తాజా పాలు అందరికీ అందుబాటులో ఉండవు. అందుకే చాలా మంది ప్యాకెట్ పాలను ఉపయోగిస్తుంటారు. కానీ ఈ ప్యాకెట్ పాలు కూడా ఇంట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అందుకే చాలా మంది మిల్క్ పౌడర్ ను బాగా ఉపయోగిస్తుంటారు. పాల పౌడర్ అనేది పాశ్చరైజ్డ్ స్కిమ్ పాల నుంచి నీళ్లను మొత్తం తీసేసిన తర్వాత తయారైన పొడి పాల పొడి. ఇది పాల లాగే మన శరీరానికి మంచి పోషణను అందిస్తుంది. ఈ పాల పొడిలో ప్రోటీన్, పొటాషియం, రిబోఫ్లేవిన్, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటాయి.