మెట్లు ఎక్కితే ఏమౌతుందో తెలుసా?

First Published | Jun 13, 2024, 11:57 AM IST

రోజూ ఏదో ఒక పనిమీద ఇంటి మెట్లు లేదా ఆఫీసులో మెట్లను ఎక్కుతుంటాం. దిగుతుంటాం. అసలు మెట్టను ఎక్కడం, దిగడం వల్ల ఏం జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? 
 

నిజానికి మనం రోజూ చేసే పనులు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగడతాయి. ఇలాంటి వాటిలో మెట్లను ఎక్కడం ఒకటి. అవును మెట్లను ఎక్కడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలుగుతాయి. అందుకే ఎలివేటర్లు, ఎస్కలేటర్లకు బదులుగా మెట్లనే ఎక్కాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. మెట్లను ఎక్కి దిగే వారు ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. 30 నిమిషాల మితమైన తీవ్రమైన శారీరక వ్యాయామం మొత్తం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ వ్యాయామం చేసే టైం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇలాంటి వారు పనిలో పనిగా మెట్లను ఎక్కి దిగితే సరిపోతుంది. అవును మెట్లను ఎక్కడం వల్ల కూడా మీరు ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటారు. 
 

రోజూ 30 నిమిషాలు మెట్లు ఎక్కడం వల్ల కలిగే ప్రయోజనాలు

ప్రతి రోజూ మెట్లు ఎక్కడం వల్ల శరీరంలో రక్త ప్రవాహం పెరుగుతుంది. అలాగే మీ హృదయ స్పందన రేటును పెంచుతుంది. మెట్లు ఎక్కడమనేది ఒక గొప్ప హృదయనాళ వ్యాయామం. మెట్లను ఎక్కడం వల్ల స్టామినా పెరుగుతుంది. రోజూ కొద్దిసేపు మెట్లు ఎక్కడం వల్ల మీకు గుండెజబ్బులొచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 


మెట్లు ఎక్కడం వల్ల మన శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మెట్లు ఎక్కడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఇది రోజువారీ పనుల నుంచి మనకు అవసరమైన విశ్రాంతిని అందిస్తుంది. అలాగే మెట్లు ఎక్కడం వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది.  ఇది మీ దృక్పథాన్ని,ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది.
 

రోజుకు ఎన్ని మెట్లు ఎక్కాలి?

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఒకేసారి పొడవైన మెట్లు ఎక్కాలి. లేదా కనీసం 50 మెట్లను ఎక్కాలని సాధారణంగా సిఫార్సు చేయబడింది. మిమ్మల్ని అలసిపోకుండా చేసే కష్టం, పొడవు మొత్తాన్ని ఎంచుకుని మెట్లను ఎక్కితే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. 

Latest Videos

click me!