ఒక నెల రోజుల పాటు ఉదయం తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

First Published Sep 7, 2024, 4:20 PM IST

మనం ఉదయం తినే ఫుడ్ వల్లే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటాం. రోజువారి పనులను చేసుకోగలుగుతాం. కానీ చాలా మంది బరువు తగ్గాలని ఉదయం తినడమే మానేస్తుంటారు. అయితే మీరు ఒక నెల పాటు బ్రేక్ ఫాస్ట్ ను తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా? 

బ్రేక్ ఫాస్ట్

అల్పాహారం మన రోజులో అతి ముఖ్యమైన భోజనమన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ మీరు ఒక నెల పాటు బ్రేక్ ఫాస్ట్ ను తినకపోతే ఏం జరుగుందని ఎప్పుడైనా ఆలోచించారా? 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బ్రేక్ ఫాస్ట్ ను మానేయడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. ఈ అలవాటు జీవక్రియలో మార్పులకు దారితీస్తుంది. అలాగే శరీర శక్తి స్థాయిలను తగ్గిస్తుంది. భిజ్ఞా పనితీరుపై ప్రభావం చూపడంతో ఎన్నో మార్పులకు దారితీస్తుంది. 

ప్రతిరోజూ ఉదయాన్నే తినడం వల్ల మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీతో ముడిపడి ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది జీవక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ మీరు ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ ను మానేయడం వల్ల  మీకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని డాక్టర్లు చెప్తున్నారు. 

బ్రేక్ ఫాస్ట్

న్యూట్రిషన్ జర్నల్ లో నిర్వహించిన ఒక అధ్యయనంలో.. బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేసే వారి శరీరంలో భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయని వెల్లడైంది. శరీరంలో శక్తి జీవక్రియను ప్రారంభించడానికి బ్రేక్ ఫాస్ట్ అవసరం.

కాబట్టి బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసే వారి శక్తి స్థాయిల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. అలాగే బాగా అలసిపోతారు. ఏకాగ్రతతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఒక నెలపాటు బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం వల్ల కలిగే హార్మోన్ల అసమతుల్యత ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. 

అభిజ్ఞా పనితీరు, మానసిక స్థితిలో మార్పులు

బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం వల్ల ముఖ్యంగా పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో అభిజ్ఞా పనితీరు బలహీనపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. హ్యూమన్ న్యూరోసైన్స్‌లో ఫ్రాంటియర్స్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో.. మానసిక స్థితిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషించే న్యూరోట్రాన్స్మిటర్ సెరోటోనిన్ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం ద్వారా ప్రభావితమవుతుందని కనుగొన్నారు.

ఒక నెల పాటు బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల సెరోటోనిన్ స్థాయిలు అస్తవ్యస్తం అవుతాయి. దీని వల్ల చిరాకు, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు వస్తాయి.

Latest Videos


బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం

బరువు, శరీర కూర్పులో మార్పులు

బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం, బరువు మధ్య సంబంధం గురించిన కొన్ని పరిశోధనలు ముఖ్యమైన విషయాలను వెల్లడించాయి. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు  సూచిస్తున్నాయి.  బ్రేక్ ఫాస్ట్ తర్వాత అతిగా తినడం,  ఆకలి నియంత్రణ లేకపోవడం, జీవక్రియ రేటు తగ్గడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. 

అయితే బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం, బరువు పెరగడం మధ్య ఎలాంటి సంబంధం లేదని ఇతర అధ్యయనాలు కనుగొన్నాయి. అలాగే కొంతమంది వ్యక్తుల్లో ఇది బరువు తగ్గడానికి కూడా ఇది దోహదపడుతుందని నివేదించాయి.

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల శరీర బరువుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధన అవసరమని వైద్యులు అంటున్నారు.

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు

దీర్ఘకాలికంగా మీరు  బ్రేక్ ఫాస్ట్ ను మానేయడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపునులు చెబుతున్నారు. ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఒక మెటా-విశ్లేషణ, బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల జీవక్రియ సిండ్రోమ్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్,  టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

గుండె సంబంధ వ్యాధులు:

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసే వ్యక్తులకు గుండెపోటు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు,  వాపు వల్ల కావొచ్చు. 

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం

టైప్ 2 డయాబెటిస్:

పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంతో పాటుగా ఎన్నో  అధ్యయనాలు.. బ్రేక్ ఫాస్ట్  ను స్కిప్ చేయడం  వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ, గ్లూకోజ్ జీవక్రియపై క్రమరహిత భోజన నమూనాల ప్రభావం వల్ల కావొచ్చు.

పోషకాహార లోపాలు: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు  శరీరానికి తగినంత అందవు. ఇది దీర్ఘకాలంలో మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

click me!