ఇంట్లోకి చీమలు రావొద్దంటే ఏం చేయాలి?

First Published | Jun 18, 2024, 12:46 PM IST

ఈ సీజన్ లో ఎక్కడ చూసినా చీమలు, ఈగలు వస్తూనే ఉంటాయి. ఈగలను ఏదో ఒకటిచేసి తరిమికొట్టొచ్చు కానీ.. చీమలను మాత్రం ఇంట్లో నుంచి వెళ్లగొట్టలేం. ఏదో ఒక దారిగుండా చీమలు ఇంట్లోకి వస్తూనే ఉంటాయి. అయితే కొన్ని రకాల మొక్కలు మీ ఇంట్లోకి ఒక్క చీమ కూడా రాకుండా చేస్తాయి తెలుసా?
 

ఎండాకాలంలో చీమలు ఇంట్లో బాగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మూలల్లో స్థవరాలు ఏర్పరుచుని ఇంట్లోని ఫుడ్ ను తినేస్తుంటాయి. ముఖ్యంగా వంటింట్లో చీమలు ఎక్కువగా ఉంటాయి. నిజానికి బయట ఎండవల్ల చీమలు ఇంట్లోకి వస్తుంటాయి. ఈ చీమలు రాకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఆడవారు. అయినా చీమలు మాత్రం ఇంట్లోకి రావడం ఆపవు. కానీ కొన్ని రకాల మొక్కలతో ఇంట్లోకి ఒక్క చీమ కూడా రాదంటున్నారు నిపుణులు. అవి ఏయే మొక్కలు అంటే? 

పుదీనా మొక్క 

పుదీనా ఆకులను వంటల్లో బాగా ఉపయోగిస్తారు. దీని ఘాటైన వాసన, రుచి ఫుడ్ ను మరింత టేస్టీగా చేస్తుంది.అయితే ఈ పుదీనా మొక్కతో కూడా ఇంట్లోకి చీమలు రాకుండా చేయొచ్చు. అవును పుదీనా బలమైన వాసన చీమలను తరిమికొట్టడంలో బాగా సహాయపడుతుంది. పుదీనా వాసనకు ఇంట్లోకి చీమలు అస్సలు రావు. 
 

Latest Videos


Lavender

లావెంటర్ మొక్క 

లావెండర్ యొక్క సువాసన ఎంత బావుంటుందో మాటల్లో చెప్పలేం. ఇది మీ ఇంటిదగ్గర ఉంటే మీ ఇంటి వాతావరణం మొత్తం ఆహ్లాదకరంగా మారుతుంది. అయితే ఈ మొక్క నుంచి వచ్చే వాసనకు చీమలు, ఇతర కీటకాలు, పురుగులు ఒక్కటి లేకుండా పారిపోతాయి తెలుసా? 

lemon grass

లెమన్ గ్రాస్ 

లెమన్ గ్రాస్ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే దీన్ని ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు. అయితే లెమన్ గ్రాస్ మొక్కను చీమలను తరిమికొట్టడానికి కూడా ఉపయోగించొచ్చు. అవును లెమన్ గ్రాస్ మొక్క  సువాసన చీమలను తరిమికొట్టడానికి పనిచేస్తుంది. ఈ మొక్కను ఇంటి దగ్గర చాలా ఈజీగా పెంచొచ్చు. 
 

సెలెరీ 

చాలా మంది ఇంటి దగ్గర సెలెరీ మొక్కలను కూడా నాటుతుంటారు. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ మొక్కతో కూడా మీరు చీమలను తరిమికొట్టొచ్చు. దీన్ని కుండలో నాటి ఇంట్లో పెడితే ఇంట్లోకి ఒక్క చీమ కూడా రాదు. 
 

పవిత్ర తులసి 

తులసి మొక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను వదిలించుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే తులసి చీమలను తరిమికొట్టడానికి  కూడా సహాయపడుతుంది. దీని వాసనకు చీమలు పారిపోతాయి. 

click me!