ఆశాడంలోనే వాన గ్యాప్ ఇవ్వకుండా పడుతోంది. ఇక శ్రావణ మాసంలో ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వర్షాకాలంలో.. వర్షంలో తడిచే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొంతమంది అనుకోకుండా వానలో తడవాల్సి వస్తుంది. నిజానికి వానలో తడవడం సరదాగా ఉంటుంది. వర్షంలో తడవకూడదు, దగ్గు, జలుబు, జ్బరం వస్తుందని చాలా మంది చెప్తుంటారు. కానీ వర్షంలో తడిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ రెయిన్ బాత్ మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.