నొప్పి, కొద్దిపాటి అసౌకర్యం మామూలు. శృంగారంలో ముందుకు వెడుతున్నా కొద్ది ఇది మాయమైపోతుంది. ఆ తర్వాత క్లైమాక్స్ తో రసానుభూతిని పొందుతారు. 

అయితే ఈ అసౌకర్యం, నొప్పి ఎక్కువగా కనక ఉంటే ఒక్కసారి డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు.. యురినరీ ట్రాక్ లో ఇన్ఫెక్షన్, వెజైనల్ ఇన్ఫెక్షన్ ఓవేరియన్ సిస్టులు, ఈస్ట్రోజెన్ లెవల్స్ తక్కువగా ఉండడం, కటిప్రాంతంలోని కండరాలు సున్నితంగా మారడం లాంటి కారణాలు ఉండొచ్చు. 


అయితే వీటికంటే ముందు కొన్ని రకాల పనులు చేయడం ద్వారా శృంగారంలో నొప్పిని తగ్గించుకోవచ్చు. అప్పటికీ మార్పు రాకపోతే డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. 

ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం.. చాలామంది సెక్స్ సమయంలో మాట్లాడుకోరు. కామ్ గా తమ పని తాము చేసుకుంటూ వెడతారు. అలా కాకుండా ఒకరితో ఒకరు మొహమాటం లేకుండా మనసు విప్పి మాట్లాడుకోండి. దీనిద్వారా శృంగారంలో నొప్పి ఉందన్న విషయం మీ భాగస్వామికి తెలుస్తుంది. 

చాలామంది వీటిని కేవలం తమ ఒక్కరికి సంబంధించిన విషయంగానే పరిగణిస్తారు. దీంతో సమస్య మరింత పెద్దదవుతుంది. కానీ ఈ సమస్య ఇద్దరిదీ అని గుర్తించాలి. అప్పుడే పెయిన్ కి అసలు కారణం ఇద్దరూ కలిసి కనుక్కోవడం కుదురుతుంది. 

శృంగారం సమయంలో వెజైనాలో ఫ్లూయిడ్స్ లేకపోతే కూడా నొప్పి వస్తుంది. దీనికోసం ల్యూబ్రికెంట్స్ వాడడం తప్పేం కాదు. శృంగారకోరికలు అతిగా ఉండేవారికి ఇది చక్కటి మార్గం. అయితే మంచి నాణ్యత కలిగిన ల్యూబ్రికెంట్ వాడడం వల్ల నొప్పిని, అసౌకర్యాన్ని తప్పించవచ్చు.

మార్కెట్లో రకరకాల ల్యూబ్రికెంట్స్ దొరుకుతున్నాయి. అయితే వీటన్నింటిలో వాటర్ బేస్డ్ ల్యూబ్రికెంట్స్ చాలా మంచివి. ఇవి వాడడం వల్ల రతి క్రీడలో మీకు గానీ, మీ పార్టనర్ కి గానీ ఎలాంటి ఇబ్బంది లేకపోతే వాడడం మంచిదే. 

పొజిషన్ మార్చండి : రెగ్యులర్ గా రతిక్రీడ చేసే పొజిషన్ లో మార్పు చేయడం వల్ల కూడా అసౌకర్యం, నొప్పి ని తగ్గించుకోవచ్చు. చాలామంది సెక్స్ లో రకరకాల భంగిమలు ట్రై చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. తమను అనువైన ఒకే భంగిమలో వెడుతుంటారు. 

ఇలాంటి వాటిల్లో కూడా అసౌకర్యంగా ఉంటే వేరే భంగిమను ప్రయత్నించడమే మంచిది. ఒక సైడుకు తిరిగి.. లేదా వెనకనుండి చేసే సెక్స్ భంగిమలో మీకు నొప్పిని తగ్గించడానికి పిల్లోస్ మీకు మంచి స్నేహితులుగా ఉంటాయని మరిచిపోవద్దు. 

నేరుగా శృంగారంలోకి దిగకుండా ఫోర్ ప్లేను ట్రై చేయండి. సెక్స్ కు ముందు ఫోర్ ప్లే వల్ల శరీరంలో ఉద్దీపనలు జరిగి హార్మోన్లు రిలీజవుతాయి. ఈ హార్లోన్లు మీకు అసౌకర్యాన్ని, నొప్పిని తగ్గిస్తాయి. 

ఫోర్ ప్లే మిమ్మల్ని శృంగారానికి సిద్ధం చేస్తుంది. మిమ్మల్నిఉద్రేకపరుస్తుంది. నాడీ, కండరాల్లో కదలిక తెచ్చి సెక్స్ కు అనువుగా మీ శరీరాన్ని మార్చేస్తుంది. 

ఇవన్నీ చేసినా కూడా మీ అసౌకర్యంలో, నొప్పిలో మార్పు రాకపోతే డాక్టర్ని సంప్రదించడంలో మొహమాట పడొద్దు. ఎంతగా మీరు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినా సాధ్యం కాకపోతే.. దానికి సరైన పరిష్కారం డాక్టర్ దగ్గరే దొరుకుతుంది. 

Latest Videos

click me!