స్నానం చేసిన వెంటనే ఏం చేయొద్దో తెలుసా?

First Published | May 30, 2024, 3:23 PM IST

ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ గా స్నానం చేయాలి. స్నానంతో ఒంటికి అంటుకున్న చెమట, దుమ్ము, ధూళి, బ్యాక్టీరియాలు వదిలిపోతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం స్నానం చేసిన తర్వాత కొన్ని పనులు మాత్రం చేయొద్దు.
 

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తినడం, తాగడం మొదలుకొని శారీరక వ్యాయామంపై కూడా దృష్టి పెట్టాలి. అలాగే ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి రోజూ స్నానం చేయాలి. స్నానం మన శరీరాన్ని శుభ్రపరచడంతో పాటుగా మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. అయితే స్నానం చేసిన వెంటనే కొన్ని పనులు చేయడం నిషిద్ధమన్న సంగతి మీకు తెలుసా? అవును స్నానం చేసిన తర్వాత కొన్ని పనులు చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే? 
 

water

నీరు తాగకూడదు

మన శరీరానికి నీళ్లు అవసరమే అయినా.. స్నానం చేసిన వెంటనే నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే స్నానం చేసేటప్పుడు మన శరీర ఉష్ణోగ్రత, రక్త ప్రసరణ భిన్నంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో.. స్నానం చేసిన వెంటనే నీళ్లను తాగడం వల్ల శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. 
 


రక్తపోటు అసమతుల్యత

స్నానం చేసిన వెంటనే నీళ్లు తాగితే రక్తప్రసరణపై ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఎందుకంటే ఇది మీ రక్తపోటు కూడా అసమతుల్యతగా మారుతుంది. దీనివల్ల మీ రక్తపోటు బాగా పెరుగుతుంది.

డ్రైయ్యర్.. 

స్నానం చేసిన తర్వాత చాలా మంది డ్రైయ్యర్ ను ఉపయోగిస్తుంటారు. కానీ తడి జుట్టును డ్రైయర్ తో ఎప్పుడూ కూడా ఆరబెట్టకూడదు. ఇలా చేయడం వల్ల జుట్టులోని సహజ తేమ తొలగిపోతుంది. అలాగే ఇది జుట్టును డ్రైగా మారుస్తుంది.  తడి జుట్టుకు డ్రైయర్ ను వాడితే జుట్టు పొడిబారుతుంది. దీనివల్ల మీ జుట్టు రాలడం, స్ప్లిట్ హెయిర్ సమస్యలు వస్తాయి. 
 

bath

చర్మాన్ని రుద్దకూడదు 

స్నానం చేసిన తర్వాత టవల్ తో చర్మాన్ని బాగా రుద్దుతుంటారు. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల చర్మం డీహైడ్రేట్ అవుతుంది.

చర్మంలో దురద సమస్య

స్నానం చేసిన తర్వాత చర్మాన్ని రుద్దినప్పుడు చర్మం నీటి కణాలను బయటకు లాగుతుంది. ఇది చర్మం పొడిబారేలా చేస్తుంది. అలాగే ఇది దురద సమస్యలను కలిగిస్తుంది. 
 

ఎండలో బయటకు వెళ్లకూడదు

స్నానం చేసిన వెంటనే ఎండకు బయటకు వెళ్లే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ స్నానం చేసిన వెంటనే ఎండకు బయటకు వెళ్లకూడదు. ఎందుకంటే మిమ్మల్ని చల్లగా, వేడిగా చేస్తుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 

Latest Videos

click me!