వంటగదిలో పనిచేసేటప్పుడు ఆడవాళ్లు చేతులు తరచుగా కాలడం మీరు గమనించే ఉంటారు. తొందర తొందరగా వంట చేయాలని, లేదా వంటలో నిమగ్నమవ్వడం వల్ల వేడి వేడి గిన్నెలను పట్టుకోవడం లేదా అవి తగలడం, లేదా వేడి వేడి నూనె పడటం జరుగుతుంటుంది. దీనివల్ల చేతులు కాలుతాయి. ముఖ్యంగా పోపు చేసే సమయంలో వేడి నూనె పెడి బొబ్బలు వచ్చిన సందర్భాలు ప్రతి ఒక్క ఆడవారికి ఉంటాయి. అయితే చాలా మంది తెలియక కాలినప్పుడు మంటను తట్టుకోలేక వెంటనే కాలిన గాయంపై నీళ్లు పోసేస్తుంటారు. కానీ దీనివల్ల బొబ్బలు వస్తాయి. గాయం కూడా పెద్దది అవుతుంది. ఇది మానడానికి చాలా సమయం పడుతుంది. ఇలా కాకూడదంటే కాలిన వెంటనే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.