హీరోయిన్ కృతి సనన్ సన్నగా ఉండటానికి ఇదంతా చేస్తుందా?

First Published | Jul 27, 2024, 2:43 PM IST

మామూలుగా సెలబ్రిటీలు బరువు అస్సలు పెరగరు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే బరువును మెయింటైన్ చేస్తుంటారు. అయితే అందరూ ఒకే పద్దతిని మాత్రం ఫాలో కారు. మరి హీరోయిన్ కృతి సనన్ ఇంత నాజూగ్గా, సన్నగా, ఫిట్ గా ఉండటానికి ఏం చేస్తుందో తెలుసుకుందాం పదండి.
 

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కృతి సనన్  ఒకరు. ఈ బ్యూటీ ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా.. టాలీవుడ్ లో కూడా మంచి మంచి ఆఫర్లను కొట్టేస్తోంది. మీరు గమనించారో లేదో కానీ.. ఈ హీరోయిన్ సినిమా సినిమాలకు బరువు పెరిగినట్టు కానీ, తగ్గినట్టు కానీ ఎన్నడూ కనిపించదు. ఎందుకంటే ఈ హీరోయిన్ తన ఫిట్ నెస్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. దీని వల్ల ఆమె శరీరం ఫిట్ గా, యాక్టివ్ గా ఉంటుంది. నిజానికి కృతి సనన్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. అసలు కృతి సనన్ ఫిట్ గా, హెల్తీగా, సన్నగా ఉండటానికి రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

వ్యాయామం

వ్యాయామం ప్రతి ఒక్కరికీ అవసరమే. ఎందుకంటే ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫిట్ గా చేస్తుంది. అందుకే కృతి సనన్  క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుందట. ఎన్ని పనులున్నా.. తప్పించుకోకుండా.. వ్యాయామం, యోగా లాంటివి ఖచ్చితంగా చేస్తుంది. 


పూర్తి శరీర వ్యాయామం 

కృతి సనన్ శారీరక వ్యాయామం కూడా చేస్తుందట. ఇదే ఆమెను మరింత ఫిట్ గా ఉంచుతుంది. కృతి ప్రతిరోజూ రకరకాల పనులు చేస్తుందట. అంటే బాట్ లిఫ్టింగ్ వంటివి. ఇది ఈ బ్యూటీ శరీరాన్ని ఫిట్ గా ఉంచుతుంది.

ధ్యానం

మనలో చాలా మంది ధ్యానాన్ని తేలిగ్గా తీసిపారేస్తారు. కానీ ధ్యానం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకే కృతి సనన్ తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి రెగ్యులర్ గా ధ్యానం కూడా చేస్తుందట. ధ్యానం వల్ల ఆమె శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

స్ట్రెచింగ్ 

కృతి సనన్ తన వర్కవుట్ రొటీన్ లో స్ట్రెచింగ్ కు కూడా ఫుల్ టైమ్ కేటాయిస్తుందట. ఈ స్ట్రెచింగ్ శరీర భంగిమను మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది. అలాగే శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా కూడా మార్చుతుంది.

వ్యాయామం 

కృతి సనన్  తనను తాను ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ ఎన్నో రకాల వ్యాయామాలు కూడా చేస్తుంది. ఈమె ప్రతిరోజూ జాగింగ్, ఆస్ట్రేలియన్ పుల్స్, స్క్వాట్స్ మొదలైనవి చేస్తుందట. వీటిని ఈ బ్యూటీ మర్చిపోకుండా ప్రతిరోజూ చేస్తుంది.

జిమ్

జిమ్ కు వెళ్లే అలవాటు ఎంతో మంచిది. ఇది శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే కృతి సనన్  కూడా ప్రతిరోజూ వ్యాయామం చేయడానికి జిమ్ కు వెళుతుందట. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా.. ఈ హీరోయిన్ జిమ్ లో గంటల తరబడి చెమటలను చిందిస్తుందట. అలాగే ఎక్సర్ సైజ్, జిమ్ లతో పాటుగా డైట్ విషయంలో కూడా ఈమె ఎంతో  శ్రద్ద పెడుతుంది. ఈ బ్యూటీ హెల్తీ ఫుడ్ ను మాత్రమే తింటుందట.  
 

Latest Videos

click me!