ఎక్కువసేపు నిద్రపోతే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 6, 2024, 2:29 PM IST


ఈ మధ్యకాలంలో చాలా మంది.. పని ఒత్తిడి కారణంగా వారం మొత్తం సరిగా నిద్రలేకుండా పని చేసి, వీకెండ్ వచ్చేసరికి టైమ్ దొరికిందని.. మరి ఏ పనీ లేకుండా నిద్రపోతూన్నారు.

sleeping

ఈ రోజుల్లో అందరూ పోతే ఎక్కువసేపు నిద్రపోతున్నారు, లేదంటే…చాలా తక్కువ నిద్రపోతున్నారు. ఈ రెండూ ఆరోగ్యానికి హానికరమే. నిద్ర తక్కువగా పోతే ఎలాంటి సమస్యలు వస్తాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఎక్కువ నిద్రపోయినా కూడా సమస్యలు వస్తాయని మీకు తెలుసా? మరి, ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం…

ఈ మధ్యకాలంలో చాలా మంది.. పని ఒత్తిడి కారణంగా వారం మొత్తం సరిగా నిద్రలేకుండా పని చేసి, వీకెండ్ వచ్చేసరికి టైమ్ దొరికిందని.. మరి ఏ పనీ లేకుండా నిద్రపోతూన్నారు. ఎంతలా అంటే 12, 14 గంటలు పడుకోవడం చేస్తున్నారు. కానీ ఇలా చేయడం వల్ల ఏమౌతుందో  నిపుణులను అడిగి తెలుసుకుందాం

ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ గంటలు నిద్రపోవడం వల్ల శరీరం యాక్టివిటీస్ తగ్గిపోతాయి. దీని వల్ల తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వదు. ఆ తర్వాత.. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తూ ఉంటాయి. మలబద్దకం సమస్య కూడా ఏర్పడుతుంది.


sleep

ఎక్కువ గంటలు నిద్రపోవడం వల్ల తీసుకున్న  ఆహారం శరీరంలో ఫ్యాట్ గా పేరుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల.. అధిక బరువు పెరిగి, ఒబేసిటీ సమస్య వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు బాడీని యాక్టివ్ గా ఉంచితే ఈ ఒబేసిటీ సమస్య ఉండదు.

అంతేకాదు.. మీరు ఊహించని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే.. గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. రోజులో 8 నుంచి 9 గంటలు నిద్రపోతే..దాని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కానీ, అదే ఎక్కువ గంటలు పడుకుంటే ఆ గుండె సరిగా పని చేయడం మానేస్తుంది.

బెడ్ మీద పడుకుంటే హాయిగా ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ, ఎక్కువసేపు పడుకోవడం వల్ల నడుము నొప్పి కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. శరీరంలో రక్త ప్రసరణ కూడా సరిగా జరగదు. దీని వల్ల చాలా రకాల నొప్పులు,సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

sleep

తలనొప్పిగా ఉంటే పడుకుంటే తగ్గిపోతుంది చాలా మందికి . కానీ.. మరీ ఎక్కువగా నిద్రపోవడం వల్ల కూడా తలనొప్పి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ నిద్ర సెరోటినన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది తలనొప్పి కి కారణం అవుతుంది.

అంతేకాదు.. ఎక్కువ గంటలు నిద్రపోవడం వల్ల.. మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో బలహీనంగా మారిపోతాం. దాని వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు చుట్టిముట్టే ఛాన్స్ ఉంది. బద్దకం కూడా పెరిగిపోతుంది.

Latest Videos

click me!