ఇది కలిపిన చపాతీలు తింటే.. ఫాస్ట్ గా బరువు తగ్గుతారు, కొలెస్ట్రాల్ కరుగుతుంది

First Published | Sep 8, 2024, 10:16 AM IST

చాలా మంది రాత్రిపూట అన్నానికి బదులుగా చపాతీలనే తింటుంటారు. ఎందుకంటే ఈ చపాతీలు బరువు పెరగకుండా చేస్తాయని. ఇదొక్కటే కాదు చపాతీలను ఒక విధంగా తింటే మీ ఒంట్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. 

శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యానికి అస్సలు  మంచిది కాదు. ఎందుకంటే ఇది గుండె పోటు, స్ట్రోక్ తో పాటుగా గుండె జబ్బులు వచ్చేలా చేస్తుంది.

అయితే ఈ కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి  లేదా నియంత్రించడానికి ఎన్నో రకాల మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటితోనే కాకుండా.. మీరు ఆహారంతో కూడా నియంత్రించొచ్చంటున్నారు నిపుణులు. 

ముఖ్యంగా చపాతీలతో. అవును చపాతీలను తిన్నా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అయితే ఇందుకోసం గోధుమ పిండిలో కొన్నింటిని కలపాల్సి ఉంటుంది. ఇవే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. 

ఫైబర్ ను పెంచండి

హార్వర్డ్ హెల్త్ ప్రకారం.. మీ రోజువారి ఆహారంలో ఫైబర్ కంటెంట్ మొత్తాన్ని పెంచితే చాలా సులువుగా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగితే ఆటోమెటిక్ గా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కాబట్టి చపాతీ పిండిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వాటిని మిక్స్ చేయాలి. 

Latest Videos


ఓట్స్ : ఓట్స్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో పెద్ద మొత్తంలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తొందరగా తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అంతేకాదు ఇది మీ కడుపును తొందరగా నింపి, ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తుంది. 

వీటిని తింటే మీరు ఈజీగా బరువు కూడా తగ్గుతారు. ఇందుకోసం ఓట్స్ ను గ్రైండ్ చేసి పిండిలా చేసుకోండి. ఈ పిండిని గోధుమ పిండిలో కలపి చపాతీలు చేసుకుని తినండి. ఈ చపాతీ మీ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది.
 

chapati

అవిసె గింజలు:  అవిసె గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ తో పాటుగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

ఇవి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. వీటిని కూడా పిండిలా చేసి గోధుమ పిండిలో కలిపి చపాతీలు చేయండి.

chapati

చియా విత్తనాలు :  బరువు తగ్గాలనుకునేవారికి చియా విత్తనాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ చియా విత్తనాల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.

ఈ చియా విత్తనాలను గ్రైండ్ చేసి గోధుమ పిండిలో మిక్స్ చేసి చపాతీలు చేయండి. ఈ చపాతీలను తింటే మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా.. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. 

chapati

బాదం పిండిని: మనలో చాలా మంది రోజూ ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పులను తింటుంటారు.ఇది బరువును తగ్గించడమే కాకుండా.. మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. అయితే మీరు బాదం పిండిని కూడా ఉపయోగించొచ్చు. 

అవును బాదం పిండిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మొక్కల స్టెరాల్స్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునే వారు బాదం పిండిని గోధుమ పిండిలో మిక్స్ చేసి చపాతీలు చేయొచ్చు. 

click me!